



Best Web Hosting Provider In India 2024
ఒకేసారి రెండు డిగ్రీలు చేయెుచ్చు, చెల్లుబాటు అవుతాయి.. యూజీసీ కొత్త నిబంధనలు!
ఒకేసారి రెండు డిగ్రీ కోర్సులకు సంబంధించి యూజీసీ కొత్త సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. యూజీసీ ఉత్తర్వులకు ముందు ఒకేసారి తీసుకున్న రెండు డిగ్రీలు కూడా చెల్లుబాటు అవుతాయి.
ేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థులు ఒకేసారి పొందిన రెండు డిగ్రీల చెల్లుబాటు కొనసాగుతుంది. 2022 ఏప్రిల్‌లో జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్న మునుపటి సంవత్సరాల్లో ఒకేసారి రెండు అకడమిక్ ప్రోగ్రామ్స్ క్లెయిమ్‌పై నిషేధ నిబంధనను యూజీసీ తొలగించింది. కొత్త నిబంధనల ప్రకారం యూజీసీ ప్రమాణాల ప్రకారం విద్యార్థులు ఒకేసారి పొందిన రెండు డిగ్రీలు నోటిఫికేషన్ జారీకి ముందే చెల్లుబాటు అవుతాయి.
యూజీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒకేసారి రెండు డిగ్రీలు చేసిన లక్షలాది మంది విద్యార్థులకు ఎంతో ఉపశమనం లభించనుంది. సవరించిన ఆదేశాలను యూజీసీ జూన్ 5న వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. ఒకేసారి డబుల్ డిగ్రీ తీసుకోవాలనుకునే విద్యార్థులందరూ ఇప్పుడు సులభంగా తీసుకోవచ్చు. అయితే రెండింటి సమయం భిన్నంగా ఉండాలి. అప్పుడు మాత్రమే చెల్లుబాటు అయ్యేవిగా పరిగణిస్తారు. డబుల్ డిగ్రీకి సంబంధించి యూజీసీ ఏ మార్గదర్శకాలు, నియమాలను రూపొందించిందో చూద్దాం.
యూజీసీ మార్గదర్శకాలు
ఒకేసారి రెండు డిగ్రీలు తీసుకోవడం గురించి యూజీసీ కొన్ని మార్గదర్శకాలను ఇచ్చింది. ఈ నిబంధనలు, షరతులను పాటించడం ద్వారా మీరు డబుల్ డిగ్రీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు.
మీరు ఒక రెగ్యులర్, ఒక డిస్టెన్స్ మోడ్‌లో అడ్మిషన్ తీసుకోవాలి. రెగ్యులర్ మోడ్ నుండి 2 డిగ్రీలు తీసుకోవాలనుకుంటే, రెండు తరగతుల సమయం భిన్నంగా ఉండాలి. అప్పుడే మీ డిగ్రీ చెల్లుబాటు అవుతుంది.
డిస్టెన్స్ మోడ్‌లో రెండు డిగ్రీలు తీసుకోవాలనుకుంటే చేయవచ్చు. ఇందులో ఎటువంటి సమస్య ఉండదు. డిస్టెన్స్ మోడ్‌లో విద్యార్థులు రెండు డిగ్రీలను పొందవచ్చు.
పీహెచ్‌డీతో వేరే ఏ డిగ్రీని తీసుకోకపోవడం తప్పనిసరి.
ఆన్‌లైన్ మోడ్‌లో ఒక డిగ్రీని, డిస్టెన్స్ మోడ్‌లో ఒక డిగ్రీని తీసుకోవచ్చు. ఇది ఒక సెషన్‌లో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఒకే విశ్వవిద్యాలయం నుండి డిస్టెన్స్ మోడ్‌లో రెండు డిగ్రీలు తీసుకోవాలనుకుంటే దానిని సులభంగా చేయవచ్చు. అయితే తరగతి సమయం కొద్దిగా భిన్నంగా ఉండాలి. తరగతి సమయం ఒకేలా ఉంటే మీ డిగ్రీ చెల్లుబాటు కాదు.
ఒక విశ్వవిద్యాలయం నుండి ఒకే సెషన్‌లో సులభంగా రెండు డిగ్రీలు తీసుకోవచ్చు. రెగ్యులర్ మోడ్‌లో తరగతి సమయం మాత్రమే భిన్నంగా ఉండాలి.
రెండు విశ్వవిద్యాలయాల నుండి రెగ్యులర్ మోడ్‌లో రెండు డిగ్రీలను కూడా పొందవచ్చు. తరగతుల సమయం మాత్రమే భిన్నంగా ఉండాలి. రెండు విశ్వవిద్యాలయాలలో తరగతుల సమయం భిన్నంగా ఉంటే ఈ డిగ్రీ మీకు చెల్లుతుంది.
రెగ్యులర్, డిస్టెన్స్ మోడ్‌లో ఏ సెషన్‌లోనైనా అడ్మిషన్ తీసుకోవడం ద్వారా మీరు డబుల్ డిగ్రీని పొందవచ్చు.
Best Web Hosting Provider In India 2024
Source link