




Best Web Hosting Provider In India 2024
గ్రూప్ బీ, గ్రూప్ సీలో 14వేలకుపైగా ఖాళీలు.. ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురూ!
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దఫా రిక్రూట్మెంట్లో 14582 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ. అభ్యర్థులు ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ssc.gov.in లో ఈ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025- ముఖ్యమైన తేదీలు..
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 9న ప్రారంభం అయ్యింది. అప్లికేషన్‌కి చివరి తేదీ జులై 4 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జులై 5.
అప్లికేషన్ కరెక్షన్ విండో జులై 9న మొదలై, 11తో ముగుస్తుంది. టైర్ 1 పరీక్ష ఆగస్ట్ 13 నుంచి ఆగస్ట్ 30 వరకు జరుగుతుంది.
ఈ దఫా ఎస్ఎస్సీ సీజీఎల్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా.. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ వ్యవస్థలు, ట్రిబ్యునల్స్‌లోని గ్రూప్ బీ, గ్రూప్ సీకి సంబంధించిన 14582 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 అర్హతకు సంబంధించి వివరాలు తెలుసుకునేందుకు కింద ఇచ్చిన నోటిఫికేషన్ని చదవాల్సి ఉంటుంది.
ఎస్ఎస్సీ సీజీఎల్ సెలక్షన్ ప్రాసెస్..
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 కోసం రెండు టైర్స్‌లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. అవి టైర్ 1, టైర్ 2. టైర్ 1లో అబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ని మినహాయించి, మిగిలిన ప్రశ్నలన్నీ ఇంగ్లీష్ , హిందీ భాషల్లో ఉంటాయి. పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి 0.50 మార్కులు కట్ అవుతాయి.
అప్లికేషన్ ఫీజు..
మహిళలు, ఎస్సీ- ఎస్టీ అభ్యర్థులు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్మెంట్లకు ఉచితం.
ఇతరులకు రూ. 100.
భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డు, మాస్ట్రో, రూపే డెబిట్ కార్డులతో ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం ఎస్ఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ని చూడాల్సి ఉంటుంది.
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ని చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ పోస్టులకు అప్లై చేశారా?
ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్న వారికి అలర్ట్! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ని విడుదల చేసింది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సి’ & ‘డి’ ఎగ్జామినేషన్, 2025 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ssc.gov.in ఎస్ఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా డైరెక్ట్ లింక్‌ని పొందవచ్చు.
ఎస్ఎస్సీ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ అండ్ డీ ఎగ్జామ్ 2025కి దరఖాస్తుకు చివరి తేదీ 2025 జూన్ 26 అని గుర్తుపెట్టుకోవాలి. ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 27 జూన్ 2025. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 261 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ఫారంలో సవరణలు చేయడానికి జులై 1 నుంచి జులై 2, 2025 వరకు అవకాశం ఉంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link