





Best Web Hosting Provider In India 2024

37 ఏళ్ల జెనీలియాతో రొమాన్స్.. 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ రియాక్షన్ వైరల్.. వయసు అడ్డంకి కాదన్న స్టార్ హీరో
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’. రిలీజ్ కు సిద్ధమైన ఈ మూవీలో 60 ఏళ్ల ఆమిర్.. 37 ఏళ్ల జెనీలియాతో రొమాన్స్ చేశారు. దీనిపై ఆయన రియాక్టవుతూ ఇక వయసు అడ్డంకి కాదని సంచలన కామెంట్లు చేశారు.
సినిమాల్లో సీనియర్ హీరోలు, తమకంటే వయసులో చాలా చిన్నవాళ్లయినా హీరోయిన్లతో రొమాన్స్ చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా వచ్చిన థగ్ లైఫ్ లో కమల్ హాసన్ ఇలాగే త్రిష, అభిరామితో రొమాన్స్ చేశారు. ఇప్పుడు త్వరలో రిలీజ్ కాబోతున్న బాలీవుడ్ ఫిల్మ్ ‘సితారే జమీన్ పర్’లో 37 ఏళ్ల జెనీలియాతో 60 ఏళ్ల ఆమిర్ ఖాన్ రొమాన్స్ చేశారు. ఈ రొమాన్స్, ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించినప్పుడు ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
23 ఏళ్ల ఏజ్ గ్యాప్
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్, జెనీలియా డి’సౌజా కలిసి సితారే జమీన్ పర్ సినిమాలో నటించారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఆమిర్ తన మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి జానే తు యా జానే నా సినిమాతో జెనీలియాను బాలీవుడ్‌కు పరిచయం చేశారు. ఇప్పుడు ఆమిర్, జెనీలియా మధ్య ఏజ్ గ్యాప్ 23 ఏళ్లు. ఈ నేపథ్యంలో జెనీలియాతో రొమాన్స్ చేయడంపై ఆమిర్ ఖాన్ రియాక్టయ్యారు.
నాక్కూడా తెలుసు
జెనీలియాతో రొమాన్స్ చేయడం గురించి ఆమిర్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకున్నారు. “యా.. నాకు తెలుసు (మేనల్లుడు సినిమాతో జెనీలియా ఎంట్రీ). కానీ అది చాలా కాలం క్రితం జరిగింది. ఇప్పుడు ఇమ్రాన్ కూడా నా వయస్సుకి దగ్గరగా ఉన్నాడు (నవ్వులు). నాకు ఆ ఆలోచన (ఏజ్ గ్యాప్) వచ్చింది. కానీ సినిమాలో మేము ఇద్దరం 40 ఏళ్ల వయస్సు గల పాత్రలు పోషించాం. ఆమె నా వయసులోనే ఉంది’’ అని ఆమిర్ ఖాన్ తెలిపారు.
అడ్డంకి కాదు
“నాకు 60 సంవత్సరాలు. కానీ ఈ రోజుల్లో మాకు వీఎఫ్ఎక్స్ సాంకేతికత ఉంది. ఇంతకుముందు నేను 18 ఏళ్ల యువకుడిగా నటించాలంటే.. ప్రోస్తేటిక్స్‌పై ఆధారపడాల్సి వచ్చేది. అనిల్ కపూర్ ఈశ్వర్ (1989)లో చేసినట్లు. అప్పటికీ అతను చాలా చిన్నవాడే కానీ 80 ఏళ్ల వృద్ధుడిగా నటించారు. ఈ రోజుల్లో వీఎఫ్ఎక్స్ ద్వారా అతన్ని 80 ఏళ్లుగా చూపించవచ్చు. కాబట్టి నటులకు వయస్సు ఇకపై అడ్డంకి కాదు” అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు.
ఆ మూవీకి సీక్వెల్
స్పోర్ట్స్ కామెడీ డ్రామా సితారే జమీన్ పర్.. ఆమిర్ నటించిన 2007 హిట్ చిత్రం తారే జమీన్ పర్ మూవీకి సీక్వెల్‌గా వస్తోంది. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆమిర్ భార్యగా జెనీలియా నటిస్తోంది. అలాగే ఆరూష్ దత్తా, గోపి కృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలి, ఆశిష్ పెండ్సే, రిషి షహానీ, రిషబ్ జైన్, నమన్ మిశ్రా మరియు సిమ్రాన్ మంగేష్కర్ వంటి 10 మంది కొత్త నటీనటులు కూడా ఉన్నారు.
స్పానిష్ చిత్రం కాంపియోన్స్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆమిర్ బాస్కెట్‌బాల్ కోచ్‌గా నటించారు. అతను దివ్యాంగుల పిల్లల జట్టుకు శిక్షణ ఇచ్చే కోచ్ క్యారెక్టర్ చేశారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.
సంబంధిత కథనం