




Best Web Hosting Provider In India 2024
ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్.. కోకో గాఫ్‌దే టైటిల్.. ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
అమెరికా యువ సంచలన టెన్నిస్ ప్లేయర్ కోకో గాఫ్ అదరగొట్టింది. కెరీర్ లో ఫస్ట్ టైమ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ సొంతం చేసుకుంది. 2002లో సెరెనా విలియమ్స్ తర్వాత రోలాండ్ గారోస్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్సు అమెరికన్ ప్లేయర్ గా కోకో గాఫ్ నిలిచింది. ఫైనల్లో సబాలెంకాను ఓడించింది.
ఫ్రెంచ్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విన్నర్ ఎవరో తేలిపోయింది. రసవత్తరంగా సాగిన ఈ టోర్నీలో అంచనాలను దాటి కోకో గాఫ్ టైటిల్ పట్టుకుపోయింది. శనివారం (జూన్ 7) హోరాహోరీగా సాగిన ఫైనల్లో రెండో కోకో గాఫ్ 6-7 (5), 6-2, 6-4 తేడాతో టాప్ సీడ్ అరీనా సబాలెంకాకు షాకిచ్చింది. తొలి సెట్ ఓడిపోయిన తర్వాత కూడా అద్భుతంగా పుంజుకున్న 21 ఏళ్ల గాఫ్.. వరుసగా తర్వాతి రెండు సెట్లు గెలిచి ఫస్ట్ టైమ్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ఖాతాలో వేసుకుంది.
తొలి సెట్ సబాలెంకాదే
ప్రపంచ నంబర్ వన్ సబాలెంకా (బెలారస్), నంబర్ టూ కోకో గాఫ్ (అమెరికా) మధ్య ఫ్రెంచ్ ఓపెన్ 2025 వుమెన్స్ సింగిల్స్ టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. 78 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెట్లో గాఫ్ ఓడిపోయింది. డబుల్ బ్రేక్ తో 4-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సబాలెంకా త్వరలోనే తన అడ్వాంటేజ్ కోల్పోయింది. గాఫ్ గొప్పగా పుంజుకుని సెట్ ను టైబ్రేకర్ కు మళ్లించింది. కానీ టైబ్రేకర్ లో సబాలెంకా పైచేయి సాధించింది. అద్భుతమైన షార్ట్ వాలీతో సెట్ ను కైవసం చేసుకుంది.
కోకో జోరు
తొలి సెట్ ఓడినా కోకో గాఫ్ పోరాటాన్ని వదల్లేదు. రెండో సెట్ నుంచి గొప్పగా పుంజుకుంది. నిరాశను పక్కనబెట్టి డబుల్ బ్రేక్ తో 4-1తో ఆధిక్యాన్ని సాధించి 6-2తో సునాయాసంగా సెట్ ముగించింది. నిర్ణయాత్మక మూడో సెట్లోనూ గాఫ్ దూకుడు కొనసాగించింది. సబాలెంకా వేగంగా పుంజుకుని సెట్ ను 3-3తో సమం చేయగా, తన తదుపరి సర్వీస్ గేమ్ లో బ్రేక్ పాయింట్ తో గాఫ్ తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది. ఊపు కొనసాగించి టైటిల్ సొంతం చేసుకుంది.
రొలాండ్ గారోస్ లో ఫస్ట్
21 ఏళ్ల అమెరికా చిన్నది కోకో గాఫ్ కు ఇదే ఫస్ట్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్. 2022లో ఇగా స్వియాటెక్ చేతిలో ఓడిన గాఫ్ రన్నరప్ గా నిలిచింది. ఇప్పుడు సబాలెంకాను ఓడించి రోలాండ్ గారోస్ లో ఫస్ట్ టైమ్ ఛాంపియన్ గా ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ పోరులో గాఫ్ 3 ఏస్ లు, 30 విన్నర్లు కొట్టింది. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన గాఫ్.. విక్టరీ తర్వాత ఫుల్ ఎమోషనల్ అయింది. కన్నీళ్లు పెట్టుకుంది. గాఫ్ కు ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2023లో యుఎస్ ఓపెన్ గెలిచింది. అప్పుడూ ఫైనల్లో సబాలెంకానే ఆమె ఓడించడం గమనార్హం.
ఆ రికార్డు
2002లో సెరెనా విలియమ్స్ తర్వాత రోలాండ్ గారోస్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన అతి పిన్న వయస్కురాలిగా, 2015లో సెరెనా తర్వాత రోలాండ్ గారోస్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి అమెరికన్ గానూ గాఫ్ రికార్డు సృష్టించింది. కెరీర్ లో ఆమెకు ఇది రెండో గ్రాండ్ స్లామ్. ఈ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ తో గాఫ్ రూ.24.94 కోట్లు (25.50 లక్షల యూరోలు) దక్కించుకుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link