




Best Web Hosting Provider In India 2024

ఓయూ పీహెచ్డీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల – ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు tg-ouphdcet.aptonline.in వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలు
ఉస్మానియా యూనివర్శిటీ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. మొత్తం ఈ పరీక్షలకు…. 9,747 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 7,907 మంది పరీక్షలకు హాజరు కాగా…. ఉత్తీర్ణత శాతం 62.60 గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- అభ్యర్థులు ముందుగా https://www.ouadmissions.com/doa/Home.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ – 2025 లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- డౌన్లోడ్ ర్యాంక్ కార్డు లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ఈ పరీక్షలను ఏప్రిల్ 25 నుంచి 27 వరకు నిర్వహించారు. మొత్తం 49 విభాగాల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. ర్యాంకులతో పాటు ఇంటర్వ్యూల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఓయూ పీహెచ్డీ – 2025 ఎంట్రెన్స్ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు…
టాపిక్
Osmania UniversityTelangana NewsTrending TelanganaEducation