





Best Web Hosting Provider In India 2024

ప్రైమ్ వీడియో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్.. దుమ్ము రేపుతున్న లేటెస్ట్ తెలుగు కామెడీ సినిమా.. లిస్టులో సగం తెలుగు మూవీసే..
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో తెలుగు మూవీసే సత్తా చాటుతున్నాయి. ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన తెలుగు కామెడీ మూవీ దూసుకెళ్తుండగా.. మరో నాలుగు కూడా టాప్ 10లో ఉన్నాయి.
ప్రైమ్ వీడియో ఓటీటీ ఇండియాలో ఈ వారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్ట్ వచ్చేసింది. కొన్ని వారాలుగా సత్తా చాటుతున్న తెలుగు సినిమాలు ఈ తాజా జాబితాలోనూ తమ ఉనికిని చాటుకున్నాయి. ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చిన సింగిల్ మూవీతోపాటు పెళ్లికాని ప్రసాద్, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఓదెల 2, సారంగపాణి జాతకంలాంటి సినిమాలు ఈ లిస్టులో ఉండటం విశేషం.
ప్రైమ్ వీడియో ట్రెండింగ్ మూవీస్
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో సోమవారం (జూన్ 9) ట్రెండింగ్ సినిమాల లిస్ట్ చూస్తే.. తొలి స్థానంలో హిందీ కామెడీ మూవీ భూల్ చుక్ మాఫ్ (Bhool Chuk Maaf) ఉంది. థియేటర్లలో రిలీజైన 15 రోజులకే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు ప్రైమ్ వీడియోలో మంచి ఆదరణ లభిస్తోంది. నవ్వులు పూయిస్తుండటంతోపాటు చివర్లో ఓ మంచి సందేశాన్ని కూడా ఇచ్చిన ఈ భూల్ చుక్ మాఫ్ సినిమాకు ఐఎండీబీలో 6.3 రేటింగ్ ఉంది.
ఇక రెండో స్థానంలో తెలుగు కామెడీ మూవీ సింగిల్ నిలిచింది. గత వారమే ఈ మూవీ కూడా ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలోనూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఓటీటీలోనూ అలాంటి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాకు ఐఎండీబీలో 6.5 రేటింగ్ ఉంది. శ్రీవిష్ణు కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా నిలిచిందీ మూవీ.
టాప్ 10లో మరో నాలుగు తెలుగు మూవీస్
ఇక ప్రైమ్ వీడియో ఇండియాలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాల్లో సింగిల్ కాకుండా మరో నాలుగు తెలుగు సినిమాలు ఉండటం విశేషం. ఈ మధ్యే ఈ ఓటీటీలోకి వచ్చిన పెళ్లి కాని ప్రసాద్ మూవీ 6వ స్థానంలో ఉంది. ఇక యాంకర్ ప్రదీప్ నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా 7, ఓదెల 2 మూవీ 8, సారంగపాణి జాతకం 9వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇలా టాప్ 10లో మొత్తంగా ఐదు తెలుగు సినిమాలే ఉండటం విశేషం.
ఇక మిగిలిన స్థానాల విషయానికి వస్తే.. మూడో స్థానంలో థ్రిల్లర్ మూవీ స్టోలెన్ కొనసాగుతోంది. ఓ ఆదివాసీ పాప కిడ్నాప్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. నాలుగో స్థానంలో ది అకౌంటెంట్ 2, ఐదో స్థానంలో ఫ్లైట్ రిస్క్, 10వ స్థానంలో వర్కింగ్ మ్యాన్ సినిమాలు ఉన్నాయి.
సంబంధిత కథనం