నేరుగా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఓ బిలియనీర్ హత్య.. ఓ డిటెక్టివ్.. ఎంతో మంది అనుమానితులు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

నేరుగా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఓ బిలియనీర్ హత్య.. ఓ డిటెక్టివ్.. ఎంతో మంది అనుమానితులు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి నేరుగా మరో థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఓ బిలియనీర్ హత్య చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం (జూన్ 10) రిలీజ్ అయింది. మూవీ స్ట్రీమింగ్ తేదీని కూడా అనౌన్స్ చేశారు.

నేరుగా ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. ఓ బిలియనీర్ హత్య.. ఓ డిటెక్టివ్.. ఎంతో మంది అనుమానితులు.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

థ్రిల్లర్ మూవీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇప్పుడో థ్రిల్లర్ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకే వస్తోంది. ఈ సినిమా పేరు డిటెక్టివ్ షేర్దిల్ (Detective Sherdil). జీ5 (Z5) ఓటీటీలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. మరి ఈ మూవీ ట్రైలర్ ఎలా ఉంది? స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.

డిటెక్టివ్ షేర్దిల్ ట్రైలర్

ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు దిల్జీత్ దోసాంజ్ నటించిన థ్రిల్లర్ మూవీ డిటెక్టివ్ షేర్దిల్. ఓ బిలియనీర్ హత్య, దర్యాప్తు చుట్టూ తిరిగే కథతో ఓటీటీలోకి వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. మంగళవారం (జూన్ 10) ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

“ఎంతో మంది అనుమానితులు ఉన్న ఓ హత్య. ప్రతి ఒక్కరి మనసు తాళం చెవి ఉన్న ఓ షేర్. మీరు సిద్ధంగా ఉన్నారా? ట్రైలర్ వచ్చేసింది. డిటెక్టివ్ షేర్దిల్ జూన్ 20 నుంచి మీ జీ5 ఓటీటీలో..” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.

డిటెక్టివ్ షేర్దిల్ మూవీ గురించి..

ఈ డిటెక్టివ్ షేర్దిల్ మూవీలో దిల్జీత్ దోసాంజ్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తున్నాడు. ఎంతో క్లిష్టమైన కేసులను కూడా పరిష్కరించే డిటెక్టివ్ అతడు. ఈ ట్రైలర్ మొదట్లోనే ఓ బిలియనీర్ ను నడిరోడ్డుపై హత్య చేసినట్లు చూపిస్తారు. అతడు వెళ్తున్న కారుపై ఫైరింగ్ చేసిన ఓ యువకుడు.. ఆ తర్వాత ఆ కారును పేల్చేస్తాడు. అతన్ని చంపిందెవరో తెలుసుకోవడానికి డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు.

మొదట అతని కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తుల నుంచే దర్యాప్తు మొదలుపెడతాడు. థ్రిల్ తోపాటు ఫన్ కూడా పంచుతూ ఈ ట్రైలర్ సాగిపోయింది. ఈ డిటెక్టివ్ షేర్దిల్ సినిమాలో దిల్జీత్ దోసాంజ్ తోపాటు డయానా పెంటీ, బొమన్ ఇరానీ, రత్నా పాఠక్ షా, చుంకీ పాండే, సుమీత్ వ్యాస్, బనితా సంధు, కశ్మీరా ఇరానీలాంటి వాళ్లు నటించారు. రవి ఛాబ్రియా సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను జూన్ 20 నుంచి జీ5 ఓటీటీలో చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024