బ్రహ్మముడి జూన్ 9 ఎపిసోడ్: యామినికి కత్తి గాట్లు- ప్లేట్ తిప్పేసిన రాజ్- రుద్రాణి వార్నింగ్-పెళ్లి ఆపేందుకు కావ్య ప్లాన్

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జూన్ 9 ఎపిసోడ్: యామినికి కత్తి గాట్లు- ప్లేట్ తిప్పేసిన రాజ్- రుద్రాణి వార్నింగ్-పెళ్లి ఆపేందుకు కావ్య ప్లాన్

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ జూన్ 9 ఎపిసోడ్‌లో యామినితో పెళ్లి ఇప్పుడే వద్దని రాజ్ చెబుతాడు. దాంతో యామిని కత్తితో చేయి కోసుకుంటుంది. దాన్ని ఆపిన రాజ్ కత్తిగాట్లకు డెటాల్ రాస్తూ యామినితో పెళ్లికి ఒప్పుకుంటాడు. యామినితో రాజ్ పెళ్లికి రెడీ అయ్యాడని రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది. దాంతో అపర్ణ టెన్షన్ పడుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 9వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో యామిని ఇంటికి వచ్చిన రాజ్‌తో ఎల్లుండే కదా మీ పెళ్లి అని యామిని తల్లి వైదేహి అంటుంది. దాంతో రాజ్ మర్చిపోయానంటాడు. మర్చిపోతావు బావ. రిసార్టులో నన్ను మర్చిపోయావ్. నిన్న రాత్రంతా ఎక్కడికి వెళ్లిపోయావ్. నీకోసం ఎదురుచూస్తూ ఉన్నాను. నీకోసం రిసార్టులో ఓ పిచ్చిది ఉంది. దానికి చెప్పాలని కూడా అనిపించలేదా అని యామిని అంటుంది.

నీ మీద అలిగాను

నీ మీద అలిగాను బావ అని యామిని అంటుంది. చెప్పకుండా వెళ్లడం తప్పే. రాత్రి కొంతమంది రౌడీలు వెంటపడటంతో అడవిలో ఇరుక్కుపోయాం. పోలీసులు వచ్చి కాపాడేసరికి బయటపడ్డాం అని రాజ్ చెబుతాడు. దాంతో యామిని షాక్ అవుతుంది. అంటే, కావ్యను చంపడానికి నేను పంపించిన రౌడీలు అరెస్ట్ అయి చచ్చారన్నమాట అని యామిని మనసులో అనుకుంటుంది.

విషయం తెలియక అన్నాం. ముందు ఫ్రెష్ అయి రా అని యామిని అంటుంది. యామిని నీతో ఓ విషయం చెప్పాలి. నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. అందుకే ఈ పెళ్లిని కొద్దిరోజులు పోస్ట్‌పోన్ చేయాలనుకుంటున్నాను అని రాజ్ అంటాడు. దాంతో యామిని, తల్లిదండ్రులు షాక్ అవుతారు. అందరికి పెళ్లి పత్రికలు పంచాం. తీరా ముహుర్తం టైమ్ ప్లేట్ తిప్పేస్తే దాని లైఫ్ ఏం అవుతుందో ఆలోచించారా అని వైదేహి అంటుంది.

షటప్.. అవతల బావకు పెళ్లి ఇష్టం లేదని చెబుతుంటే ఈ డెకరేషన్ ఎందుకు పూలదండలు ఎందుకు అని అన్నింటిని పీకేస్తుంది. పనివాళ్లపై అరిచి పంపిచేస్తుంది. పిచ్చిపట్టినట్లు చేస్తుంది. రాజ్ ఆపుతాడు. నీకిష్టం లేని పని ఏది చేయను. అందుకే పూలదండలు తీసేస్తున్నాను. నీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. కానీ, జ్ఞాపకాల్లో మిగిలిపోతావనుకోలేదు అని యామిని అంటుంది.

చేయి కోసుకున్న యామిని

భార్యను ఎలాగు కాలేకపోతున్నాను. నీ ఒడిలో అయినా చనిపోనివ్వు బావ అని కత్తి పట్టుకుని చేయి కోసుకుంటుంది యామిని. రాజ్, తల్లిదండ్రులు వచ్చి ఆపుతారు. అయినా యామిని ఆగదు. దాంతో యామిని లాగిపెట్టి కొడతాడు రాజ్. డెటాల్ తీసి యామిని కత్తిగాట్లపై రాస్తాడు. నీకేమైనా పిచ్చిపట్టిందా. బుర్ర పనిచేస్తుందా. పెళ్లి వద్దంటే చచ్చిపోతావా అని రాజ్ అంటాడు.

ఇంకేం చేయమంటారు. ఇవాళ అంటే కాపాడారు. రేపు, ఎల్లుండి. అందరిని బాధపెట్టేబదులు ఒకేసారి చచ్చిపోవడం బెటర్ కదా. నువ్ ఎలాగు పెళ్లి చేసుకోవు. కనీసం చావనైనా చావని రామ్ అని తల్లిదండ్రులు అంటారు. నేను పెళ్లి చేసుకోను అనట్లేదు. ఇప్పుడు వద్దంటున్నాను అని రాజ్ అంటాడు. పెళ్లి వద్దన్నవాడివి రేపు మా అమ్మాయి వద్దంటావ్ అనవని గ్యారేంటీ ఏంటీ అని వైదేహి అంటుంది.

అసలు నీ మనసులో ఏముంది. నీకు మా అమ్మాయి యామిని అంటే ఇష్టమో కాదో చెప్పండి. మీరు ఊ అంటే మెడ వంచి తాళి కట్టించుకుంటుంది. లేదంటే ఉరి వేసుకుంటుంది అని వైదేహి అంటుంది. వద్దు నా కారణంగా ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకుంటాను. పెళ్లి పనులు మొదలుపెట్టండి రాజ్ అంటాడు. దాంతో అంతా సంతోషిస్తారు.

పెళ్లి పనులు మొదలుపెట్టండి

నువ్ భయంతో చెబుతున్నావని యామిని అంటే.. లేదు మనస్ఫూర్తిగా చెబుతున్నా. పెళ్లి పనులు మొదలుపెట్టండి అని రాజ్ వెళ్లిపోతాడు. అనుకుంది సాధించానని యామిని అనుకుంటుంది. తర్వాత ఇందిరాదేవి కాల్ చేస్తే రాజ్ లిఫ్ట్ చేయడు. అదేపనిగా కాల్ చేస్తుంది ఇందిరాదేవి. అయినా లిఫ్ట్ చేయడు రాజ్. దానికి ఎందుకు కంగారు అని సుభాష్ అంటాడు.

వాడు అది ఇది చెప్పి లేట్ చేస్తున్నాడు. ఇలా చేస్తే పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది అని ఇందిరాదేవి అంటుంది. రాత్రంతా ఫారెస్ట్‌లో ఉన్నాడుగా అందుకే లిఫ్ట్ చేయట్లేదేమో అని అప్పు అంటుంది. రాజ్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు. ఇవాళ ఏం వారం. సోమవారం. బుధవారమే రాజ్‌తో యామిని పెళ్లి. పెళ్లి కార్డ్‌లో డేట్ ఉంది. అప్పుడే మర్చిపోయారా అని రుద్రాణి అంటుంది.

రాజ్ వచ్చి కావ్యను పెళ్లి చేసుకుంటాడు అని ప్రకాశం అంటాడు. యామిని పెళ్లి పనుల్లో రాజ్ బిజీగా ఉన్నాడు. అందుకే మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని రుద్రాణి అంటుంది. పెళ్లి ఎప్పటికి జరగదు అని ఇందిరాదేవి అంటుంది. రాజ్‌కి ఇష్టంతోనే పెళ్లి జరుగుతుంది. ఎలా ఆపుతారు. గతం గురించి చెబుతారా. అలా చెబితే రాజ్ బతుకుతాడా అని రుద్రాణి వార్నింగ్ ఇస్తుంది.

లిఫ్ట్ చేయని రాజ్

మేము ఎలాగో ఆపుతాం. నువ్ అపశకునపు మాటలు మాట్లాడకు అని రుద్రాణిని ఇందిరాదేవి అంటుంది. దాంతో బయటకు వెళ్లి ట్రై చేద్దామని అపర్ణను తీసుకుని ఇందిరాదేవి వెళ్తుంది. యామిని ఇంతపని చేస్తుందనుకోలేదు. నాకోసం ప్రాణాలు తీసుకుంటదనుకోలేదు అని రాజ్ ఆలోచిస్తాడు. మళ్లీ ఇందిరాదేవి కాల్ చేస్తే సారీ నానమ్మ నా దగ్గర ఆన్సర్ లేదు. క్షమించు అని రాజ్ అనుకుంటాడు.

రుద్రాణి చెప్పినట్లే వాడు నిజంగానే యామినితో పెళ్లికి రెడీ అయినట్లున్నాడు. యామిని ఏదో బ్లాక్ మెయిల్ చేసినట్లుంది. చివరిసారిగా మనవరాలితో కాల్ చేయిద్దాం అని ఇందిరాదేవి అంటుంది. ఈ విషయం కావ్యకు ఎలా చెప్పాలి. బాధలో ఉన్నదాంతో ఎలా కాల్ చేపించాలి అని అపర్ణ అంటుంది. అది బాధలో ఉంటే ఊరుకుందాం, లేకుంటే కాల్ చేయిద్దాం అని ఇందిరాదేవి అంటుంది.

దాంతో లోపలికి వెళ్లి చూస్తే కావ్య ఐస్‌క్రీం తింటూ ఉంటుంది. అది చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఐస్‌క్రీం కావాలా అని కావ్య అడిగితే.. పేడ కావాలి. నీ మొహానికి కొట్టి పిడకలు చేస్తా అని ఇందిరాదేవి అంటుంది. ఇది ఎలా నాటకాలు ఆడుతుందో. అక్కడ యామినిని రాజ్ పెళ్లి చేసుకుంటాడని బాధ కూడా లేదు అని అపర్ణ అంటుంది. సరే గానీ ముందు వాడికి కాల్ చేయమని కావ్యకు చెబితే చేయనని అంటుంది.

కావ్య ప్లాన్

తర్వాత దుగ్గిరాల ఇంటికి యామిని వచ్చి బొట్టు పట్టి ఎల్లుండే నాకు మా బావకు పెళ్లి అని చెబుతుంది. మేము మా కుటుంబం అంతా పెళ్లికి వస్తామని యామినిని పంపిస్తుంది కావ్య. అలా మాటిచ్చావేంటీ అని సుభాష్ అడిగితే.. యామినితో రాజ్ పెళ్లి ఆపేందుకు కావ్య ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది అని ఇందిరాదేవి అంటుంది. దాంతో రుద్రాణి ఆలోచనలో పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024