





Best Web Hosting Provider In India 2024

జై బాలయ్య..! బర్త్ డే స్పెషల్.. కలెక్షన్ల మోత మోగించిన బాలకృష్ణ టాప్-5 మూవీస్.. ఏ ఓటీటీల్లో ఉన్నాయంటే?
నందమూరి నటసింహం బాలకృష్ణ బర్త్ డే ఈ రోజు (జూన్ 10). ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ లోని టాప్-5 హైయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఏవి? అవి ఏ ఓటీటీలో ఉన్నాయో? ఓ లుక్కేయండి.
నటనలో, రాజకీయాల్లో తండ్రి ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని రెండు రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఇటు యాక్టింగ్ లో అదరగొడుతూ.. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు. అటు పాలిటిక్స్ లో హిందూపురాన్ని కంచుకోటగా మార్చుకుని వరుస విజయాలు సాధిస్తున్నారు. ఈ రోజు (జూన్ 10) నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-5 మూవీస్ ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ సారి చూసేయండి.
డాకు మహారాజ్
నందమూరి బాలకృష్ణ లాస్ట్ రిలీజ్ మూవీ డాకు మహారాజ్. ఐఎండీబీ వెబ్ సైట్ ప్రకారం బాలకృష్ణ సినీ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా డాకు మహారాజ్ కొనసాగుతోంది. 2025లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.133.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కలెక్ట్ చేసింది. బాబీ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో బాలకృష్ణ మాస్ యాక్షన్ వేరే లెవల్ లో ఉంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఉంది.
వీర సింహా రెడ్డి
వీర సింహా రెడ్డి మూవీతో 2023 సంక్రాంతికి హిట్ కొట్టారు బాలయ్య. ఇందులో తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్ చేశారు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.132.5 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్, హనీ రోజ్ నటించారు. ఈ సినిమాను జియోహాట్ స్టార్ ఓటీటీలో చూడొచ్చు.
అఖండ
నందమూరి బాలకృష్ణ కెరీర్ ను మలుపు తప్పిన సినిమా అఖండ. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబోలో పవర్ ఫుల్ సినిమాగా వచ్చిన అఖండ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.124 కోట్లు కొల్లగొట్టింది. దీని బడ్జెట్ రూ.50 కోట్లే. అఖండ రుద్ర సికందర్ ఘోరాగా బాలకృష్ణ యాక్షన్ సీక్వెన్స్ ఈ మూవీని మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. ఈ మూవీ జియోహాట్ స్టార్ లో ఉంది.
భగవంత్ కేసరి
ఆడపిల్లను లేడీ పిల్లలా కాదు పులి పిల్లలా పెంచాలనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన సినిమా భగవంత్ కేసరి. నేలకొండ భగవంత్ కేసరిగా ఈ మూవీలో బాలయ్య యాక్షన్ తో అదరగొట్టారు. శ్రీలీల, బాలకృష్ణ మధ్య సెంటిమెంట్ వర్కౌట్ అయింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.118.2 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్ యాప్ లో చూడొచ్చు.
గౌతమీపుత్రి శాతకర్ణి
శాతవాహనుల్లో గొప్పవాడైన గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్రను వెండితెరపైకి తీసుకొచ్చారు బాలకృష్ణ. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో గౌతమీపుత్ర శాతకర్ణిగా బాలయ్య అదరగొట్టారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.81.6 కోట్లు దక్కించుకుంది. ఈ హిట్ సినిమా జియో హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం