



Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్‌ను బావ అని పిలిచిన దీప – వంటలక్క బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన జ్యోత్స్న
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 13 ఎపిసోడ్‌లో పారిజాతం కేక్ కిందపడేసిన వీడియోను అడ్డుపెట్టుకొని జ్యోత్స్నను ఆటాడుకుంటాడు కార్తీక్. జ్యోత్స్న చేత దీప బర్త్‌డే సెలబ్రేషన్స్ ను సుమిత్ర, దశరథ్ ముందు చేయిస్తాడు. సుమిత్ర చేత దీపకు కేక్ తినిపించి విషెస్ చెప్పిస్తాడు కార్తీక్.
తన బర్త్‌డే కేక్‌ను కిందపడేసి సుమిత్ర, శివన్నారాయణ చేత దీపను తిట్టించాలని ప్లాన్ చేస్తారు జ్యోత్స్న, పారిజాతం. కేక్‌ను పారిజాతం కిందపడేస్తుంది. దీపనే ఆ పని చేసిందని జ్యోత్స్న, పారిజాతం నిందలు వేస్తారు. దీప తన ఆనందాల్ని దూరం చేస్తుందని, బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకోనని కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా నటిస్తూ రూమ్‌లోకి వెళ్లిపోతుంది.
జ్యోత్స్నను ఆటాడుకున్న కార్తీక్…
పారిజాతం కేక్ కిందపడేస్తుండగా తన మొబైల్‌లో వీడియో తీస్తాడు కార్తీక్. ఆ వీడియోను అడ్డుపెట్టుకొని జ్యోత్స్నను ఆట ఆడుకుంటాడు. బర్త్‌డే చేసుకోనని రూమ్‌లోకి వెళ్లిపోయిన జ్యోత్స్నను హాల్‌లోకి తీసుకొస్తాడు. కార్తీక్ స్వయంగా కేక్ ఆర్డర్ చేస్తాడు. ఆ కేక్‌పై జ్యోత్స్నతో పాటు దీప పేరు కూడా ఉంటుంది. ఆ కేక్ చూసి జ్యోత్స్న షాకవుతుంది. జ్యోత్స్ననే కేక్‌పై దీప పేరు ఉండాలని పట్టుబట్టిందని ఆమెను అందరి ముందు ఇరికిస్తాడు. జ్యోత్స్నది మంచి మనసు అంటూ సెటైర్లు వేస్తాడు.
నీ సంగతి చూస్తా…
వీడియో బయటపడితే తన పరువు పోతుందని కార్తీక్ చెప్పినట్లు చేస్తుంది జ్యోత్స్న. వీడియోను అడ్డుపెట్టుకొని నన్ను ఆడుకుంటున్నావు కదా…నీ సంగతి తర్వాత చూస్తా కార్తీక్‌పై కోపంతో రగిలిపోతుంది జ్యోత్స్న. వీడియోను అడ్డుపెట్టుకొని జ్యోత్స్నతో కలిసి దీప కేక్ కట్ చేసేలా చేస్తాడు కార్తీక్. దీప, కార్తీక్ ఒకరికొకరు కేక్ తినిపించుకుంటారు.
ఆ సీన్ చూసి సహించలేకపోతారు జ్యోత్స్న, పారిజాతం. జ్యోత్స్నను కుటుంబసభ్యులు అందరూ ఆశీర్వదిస్తారు. దీపకు దశరథ్ కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతాడు. తండ్రి విషెస్‌తో దీప ఎమోషనల్ అవుతుంది. నాన్న అని పిలవబోయి ఆగిపోతుంది.
జ్యోత్స్న మాట…
సుమిత్ర కూడా దీపకు కేక్ తినిపించి దీవించాలని కార్తీక్ అంటాడు. ఇది నా మాట కాదు జ్యోత్స్న మాట అని ఆమెను ఇరికిస్తాడు. నేను ఎవరికి శుభాకాంక్షలు చెప్పనని సుమిత్ర అంటుంది. ఇదే నువ్వు నాకు ఇచ్చే బర్త్‌డే గిఫ్ట్ అనుకోమని జ్యోత్స్న అంటుంది. తల్లిని బతిమిలాడుతుంది.
ప్రాణం తీసే మనుషులకు…
ఇష్టం లేకపోయినా జ్యోత్స్న కోసం నిన్ను దీవించాల్సివస్తుందని సుమిత్ర అంటుంది. కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంది. సుమిత్ర కాళ్లకు మొక్కబోతుంది దీప. కానీ సుమిత్ర తన కాళ్లను వెనక్కి తీసుకుంటుంది. ప్రాణం తీసే నీలాంటి మనుషులకు నా ఆశీర్వాదాలు అవసరం లేదని అంటుంది. శివన్నారాయణ కూడా దీపను విషెస్ చెప్పడానికి ఇష్టపడడు. దీపను అనాథ అంటూ అవమానిస్తాడు.
దీప సాయం…
దీపపై కోపంతో అక్కడి నుంచి వెళ్లబోతుంది సుమిత్ర. ఒక్కసారిగా వెనక్కి తిరగడంతో కాలు బెణుకుతుంది. దీప సాయం చేయబోతే వద్దని అంటుంది సుమిత్ర. ఎవరినైతే మనం సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నామో వాళ్లే నా వల్ల బాధపడుతున్నారని కార్తీక్‌తో అంటుంది దీప. నా తల్లికి నా మీద ఉన్న ద్వేషం పోగొట్టాలి…నన్ను కూతురిగా కాదు మనిషిలా ఆదరిస్తే చాలాని అంటుంది. నీ నెక్స్ట్ బర్త్‌డేను మీ అమ్మనాన్నలతో సంతోషంగా జరుపుకునేలా చేస్తానని దీపకు మాటిస్తాడు కార్తీక్.
దీపపై ద్వేషం…
కాలునొప్పి తో సుమిత్ర విలవిలలాడటం దీప తట్టుకోలేకపోతుంది. ఆమె కాలును మర్ధన చేస్తుంది. మరోవైపు తిరిగి పడుకున్న సుమిత్ర…తన కాళ్లు పట్టుకున్నది జ్యోత్స్న అనుకుంటుంది. జ్యోత్స్నపై ఉన్న ప్రేమను, దీపపై ద్వేషాన్ని బయటపెడుతుంది. పండుగలా జరగాల్సిన నీ పుట్టినరోజు దీప కారణంగా ఇలా బాధతో జరుపుకోవాల్సివచ్చిందని అంటుంది.
అర్హత లేదు…
అప్పుడే జ్యోత్స్న రూమ్‌లోకి వస్తూ కనిపించడంతో తన కాళ్లు నొక్కుతున్న దీప వైపు చూసి షాకవుతుంది. నిన్ను నా గదిలోకి ఎవరూ రమ్మన్నారు అని నిప్పులు చెరుగుతుంది. జ్యోత్స్న అమాయకురాలు అని అంటుంది. నా కూతురు పక్కన నిలబడే అర్హత నీకు లేదని చెబుతుంది. నా కాళ్లు పట్టుకునే అర్హత కూడా లేదని అంటుంది. అవమానాలు ఎన్ని ఎదురైన జ్యోత్స్న బారి నుంచి మిమ్మల్ని కాపాడుకుంటానని మనసులో అనుకుంటుంది దీప.
దేవుడి పాదాల దగ్గర…
దీప మల్లెపూలు తెంపుకొని ఇంట్లోకి వస్తుండగా…చూడకుండా కార్తీక్‌ను గుద్దుకుంటుంది. దీప చేతిలో ఉన్న మల్లెపూలు కార్తీక్ కాళ్లపై పడిపోతాయి. పూలు జారిపోయిన పడాల్సిన చోటే పడ్డాయని దీప అంటుంది. అవి నా జడలోకి చేరడానికంటే ముందు దేవుడి పాదాల దగ్గరకు చేరాయని దీప అంటుంది.
నీ మెడలో తాళి కట్టానని నన్ను గొప్పోడిని చేయద్దని కార్తీక్ అంటాడు. శౌర్య కోసం నేను నీ మెడలో తాళి కట్టలేదని చెబుతాడు.
నా మేనత్త కూతురివి…
నువ్వు నా మేనత్త కూతురివి, నువ్వు పుట్టడమే నా భార్యగా పుట్టావు అందుకే మనం ఒక్కటయ్యాం…నేను నీ మెడలో తాళి కట్టానని చెబుతాడు. నువ్వు ఈ మల్లెపువ్వు లాంటిదానివేనని, ఎన్ని కష్టాలు, అవమానాలు ఎదురైనా నీ స్వభావం మాత్రం మారదని దీపను పొగుడుతాడు కార్తీక్.
బావ అని పిలిచిన దీప…
నా తల్లి నన్ను అసహ్యించుకుంటే చాలా బాధగా ఉందని దీప అంటుంది. మనం వెళ్లే దారిలో ఎన్నో రాళ్లు, ముళ్లు ఉన్నాయని వాటిని దాటుకుంటూ వెళ్లాలి మరదలా అని కార్తీక్ అంటాడు. ఏంటి మరదలా అని పిలుస్తున్నారు ఎవరైనా వింటే అని కార్తీక్‌తో అంటుంది దీప. నా మరదలు నా ఇష్టం. నా అత్త కూతురిని నేను మరదలా అని పిలుచుకుంటాను.
అవసరమైతే .పాటలు పాడుకుంటానని కార్తీక్ చెబుతాడు. నాకు మిమ్మల్ని ఒకలా పిలవాలని ఉందని సిగ్గుపడిపోతుంది దీప. నోటితో చెప్పలేక మల్లెపూలతో బావ అని రాస్తుంది. అది చూసి కార్తీక్ సంబరపడిపోతాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం