నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 10: శాలినికి ఝలక్ ఇచ్చిన చంద్ర.. విరాట్ ఆశ్చర్యం.. వంటను చెడగొట్టేందుకు కుట్ర

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 10: శాలినికి ఝలక్ ఇచ్చిన చంద్ర.. విరాట్ ఆశ్చర్యం.. వంటను చెడగొట్టేందుకు కుట్ర

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ జూన్ 10: నల్లపూసలు మాయం చేసే కుట్రను ఎలా కనిపెట్టానో శాలినీకి చంద్ర చెబుతుంది. వార్నింగ్ కూడా ఇస్తుంది. ఫంక్షన్‍కు ఉండకుండా ఎక్కడికి వెళ్లాడనేది ఎలా కనిపెట్టానో విరాట్‍కు చంద్ర వివరిస్తుంది. చంద్ర వంటను పాడు చేసే కుట్ర జరుగుతుంది. ఎపిసోడ్ హైలైట్స్ ఇక్కడ చూడండి.

నిన్ను కోరి టుడే ఎపిసోడ్ జూన్ 10: శాలినీకి ఝలక్ ఇచ్చిన చంద్ర.. విరాట్ ఆశ్చర్యం.. వంటను చెడగొట్టేందుకు కుట్ర

నిన్ను కోరి సీరియల్ నేటి (జూన్ 10) ఎపిసోడ్‍లో.. మిమ్మల్ని ఎవరు ఎందుకు వదులుకున్నారో తెలియదు కానీ, వాళ్లు చాలా దురదృష్టవంతులు అని శ్యామలతో చంద్రకళ అంటుంది. ఆ తర్వాత చంద్రకు నల్లపూసల వేడుక జరుగుతుంది. విరాట్ చేతికి మంగళసూత్రం ఇవ్వాలని జగదీశ్వరికి శ్యామల చెబుతుంది. విరాట్‍కు జగదీశ్వరి అందిస్తుంది. చంద్రకళ మెడలో నల్లపూసలతో ఉన్న తాళిని వేస్తాడు విరాట్. చంద్ర ఆనందిస్తుంది. చంద్ర నా ప్లాన్ కనిపెట్టి జాగ్రత్త పడిందని శాలిని రగిలిపోతుంది.

ఇంకో సెట్ రెడీ చేశా.. శాలినీకి ఝలక్

నువ్వు ఏదో చేస్తావని అనుకుంటే, ఏమీ చేయలేకపోయావని శాలినితో కామాక్షి, శృతి అంటారు. ఇక చంద్ర ఆగదని అంటారు. ఇలా అవుతుందని తాను అనుకోలేదని శాలిని చెబుతుంది. ఇంతలో చంద్రకళ అక్కడికి వస్తుంది. ఫంక్షన్ ఆపేందుకు మీరు ఏదో ఒక పని చేస్తారని ఓ కంట కనిపెట్టానని చెబుతుంది. పిన్నిని పంపించి బావను రప్పించానని అంటుంది.

నువ్వు నల్లపూసలు కొట్టేయడం చూశానని శాలినికి ఝలక్ ఇస్తుంది చంద్ర. నీ ముందు బయటపడకుండా ఇంకో సెట్ రెడీగా పెట్టుకున్నానని చంద్ర అంటుంది. ఈ ఒక్కటి జరిగినంత మాత్రాన నీ స్థానం ఈ ఇంట్లో శాశ్వతం కాదని శాలిని అంటుంది. ఎన్నిసార్లు ఇలా మాట్లాడుతుంటావని కౌంటర్లు వేస్తుంది చంద్ర. నల్లపూసలు నువ్వు కొట్టేసిన విషయం అందరికీ చెబితే పరువు పోయయేదని అంటుంది. ఇక నుంచైనా మారకపోతే అడ్రెస్ లేకుండా పోతావని వార్నింగ్ ఇస్తుంది. మీరు ఆల్రెడీ అడ్రెస్ లేని వారే, మీరు వార్నింగ్ కూడా వేస్టే అని కామాక్షి, శృతిని చంద్ర అంటుంది.

లోకేషన్ పంపించుకున్నా.. ఆశ్చర్యపోయిన విరాట్

నేను మీటింగ్‍గు వెళ్లిన ప్లేస్ నీకు ఎలా తెలిసిందని చంద్రను విరాట్ అడుగుతాడు. మీటింగ్ ప్లేస్ గురించి ఎవరికీ చెప్పకపోయినా, అత్తయ్య ఎలా అక్కడికి వచ్చిందని ప్రశ్నిస్తాడు. ఫంక్షన్ టైమ్‍కు ఉండనని నువ్వు అన్నావ్ కదా.. అందుకే నీ ఫోన్ నుంచి ఉదయమే లైవ్ లొకేషన్ షేర్ చేసుకొని గమనిస్తూనే ఉన్నానని చంద్ర చెబుతుంది. అలాగే అడ్రెస్ తెలిసిందని అంటుంది. రాక్షసి, ఇంత అప్‍డేట్ ఎలా అయ్యావని విరాట్ ఆశ్యర్యపోతాడు. చిరాకు పడతాడు.

చంద్ర వంటను పాడు చేసే కుట్ర

విరాట్‍కు ఇష్టమైన కూరలు వండాలని, ఇద్దరూ కలిసి తినాలని చంద్రకు శ్యామల చెబుతుంది. దీన్ని చాటుగా వింటారు కామాక్షి, శాలినీ, శృతి. చంద్ర చేసే వంటను పెంట చేద్దామని కుట్ర పన్నుతారు. చంద్ర వంటలు చేస్తుంటే కామాక్షి అక్కడికి వస్తుంది. చంద్ర కంట పడకుండ కూరల్లో ఉప్పు, కారం ఎక్కువగా వేసేస్తుంది. తమ ప్లాన్ సక్సెస్ అయిందని ముగ్గురూ సంతోషిస్తారు. శృతి వచ్చి మరో కూరలో ఉప్పు, కారం ఎక్కువగా వేసి కలిపేస్తుంది. తినేందుకు సిద్ధం చేస్తుంది చంద్రకళ. దీంతో ఎపిసోడ్ ముగిసింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024