




Best Web Hosting Provider In India 2024
యువతి దారుణ హత్య- రొమ్ములను ‘ట్రోఫీ’గా దాచుకున్న రాక్షసుడు! నెట్‌ఫ్లిక్స్ సిరీస్ చూసి..
అమెరికాలో గతేడాది జరిగిన ఒక యువతి హత్య కేసులో ఒక వ్యక్తి తాజాగా దోషిగా తేలాడు. అతని ఫొన్లోని ఫొటోలు కేసులో కీలకంగా మారాయి. కొన్ని ఫొటోల్లో అతను కట్ చేసి ఉన్న ఆ యువతి రొమ్ములను పట్టుకుని కనిపించాడు.
అమెరికాలో ఓ యువతిని దారుణంగా హత్య చేసి, ఆమె రొమ్ములను ‘ట్రోఫీ’గా దాచుకున్న ఒక వ్యక్తి తాజాగా దోషిగా తేలాడు. అతని ఫోన్లో కనిపించిన ఫొటోలు చూసి కోర్టులో ఉన్న వారు షాక్ అయ్యారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు.
అసలేం జరిగింది?
అమెరికా విస్కాన్సిన్లో 2024 ఏప్రిల్‌లో జరిగింది ఈ ఘటన. 34ఏళ్ల మ్యాక్స్‌వెల్ ఆండర్సన్‌కు 19ఏళ్ల సాడె కర్లీనా రాబిన్సన్తో పరిచయం ఏర్పడింది. తొలిసారి వారిద్దరు డేట్‌కి వెళ్లారు. రెస్టారెంట్లో కొంత సమయం గడిపారు. ఆ తర్వాత ఆండర్సన్, ఆ యువతిని.. మిల్వాకీలోని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమె అతని ఇంటికి వెళ్లింది.
కానీ ఆ మరుసటి రోజు నుంచి ఆమె ఎవరికి కనిపించలేదు!
ఆ యువతి పిజ్జా స్టోర్‌లో పనిచేస్తూ, క్రిమినల్ జస్టిస్ చదువుకుంటోంది. మరుసటి రోజు ఆమె పనికి రాకపోవడంతో అనుమానం వచ్చి సంబంధిత వర్గాలు మిస్సంగ్ కేసు పెట్టాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టి, యువతి ఇంటిని తనిఖీ చేశారు. ఆమె కనిపించలేదు.
కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఒక ప్రదేశంలో ఒక కాలు కనిపించింది. ఆ తర్వాత నగరం వ్యాప్తంగా మనిషి చర్మం, పాదాలు సహా ఇతర అవయవాలు కనిపించాయి. వాటిని పరీక్షించగా.. రాబిన్సన్ డీఎన్ఏతో అవి మ్యాచ్ అయ్యాయి.
దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేశారు. చివరికి ఆండర్సన్ని అరెస్ట్ చేశారు. అతని ఫోన్లో పలు షాకింగ్ ఫొటోలు కీలక ఆధారాలుగా మారాయి.
ఈ కేసులో ఇటీవలే కోర్టు విచారణ జరిగింది. ఆండర్సన్ ఫోన్లోని ఫొటోలను జ్యూరీకి డిస్ప్లే చేశారు. కొన్ని ఫొటోల్లో అతను.. కట్ చేసి ఉన్న రాబిన్సన్ రొమ్ములను పట్టుకుని కనిపించాడు. రొమ్ములను అతను తన ట్రోఫీగా దాచుకున్నాడు.
ఫోన్లో ఉన్న ఫొటోలు కోర్టురూమ్లోని వారిని షేక్ చేసేశాయి. కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
“హత్య జరిగిన రోజు రాత్రి.. నిందితుడు- బాధితురాలు కలిసి లవ్, డెత్ అండ్ రోబోట్స్ అనే నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చూశారు. ఈ సిరీస్‌లోని ఒక ఎపిసోడ్లో మృతదేహన్ని ముక్కలు, ముక్కలు చేస్తారు. అవి బీచ్‌లో కనిపిస్తాయి,” అని అధికారులు జ్యూరీకి వివరించారు.
అంతేకాదు, ఆండర్సన్ ఇంటి కింద భాగంలో “సె* రూమ్”ని కూడా పోలీసులు కనుగొన్నారు. హ్యాండ్‌కఫ్‌లు ఇతర అనుమానాస్పద వస్తువులు వాటిల్లో ఉన్నాయి.
ఈ హత్యను ఆండర్సన్ నెలల పాటు ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాగా.. యువతిని హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని, ఆమె కారులోనే పెట్టి మిచిగాన్ చెరువుకు సమీపంలోని పార్కుకు వెళ్లాడు. అక్కడే మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. కొన్ని అవయవాలను అక్కడ వదిలేశాడు. అనంతరం ఆమె కారుకు నిప్పంటించి, బస్సులో వెనక్కి వెళ్లిపోయాడు.
ఈ మొత్తం వివరాలను విన్న జ్యూరీకి తీర్పును ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ కేసులో ఆండర్సన్ దోషి అని తేల్చారు. ఆగస్ట్ 15న ఆండర్సన్ శిక్ష ఖరారవుతుంది.
కాగా.. ఆండర్సన్ ఇలా ఎందుకు చేశాడు? అన్న విషయం తెలియరాలేదు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link