థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక పాజిటివ్ రెస్పాన్స్.. కారణం ఇదే!

Best Web Hosting Provider In India 2024

థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాక పాజిటివ్ రెస్పాన్స్.. కారణం ఇదే!

లాల్ సలామ్ సినిమా 15 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది. అందుకు ఓ కారణం ఉంది.

థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీ స్ట్రీమింగ్‍కు వచ్చాక పాజిటివ్ రెస్పాన్స్.. కారణం ఇదే!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కీలకపాత్రలో నటించిన లాల్ సలామ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ డిజాస్టర్ అయింది. ఈ పొటికల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. గతేడాది ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో రిలీజైన లాల్ సలామ్ నెగెటివ్ టాక్‍తో దారుణమైన ఫలితాన్ని మూటగట్టుకుంది. అయితే, ఓటీటీలోకి చాలా ఆలస్యంగా ఇటీవలే వచ్చిన ఈ మూవీకి స్ట్రీమింగ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఆ వివరాలివే..

ఓటీటీలోకి డిఫరెంట్ వెర్షన్.. అందుకే!

లాల్ సలామ్ చిత్రం ఇటీవలే జూన్ 6న సన్‍నెక్స్ట్ ఓటీటీలో తమిళంలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు 16 నెలలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, థియేటర్ వెర్షన్‍తో పోలిస్తే సన్‍నెక్స్ట్ ఓటీటీలోకి ఈ మూవీ డిఫరెంట్ వెర్షన్ అడుగుపెట్టింది. కాస్త ఎక్కువ రన్‍టైమ్‍తో 2 గంటల 42 నిమిషాలుగా వచ్చింది. అయితే, రన్‍టైమ్ పెరగడంతో పాటు ఎడిటింగ్, పేస్‍లోనూ మూవీ టీమ్ మార్పులు చేసింది.

లాల్ సలామ్ ఓటీటీ వెర్షన్‍ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పాజిటివ్‍గా రెస్పాండ్ అవుతున్నారు. థియేట్రికల్ వెర్షన్ కంటే చాలా మెరుగ్గా ఉందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రం ఎమోషనల్‍గా కనెక్ట్ అయ్యేలా ఉందని, గ్రిప్పింగ్‍గా అనిపిస్తోందని కొందరు అభిప్రాయపడ్డారు. డిఫరెంట్ వెర్షన్ కారణంగా లాల్ సలామ్‍కు ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది.

క్రికెట్, మతకలహాల అంశాలతో..

లాల్ సలామ్ చిత్రాన్ని క్రికెట్, మతకలహాల అంశాలతో స్పోర్ట్స్ యాక్షన్ చిత్రంగా డైరెక్టర్ ఐశ్వర్య తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎమోషనల్‍గా కనెక్ట్ అవలేదని, సాగదీతగా అనిపించిందని థియేటర్లలో రిలీజైనప్పుడు మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు సరిగా రాబట్టలేకపోయింది. సుమారు రూ.80కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.20కోట్ల కలెక్షన్లు కూడా సాధించలేకపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలో మాత్రం డిఫరెంట్ వెర్షన్‍తో ఆకట్టుకుంటోంది.

లాల్ సలామ్ మూవీలో మోహినుద్దీన్ భాయ్ అనే కీలక పాత్ర చేశారు రజినీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ చేయగా.. సెంథిల్, జీవిత రాజశేఖర్, కేఎస్ రవికుమార్, తంబి రామయ్య, నిరోష, అనంతిక, వివేక్ ప్రసన్న, లివింగ్‍స్టన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024