కలెక్షన్ల దుమ్మురేపుతున్న కామెడీ మూవీ.. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ

Best Web Hosting Provider In India 2024

కలెక్షన్ల దుమ్మురేపుతున్న కామెడీ మూవీ.. 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ

హౌస్‌ఫుల్ 5 బాక్స్ ఆఫీస్ వసూళ్లు: బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంఛైజీ హౌస్‌ఫుల్ లో భాగంగా వచ్చిన అయిదో సినిమా కలెక్షన్లు దుమ్మురేపుతోంది. హౌస్‌ఫుల్ 5 మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది.

కలెక్షన్లు అదరగొడుతున్న హౌస్‌ఫుల్ 5

బాలీవుడ్ లో కామెడీ సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చే ఫ్రాంఛైజీ.. హౌస్‌ఫుల్. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ కడుపుబ్బా నవ్వించి కలెక్షన్ల మోత మోగించాయి. ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీలో వచ్చిన రీసెంట్ మూవీ హౌస్‌ఫుల్ 5 కూడా వసూళ్లలో అదరగొడుతోంది. కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సత్తాచాటుతోంది.

నాలుగో రోజుల్లో

హౌస్‌ఫుల్ 5 మూవీ జూన్ 6న రిలీజ్ అయింది. అక్షయ్ కుమార్, నర్గీస్ ఫఖ్రీ, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితేష్ దేశ్ముఖ్, సౌందర్య శర్మ తదితరులు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలకడగా రాణిస్తోంది. సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం ఈ హిందీ సినిమా నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. సోమవారం (జూన్ 9) ఈ సినిమాకు రూ.13.50 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి.

ఆదివారం హైయ్యస్ట్

హౌస్‌ఫుల్ 5 మూవీ ఇప్పటివరకూ అత్యధికంగా ఆదివారం (జూన్ 8) రూ.32.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. మొత్తం వసూళ్లు రూ.101 కోట్లకు చేరుకున్నాయి. సోమవారం హౌస్‌ఫుల్ 5 హిందీలో మొత్తం 19.78% ఆక్యుపెన్సీని కలిగి ఉంది. ఈ చిత్రం ఇప్పుడు అక్షయ్ మునుపటి సినిమా కేసరి చాప్టర్ 2 ఇండియా నెట్ వసూళ్లను అధిగమించింది. కేసరి చాప్టర్ 2 ఇండియాలో రూ.92.53 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇదే జోరు కొనసాగించి హౌస్‌ఫుల్ 5.. స్కై ఫోర్స్ రూ.149 కోట్ల వసూళ్లను దాటేస్తుందేమో చూడాలి.

షిప్ లో మర్డర్

హౌస్‌ఫుల్ 5 మూవీ ఓ పెద్ద క్రూయిజ్ షిప్ లో రిచెస్ట్ పర్సన్ మర్డర్ చుట్టూ తిరుగుతుంది. ఆ క్రమంలో వచ్చే కామెడీ సీన్స్ బాగా పేలాయి. ఒక క్రూయిజ్ షిప్‌లో ధనవంతుడైన పారిశ్రామికవేత్త హత్యలో ముగ్గురు జాలీ అనే వ్యక్తులు అనుమానితులుగా ఉంటారు. ఆస్తి కొట్టేయడానికి జాలీ అనే పేర్లతో వచ్చిన వీళ్లు.. చివరకు మర్డర్ కేసులో ఇరుక్కుంటారు. వీళ్లలో హత్య చేసింది ఎవరు అని తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు వస్తారు.

కెవ్వు కామెడీ

హౌస్‌ఫుల్ 5లో కామెడీ ఫుల్ కిక్ ఇస్తోంది. షిప్ లోకి ఒక్కొక్కరిగా ఎంటర్ కావడం.. ఆ తర్వాత మర్డర్.. ఇంటరాగేషన్.. ఇలా ప్రతి ఎలిమెంట్ లోనూ ఫన్ జెనరేట్ అయింది. సాజిద్ నడియాద్వాలా నిర్మాణ బ్యానర్ నడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ మూవీ నిర్మించారు. ఇందులో ఫర్దీన్ ఖాన్, నానా పటేకర్, జాకీ ష్రాఫ్, రంజీత్, జానీ లివర్, చంకీ పాండే, డినో మోరియా, సోనమ్ బజ్వా తదితరులు కూడా నటించారు. ఈ సినిమాకు తరుణ్ మన్సుఖాని డైరెక్టర్.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024