





Best Web Hosting Provider In India 2024

ఓటీటీల్లో ఒకే రోజు నాలుగు సూపర్ రిలీజ్‍లు.. సమంత సినిమా, వెంకటేశ్ యాక్షన్ క్రైమ్ సిరీస్‍తో పాటు..
ఓటీటీల్లో ఈ శుక్రవారం అదిరిపోయే రిలీజ్‍లు ఉన్నాయి. మూడు సినిమాలు, ఓ సిరీస్‍కు సీక్వెల్ వచ్చేస్తున్నాయి. రానానాయుడు సీజన్ 2తో పాటు సమంత నిర్మించిన శుభం చిత్రం ఇందులో ఉన్నాయి. ఆ నాలుగు రిలీజ్‍ల వివరాలు ఇవే.
వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈ శుక్రవారం (జూన్ 13) సూపర్ రిలీజ్‍లు ఉండనున్నాయి. ఆ రోజు రానున్న మూడు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ సీక్వెల్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన రానా నాయుడు సిరీస్‍కు రెండో సీజన్ ఆ రోజునే రానుంది. శుభం చిత్రం కూడా అడుగుపెట్టనుంది. ఓ మలయాళ చిత్రంతో మరో థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ శుక్రవారం ఒక్క రోజే రానున్న ఆ టాప్-4 రిలీజ్‍లు ఇవే..
శుభం
తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం జూన్ 13న జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీని స్టార్ హీరోయిన్ సమంత ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రంతోనే నిర్మాతగా ఆమె మారారు. ఈ లోబడ్జెట్ చిత్రం మే 9వ తేదీన థియేటర్లలో విడుదలై ఓ మోస్తరు సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రీయా కొంతం, చరణ్ పేరి, శ్రావణి లక్ష్మి లీడ్ రోల్స్ చేశారు. శుభం సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం నుంచి హాట్‍స్టార్ ఓటీటీలో ఈ మూవీని చూసేయవచ్చు. టీవీ సీరియళ్లు చూస్తూ మహిళలు వింతగా ప్రవర్తించడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది.
రానా నాయుడు సీజన్ 2
తెలుగు హీరోలు విక్టరీ వెంకటేశ్, దగ్గుబాటి రానా కలిసి నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్‍లో రెండో సీజన్ ఈ శుక్రవారం జూన్ 13వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. 2023 మార్చిలో వచ్చిన రానా నాయుడు ఫస్ట్ సీజన్ చాలా పాపులర్ అయింది. ఈ క్రైమ్ యాక్షన్ సిరీస్‍కు రెండేళ్ల తర్వాత ఇప్పుడు రెండో సీజన్ వస్తోంది. ఈ హిందీ వెబ్ సిరీస్‍కు కరణ్ ఆయుష్మాన్ దర్శకత్వం వహించారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంటుంది.
అలప్పుజ జింఖానా
మలయాళ యంగ్ హీరో నెస్లన్ గఫూర్ ప్రధాన పాత్ర పోషించిన అలప్పుజ జింఖానా మూవీని జూన్ 13న స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు సోనీలివ్ వెల్లడించింది. ఈ స్పోర్ట్స్ కామెడీ డ్రామా చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ మూవీకి ఖాలిద్ రహమాన్ దర్శకత్వం వహించారు. ఓ యువకుల బ్యాచ్ బాక్సింగ్ పోటీలకు సిద్ధమవడం చుట్టూ ఈ చిత్రం స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన అలప్పుజ జింఖానా మూవీ సూపర్ హిట్ అయింది.
లెవెన్
క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘లెవెన్’ జూన్ 13వ తేదీన ఆహా తమిళ్, టెంట్‍కొట్టా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. నవీన్ చంద్ర హీరోగా తమిళం, తెలుగుల్లో తెరకెక్కి మే 16న థియేటర్లలో ఈ చిత్రం విడుదలైంది. కాగా, తమిళ వెర్షన్ ఆహా తమిళ్, టెంట్‍కొట్టాలో జూన్ 13న రానుంది. తెలుగు వెర్షన్ కూడా అదే రోజు వస్తుందేమో చూడాలి. ఈ సినిమాకు లోకేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి థియేట్రికల్ రన్‍లో పాజిటివ్ టాక్ వచ్చింది. వరుస హత్యల ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ గ్రిప్పింగ్‍గా సాగుతుంది.
సంబంధిత కథనం