



Best Web Hosting Provider In India 2024

జబర్ధస్థ్ యాంకర్‌గా బ్రహ్మముడి మానస్ – నన్ను తట్టుకునేవాళ్లు ఉన్నారా అంటూ రష్మి కామెంట్స్!
జబర్ధస్థ్ కామెడీ షోలోకి మరో కొత్త యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ కామెడీ షోకు బ్రహ్మముడి మానస్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. రష్మితో కలిసి ఈ షోలో మానస్ సందడి చేయబోతున్నాడు. జూన్ 20న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌లో ద్వారా మానస్ జబర్ధస్థ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు.
జబర్ధస్థ్ కామెడీ షో ద్వారా కంటెస్టెంట్స్‌తో సమానంగా యాంకర్స్ అనసూయ, రష్మి ఫేమస్ అయ్యారు. చాలా కాలం పాటు ఈ షోకు హోస్ట్‌లుగా కొనసాగారు. సినిమాల కారణంగా అనసూయ జబర్ధస్థ్ నుంచి తప్పుకోగా…రష్మి మాత్రం హోస్ట్‌గా కంటిన్యూ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ కామెడీ షోలోకి మరో కొత్త యాంకర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆ యాంకర్ మరెవరో కాదు…బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్.
ఇద్దరు యాంకర్లు…
జబర్ధస్థ్ కు ఉన్న క్రేజ్ రానురాను తగ్గిపోతుండటంతో ఈ షోలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తోన్నారు మేకర్స్. ఇక నుంచి ఈ షోలో ఇద్దరు యాంకర్లు కనిపించబోతున్నట్లు ప్రకటించారు. రష్మితో పాటు మరో యాంకర్ కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. జబర్ధస్థ్‌లో చేయబోతున్న మార్పులను సూచిస్తూ ప్రోమోను రిలీజ్ చేశారు.
న్యూ ఛాప్టర్ బిగిన్స్ అంటూ సాగిన ప్రోమో ఆకట్టుకుంటోంది. ఇక నుంచి జబర్ధస్థ్ కొత్తగా ఉండబోతుందని జడ్జ్ ఖుష్బూ ఈ ప్రోమోలో ప్రకటించింది. ఎనర్జీ డబుల్…ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్…ఎవ్రీథింగ్ డబుల్ అంటూ రష్మి చేసిన కామెంట్స్ ప్రోమోలో ఆకట్టుకుంటున్నాయి.
ఫేస్ చూపించకుండా…
ఇప్పటివరకు జబర్ధస్థ్ ఆడియెన్స్‌లో ఉంది…ఇప్పుడు జబర్ధస్థ్‌లోనే ఆడియెన్స్ ఉన్నారు అని మరో జడ్జ్ కృష్ణభగవాన్ అన్నారు. అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ ఉండాలిగా అని ఖుష్బూ అనగానే నన్ను తట్టుకునేవాళ్లు ఎవరైనా ఉన్నారా అని రష్మి సమాధానం ఇచ్చింది. ఆ తర్వాతే కొత్త యాంకర్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు ఎవరన్నది మాత్రం రివీల్ చేయలేదు. ఫేస్ ను చూపించకుండా ఆడియెన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్.
జూన్ 20 ఎపిసోడ్‌తో…
బ్రహ్మముడి మానస్ జబర్ధస్థ్ యాంకర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. బుల్లితెరపై మానస్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని అతడిని యాంకర్‌గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూన్ 20న టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్‌తో మానస్ ఈ షోలోకి అడుగుపెట్టబోతున్నాడు.
టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్
ప్రస్తుతం తెలుగులో బ్రహ్మముడి సీరియల్ చేస్తున్నాడు మానస్. రాజ్ పాత్రతో సీరియల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న ఈ సీరియల్ టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్‌లో కొనసాగుతోంది. కాయ్ రాజా కాయ్, ప్రేమికుడు, క్షీర సాగర మథనంతో పాటు మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు.
టాపిక్