





Best Web Hosting Provider In India 2024

దెయ్యాలు ఉండే క్రూయిజ్‌లో రివ్యూవర్.. కంట్రోల్ చేసే మాయా డైరీ.. ఓటీటీలోకి వస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్
హారర్ మూవీలో మరో హారర్ స్టోరీతో వచ్చిన సూపర్ నేచులర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. భయపెట్టే ఈ తమిళ్ మూవీ మరో మూడు రోజుల్లోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆ మూవీ ఏంటీ? ఏ ఓటీటీలోకి రాబోతుందో? చూసేయండి.
డిఫరెంట్ స్టోరీ లైన్ తో వచ్చిన తమిళ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్’ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. డీడీ నెక్ట్స్ లెవల్ పాపులర్ అయిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేస్తోంది. ‘దిల్లుకు దుడ్డు’ ఫ్రాంచైజీలో నాలుగో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది. థియేటర్లలో ఎంటర్ టైన్ చేసిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది.
ఆ ఓటీటీలోకి
‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్’ మూవీ మే 16న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు నెల రోజుల్లోపై ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. జీ5 ఓటీటీలో జూన్ 13న డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది ఈ సినిమా. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీలో కమెడియన్ సంతానం లీడ్ రోల్ ప్లే చేశాడు. క్రియేటివ్ రైటర్, డైరెక్టర్ ఎస్.ప్రేమ్ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథ ఏమిటంటే?
తన వాక్ చాతుర్యంతో సినిమాలకు రివ్యూలు చెప్పే కిస్సా (సంతానం) అంటే విచిత్రంగా ప్రవర్తించే దర్శకుడు హిచ్‌కాక్ ఇరుదయరాజ్(సెల్వరాఘవన్)కు పడదు. రహస్యంగా ఓ సినిమాను చూడటానికి వ్యక్తిగతంగా రమ్మని కిస్సాను ఆహ్వానిస్తాడు హిచ్‌కాక్. కిస్సా సాధారణంగా డ్రామాతో కూడిన సినిమా అనుకుని వస్తాడు. కానీ నిజానికి సినిమా అలా ఉండదు. ప్రొజెక్టర్ ఓసారి ఆన్ కాగానే, కిస్సా ప్రపంచం ఒక్కసారిగా తలకిందులుగా మారుతుంది. కొంతసేపటికి కిస్సా ఓ దెయ్యాలు, భూతాలు ఉండే క్రూయిజ్‌లో కన్ను తెరుస్తాడు. అక్కడ తర్కాలేవి పనిచేయవు.
ఆ డైరీ కంట్రోల్ లో
అక్కడ పాటించాల్సిన నియమాల గురించి ఓ మ్యాజికల్ డైరీలో రాసి ఉంటుంది. అతనితో పాటు మరో ఇద్దరు రివ్యూవర్లు కూడా అందులో చిక్కుకుంటారు. దీంతో వారు డైరీలో విషయాలను డీకోడ్ చేయటానికి సిద్ధమవుతారు. అందులో భాగంగా అతింద్రీయ శక్తుల బలహీనతలు గుర్తించాలి. ఆ సమయంలో ఎదురయ్యే భయానక పరిస్థితులను దాటాలి. ఇంతటితో కథ ముగియదు. కిస్సా గర్ల్‌ఫ్రెండ్ కూడా ఓ ఆత్మగా మారిపోయుంటుంది. ఈ కథాగమనంలో హాస్యంతో నిండిన మలుపులు, రోలర్ కోస్టర్‌లాగా అనిపించే సన్నివేశాలతో నిండి ఉంటాయి.
‘డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్’ అనేది హారర్, హాస్యం, అడ్వెంచర్‌తో నిండి ఉంది. ఓ సినిమా రివ్యూవర్ తను ఉన్న సినిమా రివ్యూ కథ నుంచి బయటపడ్డాడా.. ఈ కథలో తనే విలనా? సినిమా టైటిల్ కార్డ్స్ పడుతున్నప్పటికీ చివరకు ఎవరు ఏమవుతారనేదే సినిమా కథ.
ఆ వివాదం
‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్’ థియేట్రికల్ రిలీజ్ కు ముందు వివాదం రేగింది. ఈ సినిమాలోని ఓ పాటలో గోవింద నామాలను అనుచితంగా వాడటంపై టీటీడీ ఫైర్ అయింది. రూ.100 కోట్లు కట్టాలంటూ డిమాండ్ చేసింది. చివరకు మూవీ మేకర్స్ వెనక్కి తగ్గారు. ఈ సినిమాలో సెల్వ రాఘవన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, గీతికా తివారి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ది షో పీపుల్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ఈ మూవీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
సంబంధిత కథనం