




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ తెలుగులో వచ్చేసిన రెండు హారర్ కామెడీ సినిమాలు.. నాలుగైదు భాషల్లో స్ట్రీమింగ్.. వీకెండ్‌కు బెస్ట్!
ఓటీటీలోకి ఇవాళ రెండు హారర్ కామెడీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవి కూడా తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో ఒకటి సమంత నిర్మించిన శుభం మూవీ అయితే మరొకటి డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లవెల్. మరి ఈ రెండు తెలుగు హారర్ కామెడీ మూవీస్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఇవాళ రెండు హారర్ కామెడీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. అవి రెండు కూడా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒకటి స్ట్రైట్ తెలుగు సినిమా కాగా మరొకటి తమిళ హారర్ కామెడీ చిత్రం. ఈ రెండు సినిమాలు నాలుగైదు భాషల్లో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్ ఓటీటీ
తమిళంలో హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన సినిమా డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్. తమిళ కామెడీ హీరో సంతానం, గీతిక తివారీ, యాషిక ఆనంద్, డైరెక్టర్స్ గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎస్ ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
2025 మే 16న థియేటర్లలో విడుదలైన డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్ ఓటీటీలోకి ఇవాళ (జూన్ 13) వచ్చేసింది. జీ5లో డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవెల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అది కూడా తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లో డీడీ నెక్ట్స్ లెవెల్ ఓటీటీ రిలీజ్ అయింది.
డీడీ నెక్ట్స్ లెవెల్ కథ
ఇదిలా ఉంటే డెవిల్స్ డబుల్: నెక్ట్స్ లెవల్ కథ విషయానికొస్తే.. సినిమా అంతా సినీ విమర్శకుడు కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అతను అసాధారణ దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వ రాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి వెళ్తాడు.
ఆ స్క్రీనింగ్ చిత్రంలోనే కిస్సా ఇరుక్కుపోతాడు. దాంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించడమే డీడీ నెక్ట్స్ లెవెల్ మూవీ. అయితే, ఇదంతా కామెడీ, హారర్ అంశాలతో అద్యంతం వినోద భరితంగా సాగుతుంది. కిస్సా తనకు దొరికిన ఆధారాలను డీకోడ్ చేస్తూ బయటకు ఎలా వచ్చారన్నదే ఆసక్తికరంగా సాగుతుంది.
సమంత నిర్మించిన మూవీ
ఇక ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మరో హారర్ కామెడీ చిత్రం శుభం. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి నిర్మించిన శుభం సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో హారర్ కామెడీ నేపథ్యంలో సాగే శుభం మూవీకి ప్రవీణ్ కండ్రేగులు దర్శకత్వం వహించారు.
హర్షిత్ రెడ్డి, సమంత, శాలిని కొండెపూడి, శ్రీయా కొంతం, వంశీధర్ గౌడ్, గవిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చరణ్ పెర్రి ప్రధాన పాత్రల్లో నటించిన శుభం మే 9న థియేటర్లలో విడుదలై కామెడీ బాగుందనే టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకున్న శుభం ఓటీటీలోకి నేడు వచ్చేసింది.
శుభం ఓటీటీ స్ట్రీమింగ్
జియో హాట్‌స్టార్‌లో ఇవాళ్టీ నుంచి శుభం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, హిందీ వంటి ఐదు భాషల్లో శుభం ఓటీటీ రిలీజ్ అయింది. సీరియళ్లలో పిచ్చిదే దెయ్యాలైన భార్యలను భర్తలు ఎలా కాపాడుకున్నారన్నదే శుభం కథ. ఇక ఈ హారర్ కామెడీ జోనర్‌లో ఈ రెండు ఓటీటీ సినిమాలు వీకెండ్‌లో చూసేందుకు బెస్ట్.
సంబంధిత కథనం