




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి రెండు నెలల తర్వాత వస్తున్న తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్.. మరో రెండు రోజుల్లోనే.. ఐఎండీబీలో 8.8 రేటింగ్
ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఐఎండీబీలో 8.8 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ విషయాన్ని సన్ నెక్ట్స్ బుధవారం (జూన్ 11) అనౌన్స్ చేసింది.
ఓటీటీలోకి మరో ఇంట్రెస్టింగ్ సినిమా మరో రెండు రోజుల్లోనే వస్తోంది. ఈ లోబడ్జెట్ మెడికల్ డ్రామా థియేటర్లలో రిలీజైన సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పేరు డియర్ ఉమ. ఏప్రిల్లో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో మాత్రం 8.8 రేటింగ్ సాధించడం విశేషం.
డియర్ ఉమ ఓటీటీ రిలీజ్ డేట్
పృథ్వీ అంబర్, సుమయరెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన డియర్ ఉమ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి సాయిరాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను శుక్రవారం (జూన్ 13) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.
ఈ విషయాన్ని బుధవారం ఆ ఓటీటీ వెల్లడించింది. “జీవితాన్నే మించిన ప్రేమ.. దేవ్, ఉమ ఆత్మీయ ప్రేమ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది. డియర్ ఉమ జూన్ 13 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది” అని ఆ ఓటీటీ వెల్లడించింది.
డియర్ ఉమ మూవీ గురించి..
డియర్ ఉమ మూవీ రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కింది. వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే మోసాలకు లవ్‌స్టోరీని జోడించి డియర్ ఉమ కథను రాసుకుంది సుమయ రెడ్డి. ట్రీట్‌మెంట్ పేరుతో సామాన్యులను కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా దోచుకుంటాయనే మెసేజ్‌ను సినిమాలో టచ్ చేశారు…లేడీ డాక్టర్‌తో రాక్‌స్టార్ ప్రేమలో పడటం, ఆమె కోసం సాగించిన అన్వేషణ చూపించారు. ఈ రెండు కథలను లింక్ చేస్తూ థ్రిల్లింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేశారు.
హీరో ఓ రాక్‌స్టార్…హీరోయిన్ ఓ డాక్టర్ …భిన్న నేపథ్యాలు కలిగిన వారు ఎలా ఒక్కటయ్యారనే అంశాలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. లవ్ బ్రేకప్ కారణంగా హీరో పడే బాధను ఎమోషనల్‌గా చూపించారు. ఇంటర్వెల్‌లో రివీలయ్యే టెస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. కేవలం రెండు మెయిన్ ట్విస్ట్‌లను బేస్ చేసుకొని డియర్ ఉమ కథ సాగిన ఫీలింగ్ కలుగుతుంది. వాటి చుట్టూ అల్లుకున్న డ్రామాలో ఆసక్తి లోపించింది.
డియర్ ఉమ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాకు రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది సుమయ రెడ్డి. రాక్‌స్టార్ దేవ్‌గా పృథ్వీ అంబర్ స్టైలిష్‌గా కనిపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన ఆకట్టుకుంటుంది. డియర్ ఉమ మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన లవ్ డ్రామా మూవీ. శుక్రవారం (జూన్ 13) నుంచి సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడండి.
సంబంధిత కథనం