ప్రేమతో మీ జీ తెలుగు.. సరికొత్తగా బ్రాండ్ ఫిల్మ్.. ఆకట్టుకుంటున్న వీడియో.. మీరు చూశారా?

Best Web Hosting Provider In India 2024

ప్రేమతో మీ జీ తెలుగు.. సరికొత్తగా బ్రాండ్ ఫిల్మ్.. ఆకట్టుకుంటున్న వీడియో.. మీరు చూశారా?

Hari Prasad S HT Telugu

జీ తెలుగు ఛానెల్ తన బ్రాండ్ ప్రమోషన్ కోసం రూపొందించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జీ తెలుగు ఛానెల్లో వచ్చే సీరియల్స్ నటీనటులు అందరూ కనిపిస్తారు. ఓ పెళ్లి వేడుక చుట్టూ తిరిగే వీడియోనే ఈ ప్రేమతో జీ తెలుగు.

ప్రేమతో మీ జీ తెలుగు.. సరికొత్తగా బ్రాండ్ ఫిల్మ్.. ఆకట్టుకుంటున్న వీడియో.. మీరు చూశారా?

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న ఛానల్ జీ తెలుగు. ఈ ఛానెల్ తాజాగా తన బ్రాండ్ ప్రమోషన్ కోసం ఓ సరికొత్త వీడియోను రూపొందించింది. తెలుగు సాంప్రదాయంలో జరిగే ఓ అమ్మాయి పెళ్లిని ఇందులో చూపిస్తూ.. ప్రేమతో జీ తెలుగు అనే సరికొత్త నినాదాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఇప్పుడీ వీడియో బాగా వైరల్ అవుతోంది. తన లోగోని కూడా మార్చేసిన ఆ ఛానెల్.. సరికొత్తగా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తెలుగు సాంప్రదాయాలకు అద్దం పడుతూ..

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో రూపొందించిన ఈ జీ తెలుగు బ్రాండ్ ఫిల్మ్ తెలుగువారి సంప్రదాయాలను చక్కగా ప్రతిబింబిస్తుంది. ఈ బ్రాండ్‌ ఫిల్మ్‌లో సంప్రదాయానికి నిలువుటద్దంలా నిలిచే తెలుగువారి లోగిలిలో జరిగే పెళ్లి వేడుకను కళ్ళకు కట్టినట్లు చూపించారు.

మొత్తం జీ తెలుగు ఛానెల్లో వచ్చే సీరియల్స్, షోలలోని నటీనటులందరినీ ఇందులో చూడొచ్చు. బంధుమిత్రుల కోలాహలాల మధ్య తాటాకు పందిళ్లు, రంగవల్లులు, ఆవకాయ అన్నం, బూందీ లడ్డూ, కన్యాదానం, పెళ్లి బుట్టలాంటి సంప్రదాయ వేడుకలతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తెలుగువారి హృదయాలను హత్తుకుంది.

మమతతోనే మాట మధురం

అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురి వివాహానికి ముందు అనివార్య కారణాలతో సైనికుడైన తండ్రి విధుల్లో చేరవలసి వస్తుంది. ఆ వేడుకకు తండ్రి దూరంగా ఉన్నాడనే లోటు తెలియకుండా కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, స్నేహితులు అందరూ ఒక్కటై ఆ వివాహ వేడుకను వైభవంగా నిర్వహించారు.

విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సైనికుడికి ‘ఇంత పెద్ద కుటుంబం కారణంగానే పెళ్లి ఘనంగా జరిగింది’ అని భార్య గర్వంగా చెబుతుంది. ఈ వేడుక ‘మమతతోనే మాట మధురం’ అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

ఈ వేడుకలో జీ తెలుగు సీరియల్స్ నటీనటులైన జగద్ధాత్రి-కేదార్, అరుంధతి, భాగమతి, అమరేంద్ర, చామంతి-ప్రేమ్, ఆద్య-శ్రీను, రామలక్ష్మి-శౌర్య, భూమితోపాటు మరికొందరు సందడి చేశారు.

బ్రాండ్ ఫిల్మ్ ప్రత్యేకతలు ఇవీ..

ఈ బ్రాండ్ ఫిల్మ్ భారతదేశంలోనే మొదటిసారిగా ఏడు విభిన్న సాంస్కృతిక కథలతో రూపొందించిన బహుభాషా సిరీస్. 23వ జీ సినీ అవార్డ్స్ సందర్భంగా జీ జాతీయ, ప్రాంతీయ ఛానెల్స్‌తో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకేసారి ఈ బ్రాండ్ ఫిల్మ్ ప్రసారమైంది. ప్రముఖ గాయకులు రేవంత్, జయశ్రీ ఈ బ్రాండ్ ఫిల్మ్ తెలుగు ఒరిజినల్ ట్రాక్‌ను ఆలపించారు. ఈ పాట తెలుగువారి అనుబంధాలు, ప్రేమ, అభిమానం, ఆప్యాయతలను ప్రతిబింబిస్తుంది.

‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్ అన్ని ప్రసారాలు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో కొనసాగుతుంది. ఈ క్యాంపెయిన్‌లో జీ తెలుగు సీరియల్స్ జగద్ధాత్రి, నిండు నూరేళ్ల సావాసం, చామంతి, ఘరానా మొగుడు, పడమటి సంధ్యారాగం, ముక్కుపుడక నుంచి పలువురు నటీనటులతోపాటు మరికొందరు నటులు సందడి చేశారు. జీ తెలుగు కేవలం వినోదం పంచే ఛానల్​గానే కాకుండా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ కొనసాగుతుందని ‘ప్రేమతో.. జీ తెలుగు’ క్యాంపెయిన్ మరోసారి నిరూపించింది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024