




Best Web Hosting Provider In India 2024

తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల – ఈ డైరెక్ట్ లింక్ తో డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు tgtet.aptonline.in/tgtet వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు – 2025
తెలంగాణ టెట్ – 2025 హాల్ టికెట్లు వచ్చేశాయ్…! దరఖాస్తుదారులు విద్యాశాఖ వెబ్ సైట్ లేదా టెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పరీక్షలు… జూన్ 18వ తేదీన ప్రారంభమవుతాయి. జూన్ 30వ తేదీ నాటితో ముగుస్తాయి.
తెలంగాణ టెట్ – 2025 హాల్ టికెట్లు – ప్రాసెస్ ఇలా
- అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ‘ Hall Ticket Download’ ఆప్షన్ పై నొక్కాలి.
- జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.
ముఖ్య వివరాలు:
- ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి.
- వీటిలో పేపర్-1కు 63,261 , పేపర్-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి.
- జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి.
- జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక జూన్ 24 న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.
- జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) ఉంటుంది.
- తెలంగాణ టెట్ పరీక్షలు ఈనెల 30వ తేదీతో పూర్తవుతాయి. ఆపై ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు.
- జూలై 22వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి తెలంగాణ టెట్ హాల్ టికెట్ ను నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
టాపిక్
Ts TetTelangana NewsTrending TelanganaEducation