5 గంటల 29 నిమిషాల టెన్నిస్ మ్యాచ్.. 43 ఏళ్ల రికార్డు బద్దలు.. అత్యంత సుదీర్ఘమైన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్.. ఎవరు గెలిచారంటే?

Best Web Hosting Provider In India 2024


5 గంటల 29 నిమిషాల టెన్నిస్ మ్యాచ్.. 43 ఏళ్ల రికార్డు బద్దలు.. అత్యంత సుదీర్ఘమైన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్.. ఎవరు గెలిచారంటే?

కార్లోస్ అల్కరాజ్, జానిక్ సిన్నర్ మధ్య 2025 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఐదు గంటల 29 నిమిషాల పాటు సాగింది. ఇది ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘమైన ఫైనల్ గా నిలిచిపోయింది. మరి ఇందులో గెలిచి, ఎవరు ట్రోఫీ సొంతం చేసుకున్నారో తెలుసుకోండి.

జానిక్ సినర్, కార్లోస్ అల్కరాజ్ (AFP)

రోలాండ్ గారోస్ లో సరికొత్త హిస్టరీ క్రియేట్ అయింది. ఏకంగా అయిదు గంటల 29 నిమిషాల పాటు సాగిన ఫ్రెంచ్ ఓపెన్ 2025 ఫైనల్ కొత్త రికార్డు నమోదు చేసింది. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఫైనల్ గా ఇది నిలిచింది. ఆదివారం (జూన్ 8)న డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్, జానిక్ సినర్ మధ్య ఈ మెగా పోరు జరిగింది. ఇద్దరు ఆటగాళ్లు టైటిల్ కోసం కొదమ సింహాల్లా పోటీపడ్డారు.

టైటిల్ అతనిదే

రికార్డు ఫైనల్లో కార్లోస్ అల్కరాజ్ దే విజయం. ఈ స్పెయిన్ యువ సంచలనం ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నిలబెట్టుకున్నాడు. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో అల్కరాజ్ 4-6, 6-7 (4-7), 6-4, 7-6 (7-3), 7-6 (10-2) తేడాతో సినర్ ను ఓడించాడు. ఆరు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు టెన్నిస్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ అందించింది. చివరకు అల్కరాజ్ ట్రోఫీని ముద్దాడాడు.

రెండు సెట్లు కోల్పోయి కూడా

రెండు సెట్లు కోల్పోయిన తర్వాత స్పానిష్ ఆటగాడు అల్కరాజ్ అద్భుతంగా పుంజుకున్నాడు. సిన్నర్ ప్రారంభంలో ఆధిపత్యం చెలాయించి మొదటి రెండు సెట్లను 6-4, 7-6తో గెలుచుకున్నాడు. ఆ తర్వాత అల్కరాజ్ అద్భుతంగా పుంజుకుని మూడవ సెట్‌ను (6-4)తో గెలుచుకున్నాడు. ఆపై నాల్గవ సెట్‌ను కూడా (7-6)తో కైవసం చేసుకున్నాడు. ఐదవ సెట్ టై-బ్రేక్‌కు దారితీసింది, ఇందులో స్పానిష్ ఆటగాడు 10-2 తేడాతో విజయం సాధించి చివరి సెట్‌ను కూడా 7-6తో గెలుచుకున్నాడు.

ఆ రికార్డు బ్రేక్

రోలాండ్ గారోస్ ఫైనల్‌లో అల్కరాజ్ వర్సెస్ సినర్ పోరు అత్యంత సుదీర్ఘమైన మ్యాచ్. ఇది ఐదు గంటల 29 నిమిషాల పాటు కొనసాగింది. ఆదివారం నాటి మ్యాచ్‌కు ముందు, ఓపెన్ ఎరాలో లాంగెస్ట్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ 1982లో జరిగింది. అప్పుడు మాట్స్ విలాండర్ నాలుగు గంటల 47 నిమిషాల్లో గిల్లెర్మో విలాస్‌ను ఓడించాడు.

కామెంట్లు వైరల్

మ్యాచ్ అనంతరం అల్కరాజ్ సిన్నర్‌ను ప్రశంసిస్తూ.. “నువ్వు ఒక్కసారి కాదు చాలాసార్లు ఛాంపియన్‌ అవుతావని నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రతి టోర్నమెంట్‌లో నీతో కోర్టును పంచుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నీతో కలిసి చరిత్ర సృష్టించగలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను నేటి మ్యాచ్‌లో మీరు (ఫ్యాన్స్) చూపించిన గొప్ప మద్దతుకు నేను మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మీరు నా హృదయంలో ఉన్నారు. పారిస్‌కు చాలా ధన్యవాదాలు. వచ్చే ఏడాది కలుద్దాం” అని పేర్కొన్నాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link