విడాకుల్లోనే నేను సక్సెస్ అయ్యాను.. ఆ నటన నాకు రాదు: బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

విడాకుల్లోనే నేను సక్సెస్ అయ్యాను.. ఆ నటన నాకు రాదు: బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్

బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్.. తన వ్యక్తిగత జీవితంలో, ముఖ్యంగా పెళ్లి విషయంలో మాత్రం ఫెయిలవుతూనే ఉన్నాడు. ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకొని ఆ ఇద్దరికీ విడాకులు ఇచ్చేశాడు.
 
విడాకుల్లోనే నేను సక్సెస్ అయ్యాను.. ఆ నటన నాకు రాదు: బాలీవుడ్ స్టార్ హీరో కామెంట్స్ 
 

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన నెక్ట్స్ మూవీ సితారే జమీన్ పర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. రెండు వరుస డిజాస్టర్ల తర్వాత ఈ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ నటిస్తున్న సినిమా ఇది. దీనిపై అతడు భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో జూమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమిర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన వ్యక్తిగత జీవితంతోపాటు సినిమాలు, కెరీర్ గురించి మాట్లాడాడు. పెళ్లిళ్ల విషయంలో సక్సెస్ కాకపోయినా.. విడాకుల విషయంలో అయ్యానని నవ్వుతూ అన్నాడు.

 

ఆమిర్ ఖాన్ ఏమాన్నడంటే..

సితారే జమీన్ పర్ మూవీ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్న ఆమిర్ ఖాన్.. తాజాగా జూమ్ తో మాట్లాడాడు. “నా కుటుంబానికి సంబంధించి కూడా ఇదొక్క విషయంలో మేము అస్సలు సంతోషంగా లేము. మేమేదో సంతోషంగా ఈ పని చేయడం లేదు. కానీ కొన్ని పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మా మధ్య బంధం మారిపోయిందని మాకు అనిపిస్తుంది.

అలాంటప్పుడు నా ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రపంచం దృష్టిలో మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఇంకా వివాహ బంధంలోనే ఉన్నామని నటించడం నాకు రాదు” అని ఆమిర్ స్పష్టం చేశాడు.

విడాకుల్లోనే నా సక్సెస్

ఇక తనపై తాను జోకులు వేసుకొనే ఆమిర్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో విఫలమైన పెళ్లిళ్ల విషయంలోనూ అలాగే స్పందించాడు. “పెళ్లి విషయంలో నేను సక్సెస్ కాలేదు కానీ విడాకుల విషయంలో మాత్రం అయ్యాను” అని ఆమిర్ అనడం విశేషం. ప్రస్తుతం ఆమిర్ ఖాన్.. గౌరీ స్ప్రత్ అనే మహిళతో డేటింగ్ చేస్తున్నాడు.

ఈ ఏడాది మార్చిలో తన 60వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెను పరిచయం చేశాడు. ఆ తర్వాత గౌరితో కలిసి పలు ఈవెంట్లకు కూడా వెళ్లాడు. ఆమిర్ ఖాన్ ఇప్పటికే రీనా దత్తా, కిరణ్ రావ్ లను పెళ్లి చేసుకొని తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి ద్వారా ఆమిర్ కు ఇరా ఖాన్, జునైద్ ఖాన్, ఆజాద్ రావ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

 

ఇక ఆమిర్ సినిమాల విషయానికి వస్తే అతడు నటించిన చివరి రెండు సినిమాలు థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, లాల్ సింగ్ చద్దా దారుణంగా విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సితారే జమీన్ పర్ మూవీతో అతడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో జెనీలియా ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఈ మూవీ జూన్ 20న రిలీజ్ కానుంది.

 

Best Web Hosting Provider In India 2024