మహాభారతం సినిమాతో ఆమిర్ ఖాన్ గుడ్ బై చెప్తారా? స్టార్ హీరో సంచలన రిప్లే ఇదే!

Best Web Hosting Provider In India 2024

మహాభారతం సినిమాతో ఆమిర్ ఖాన్ గుడ్ బై చెప్తారా? స్టార్ హీరో సంచలన రిప్లే ఇదే!

అమీర్ ఖాన్ తన కలల ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఇటీవల పాడ్‌కాస్ట్ కోసం రాజ్ షమానీతో జరిగిన సంభాషణలో మాట్లాడారు. ఈ పాడ్ కాస్ట్ లో అతను రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేశారనే విషయం సంచలనంగా మారింది. దీనిపై ఇప్పుడు ఆమిర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.

అమిర్ ఖాన్ (AFP)

మహాభారతం తర్వాత నటన నుంచి రిటైర్ అవుతాననే పుకార్లను నటుడు అమీర్ ఖాన్ కొట్టిపారేశారు. ఈ ఊహాగానాలు ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ నుండి వచ్చాయి. అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఆమిర్ తాజాగా తెలిపారు. జూమ్‌లో ఫ్యాన్ క్లబ్ ఈవెంట్ లో ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యాక్టింగ్ లో కొనసాగుతానని చెప్పారు.

అదే చివరి సినిమా కాదు

ప్రస్తుతానికి నటన నుండి వైదొలగే ఆలోచన లేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. “మహాభారతం నా చివరి సినిమా కాదు. ఇప్పుడు సమస్య ఏమిటంటే మీరు ఏమి చెప్పినా, దాని తప్పుడు అర్థం ఎల్లప్పుడూ బయటకు వస్తుంది. మీకు ఇంకే పని చేయాలని అనిపించని ఏదైనా సినిమాలో యాక్ట్ చేయమని అడిగారు. అప్పుడు అది ఏ సినిమా అవుతుంది. మహాభారతం నా చివరి సినిమా అని ప్రజలు భావించారు. సమాధానాన్ని జాగ్రత్తగా వినాలి’’ అని ఆమిర్ ఖాన్ పేర్కొన్నారు.

కలల ప్రాజెక్ట్

ఆమిర్ తన కలల ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఇటీవల రాజ్ షమానీతో పాడ్‌కాస్ట్ సంభాషణలో మాట్లాడారు. ఆ కామెంట్లు ఆమిర్ రిటైర్మెంట్ పై చర్చకు దారితీశాయి. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే.. “మహాభారతం తీయడం నా కల. జూన్ 20న సీతారే జమీన్ పర్ విడుదలైన తర్వాత దానిపై పని ప్రారంభిస్తా. నేను దీన్ని పూర్తి చేసిన తర్వాత ఇక చేయగలిగేది ఏమీ లేదని నాకు అనిపించే ఒక ప్రాజెక్ట్ ఇదేనని నేను భావిస్తున్నాను. ఎందుకంటే విషయం అలాంటిది. ప్రపంచంలో ఉన్న ప్రతిదీ మహాభారతంలో చూడవచ్చు” అని అన్నారు.

మహాభారతం తర్వాత నాకు చేయగలిదే ఇంకేం లేదు అని అనిపించాలి అని ఆమిర్ చేసిన వ్యాఖ్యలతో రిటైర్మెంట్ చర్చ ఊపందుకుంది. కానీ అలాంటిదేమీ లేదని ఆమిర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు.

బాస్కెట్ బాల్ కోచ్ గా

ఆమిర్ ఖాన్ లేటెస్ట్ హూవీ సితారే జమీన్ పర్ విడుదలకు రెడీ గా ఉంది. ఈ చిత్రంలో న్యూరోడైవర్జెంట్ పిల్లల బృందానికి శిక్షణ ఇవ్వవలసి వచ్చే బాస్కెట్‌బాల్ కోచ్ పాత్రను ఆమిర్ పోషించారు. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్పానిష్ చిత్రం కాంపియోన్స్ కు రీమేక్. ఇందులో పది మంది నూతన నటులు నటించారు. వాళ్లు.. అరోష్ దత్తా, గోపీ కృష్ణ వర్మ, సంవిత్ దేశాయ్, వేదాంత్ శర్మ, ఆయుష్ భన్సాలీ, ఆశిష్ పెండ్సే, రిషి షహాని, రిషబ్ జైన్, నమన్ మిశ్రా, సిమ్రాన్ మంగేష్కర్. ఇది 2007లో ఆమిర్ నటించిన హిట్ సినిమా తారే జమీన్ పర్ కి సీక్వెల్. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024