





Best Web Hosting Provider In India 2024

ఏడు నెలల తర్వాత రెండో ఓటీటీలోకి వస్తున్న కన్నడ రివేంజ్ థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూడండి
ఓ కన్నడ రివేంజ్ థ్రిల్లర్ మూవీ ఏడు నెలల తర్వాత మరో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఐఎండీబీలో 6.5 రేటింగ్ ఉంది. శుక్రవారం (జూన్ 13) నుంచి మరో ఓటీటీలోకి కూడా రానుంది.
థియేటర్లలో గతేడాది నవంబర్లో రిలీజ్ అయిన కన్నడ రివేంజ్ థ్రిల్లర్ మూవీ మర్యాదే ప్రశ్నే (Maryade Prashne). ఈ సినిమా గతంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. అయితే ఏడు నెలల తర్వాత ఇప్పుడు సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీలోకి కూడా రాబోతోంది. ఆ వివరాలేంటో చూడండి.
మర్యాదే ప్రశ్నే ఓటీటీ రిలీజ్ డేట్
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో రివేంజ్ థ్రిల్లర్ మూవీ మర్యాదే ప్రశ్నే. అంటే ఇది గౌరవానికి సంబంధించిన ప్రశ్న అని అర్థం. ఈ సినిమా గతేడాది నవంబర్ 22న థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ప్రైమ్ వీడియోలోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది.
అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలోకి కూడా అడుగుపెడుతోంది. “తీర్పు వచ్చేసింది. గౌరవానికి సంబంధించిన ప్రశ్నగా మొదలై నిజం కోసం సాగే పోరాటంగా మారింది. మర్యాదే ప్రశ్నే జూన్ 13 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ఈ విషయం వెల్లడించింది.
మర్యాదే ప్రశ్నే మూవీ గురించి..
మర్యాదే ప్రశ్నే సినిమాను నాగరాజ్ సోమయాజి డైరెక్ట్ చేశాడు. రాకేష్ అడిగా, సునీల్ రావ్, పూర్ణచంద్ర మైసూర్, తేజు బెలవాడి, ప్రభు, రేఖా కుడిగిలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. సూరి, సతీష, మంజేష్ అనే ముగ్గురు మిడిల్ క్లాస్ కు చెందిన స్నేహితులు వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు.
ఓరోజు సతీష బర్త్ డే సెలబ్రేట్ చేస్తారు. ఆ వెంటనే రాకీ అనే ఓ ధనవంతుడు చేసిన కారు ప్రమాదంలో సతీష ప్రాణాలు కోల్పోతాడు. అప్పటి నుంచి తమ స్నేహితుడి మరణానికి ప్రతీకారం కోసం సూరి, మంజేష్ ప్రయత్నిస్తుంటారు. వాళ్లు ఏం చేశారు? రివేంజ్ తీర్చుకున్నారా లేదా అన్నదే ఈ మూవీ కథ. కేవలం కన్నడ ఆడియో, ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తోనే మూవీ ఓటీటీలోకి రానుంది. జూన్ 13 నుంచి సన్ నెక్ట్స్ లో చూడొచ్చు.
సంబంధిత కథనం