





Best Web Hosting Provider In India 2024

మా అమ్మకు పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు.. నా బావ ప్రభాస్‌కు కృతజ్ఞతలు.. మోహన్ బాబు కామెంట్స్
మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న కన్నప్ప విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గుంటూరులో ఘనంగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్‌ను తాను బావ అని పిలుస్తానని చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ మూవీ ‘కన్నప్ప’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో నటించారు.
కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్
అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై డా. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27వ తేదీన కన్నప్ప సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 7న గుంటూరులో ఘనంగా కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో మోహన్ బాబు ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు.
డా. మోహన్ బాబు మాట్లాడుతూ .. “మా అమ్మకి పుట్టుకతో రెండు చెవులు వినిపించేవి కావు. అందరూ నా వాయిస్‌ని మెచ్చుకుంటుంటే ఆ మాటలు మా తల్లికి వినిపిస్తే ఎంత బాగుండేది అనుకునేవాడిని. జీవితంలో భయం అనేది ఉండకూడదు, తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడకూడదు, మా విద్యాలయాల్లో విద్యార్థులకు అదే నేర్పిస్తున్నాను” అని అన్నారు.
8 సంవత్సరాలు కష్టపడి
“కన్నప్ప సినిమాని ఆ పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా తీశాము. నా బిడ్డ ఎంతో కష్టపడ్డాడు.. ఎలా ఈ సినిమా తీసాడు అనేది నేను చెప్పదలచుకోలేదు. సినిమానే మాట్లాడుతుంది” అని మోహన్ బాబు తెలిపారు.
“నా కంటే చిన్నవాడు, నా భావ ప్రభాస్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేమిద్దరం బావా బావా అని పిలుచుకుంటాం. మా మధ్య ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. మానవత్వం, మంచి హృదయం ఉన్నవాడు ప్రభాస్. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్‌గా ఉన్న టాప్ హీరోలలో ప్రభాస్ ఒకడు. సినిమాలో నటించాలని కోరిన వెంటనే ఓకే చెప్పారు. ఆయన వందేళ్లు క్షేమంగా ఉండాలి” అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.
భారతం గర్వించదగ్గ నటుడు
“మోహన్ లాల్ వర్సటైల్ యాక్టర్. భారతం గర్వించదగ్గ నటుడు. ఈ మధ్యనే మలయాళంలో ఆయన నటించిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కన్నప్పలో చేయమని అడిగిన వెంటనే చేస్తానని అన్నారు. శరత్ కుమార్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం.. ఇలా అందరినీ ఆ భగవంతుడే ఈ సినిమాలోకి రప్పించాడు” అని మోహన్ బాబు పేర్కొన్నారు.
“ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్‌గా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నాకు డ్యాన్స్ అంటే ఏంటో నేర్పించారు. జూన్ 27న రాబోతోన్న ‘కన్నప్ప’ సినిమాను ఆశీర్వదించండి” అని నటుడు, నిర్మాత మోహన్ బాబు కోరారు.
సంబంధిత కథనం
టాపిక్