బిట్​శాట్​ 2025 అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​.. ఇలా అప్లై చేసుకోండి..

Best Web Hosting Provider In India 2024

బిట్​శాట్​ 2025 అప్లికేషన్​కి ఈరోజే లాస్ట్​ ఛాన్స్​.. ఇలా అప్లై చేసుకోండి..

బిట్​శాట్​ పరీక్షకు ప్రిపేర్​ అవుతున్న విద్యార్థులకు కీలక అప్డేట్​! బిట్​శాట్​ 2025 సెషన్​ 2 పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ ప్రక్రియ నేటితో ముగియనుంది. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..

 
బిట్​శాట్​ 2025 అప్లికేషన్​ వివరాలు..
 

బిర్లా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజ్​ అండ్​ సైన్స్​ అడ్మిషన్​ టెస్ట్​ (బిట్​శాట్​)కి సంబంధించిన అప్లికేషన్​ ప్రాసెస్​ని నేడు, జూన్​ 10న ముగించనుంది బిట్స్​. అభ్యర్థులు bitsadmission.com అధికారిక వెబ్​సైట్​లో బిట్​శాట్​ 2025 సెషన్​ 2 పరీక్షకు రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

 

బిట్​శాట్​ 2025 రిజిస్ట్రేషన్​- ఇలా చేసుకోండి..

స్టెప్​ 1- బిట్స్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి (bitsadmission.com).

స్టెప్​ 2- ఫ్లోటింగ్​ నోటిఫికేషన్స్​లో “Click Here To Apply For BITSAT-2025 Session 2” అనే ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 3- బిట్​శాట్​ 2025 కోసం రిజిస్టర్​ బటన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 4- మీ పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, మొబైల్​ నెంబర్​, ఈమెయిల్​ అడ్రెస్​ వంటి వివరాలు ఇచ్చి బిట్​శాట్​ 2025కి రిజిస్టర్​ చేసుకోండి.

స్టెప్​ 5- జనరేట్​ ఓటీపీ అనే ఆప్షన్​ మీద క్లిక్​ చేయండి.

స్టెప్​ 6- మొబైల్​ నెంబర్​కి వచ్చిన ఓటీపీని ఎంటర్​ చేయండి.

స్టెప్​ 7- ఈమెయిల్​ ఐడీ, మొబైల్​ నంబర్​ వంటి క్రెడెన్షియల్స్​తో లాగిన్​ అవ్వండి.

స్టెప్​ 8- లాగిన్​ అయిన తర్వాత బిట్​శాట్​ 2025 కి అప్లై చేసుకండి.

బిట్​శాట్​ సెషన్​ 1 రాసిన అభ్యర్థులు మళ్లీ రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే అప్లికేషన్​ నెంబర్​, పాస్​వర్డ్​ని ఉపయోగించి బిట్​శాట్​ సెషన్​ 2కి అప్లై చేసుకోవచ్చు.

బిట్​శాట్​ 2025 రిజిస్ట్రేషన్​- అప్లికేషన్​ ఫీజు వివరాలు..

  • మేల్​- రూ. 3500
  • ఫీమేల్​- రూ. 3000
  • ట్రాన్స్​జెండర్​- రూ. 3000

నేటితో బిట్​శాట్​ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ముగుస్తుంది. అనంతరం జూన్​ 13, 14 తేదీల్లో అప్లికేషన్​ని ఎడిట్​ చేసే ఆప్షన్​ లభిస్తుంది. ఆ తర్వాత ఎడిట్​/ అప్డేట్​కి అనుమతి ఉండదు.

 

బిట్​శాట్​ 2025 పరీక్ష తేదీ..

బిట్​శాట్​ 2025 సెషన్​ 2 పరీక్ష జూన్​ 22 నుంచి జూన్​ 26 వరకు జరుగుతుంది.

మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు బిట్స్​ అధికారిక వెబ్​సైట్​ని ఎప్పటికప్పుడు చెక్​ చేస్తూ ఉండాలి.

భారతదేశంలో అత్యంత పేరుగాంచిన ఉన్నత విద్యాలయాలలో ఒకటి ఈ బిర్లా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజ్​ అండ్​ సైన్స్​. ఇందులో చేరేందుకు ప్రతియేటా 3లక్షలకుపైగా మంది విద్యార్థులు బిట్​శాట్​ పరీక్షను రాస్తుంటారు. ఇందులో పాసైన వారికి బిట్స్​ పిలానీ, బిట్స్​ గోవా, బిట్స్​ హైదరాబాద్​ క్యాంపస్​లలో సీటు లభిస్తుంది.

 
 


Best Web Hosting Provider In India 2024


Source link