పోలో గేమ్ ఆడుతూ చనిపోయిన హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త.. తేనెటీగ మింగడం వల్లే మరణించిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్!

Best Web Hosting Provider In India 2024

పోలో గేమ్ ఆడుతూ చనిపోయిన హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త.. తేనెటీగ మింగడం వల్లే మరణించిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్!

Sanjiv Kumar HT Telugu

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారవేత్త సంజయ్ కపూర్ హఠాత్తుగా మరణించారు. ఇంగ్లాండ్‌లో పోలో గేమ్ ఆడుతూ కుప్పకూలిపోయిన సంజయ్ కపూర్ కన్నమూశారు. అయితే, మందుగా సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించారని వార్తలు రాగా తాజాగా ఆయన తేనెటీగ మింగడం వల్లే చనిపోయారని అంటున్నారు.

పోలో గేమ్ ఆడుతూ చనిపోయిన హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త.. తేనెటీగ మింగడం వల్లే మరణించిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్! (HT)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామిక వేత్త సంజయ్ కపూర్ ఇంగ్లాండ్‌లో కన్నుమూశారు. సంజయ్ కపూర్ వయసు 53 ఏళ్లు. సంజయ్ కపూర్ మరణాన్ని రచయిత, కాలమిస్ట్ సుహేల్ సేథ్ ధృవీకరించారు. అయితే, ఇంగ్లాండ్‌లోనే పోలో గేమ్ ఆడుతూ సంజయ్ కపూర్ గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి.

గుర్రాలపై కూర్చుని

ముందుగా అంతా గుండెపోటుతో సంజయ్ కపూర్ మరణించారని అనుకున్నారు. కానీ, సంజయ్ కపూర్ మరణానికి తేనెటీగ కూడా కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. యూకేలో జూన్ 12న పోలో గేమ్ ఆడారు సంజయ్ కపూర్. గుర్రాలపై కూర్చోని స్టిక్‌తో బాల్‌ను కొట్టే ఆటే పోలో. గ్రౌండ్‌లో ఈ ఆట ఆడుతుండగా సంజయ్ కపూర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

తేనెటీగను మింగడంతో

గుర్రంపై కూర్చుని ఆడుతుండగా సంజయ్ కపూర్ గుండెపోటుకు గురయ్యారు. అయితే, గుర్రంపై ఉండగా సంజయ్ కపూర్ అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు తేనెటీగను మింగినట్లు సమాచారం. తేనెటీగను మింగడంతో అస్వస్థతకు గురైన సంజయ్ కపూర్ కింద పడిపోయారు. అదే గుండెపోటుకు దారి తీసిందని తెలుస్తోంది.

బాలీవుడ్ దిగ్భ్రాంతి

హాస్పిటల్‌కు తరలించే క్రమంలో సంజయ్ కపూర్ మరణించారు. సంజయ్ కపూర్ హఠాన్మరణంతో బాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయింది. దీంతో ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. సంజయ్ మృతిపట్ల అటు సినీ రంగం, ఇటు వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు నివాళులు ప్రకటిస్తున్నారు.

సంజయ్ కపూర్ రెండో పెళ్లి

ఇదిలా ఉంటే, సంజయ్ కపూర్‌ను కరిష్మా కపూర్ 2003లో వివాహం చేసుకుంది. అయితే, 13 ఏళ్లకు ఈ జంట విడిపోయింది. 2016లో సంజయ్ కపూర్, కరిష్మా కపూర్ విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు సమైరా, కియాన్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నాళ్లకు మాజీ మోడల్, వ్యాపారవేత్త ప్రియా సచ్‌దేవ్‌ను సంజయ్ కపూర్ రెండో వివాహం చేసుకున్నారు.

కరీనా, సైఫ్ పరామర్శ

సంజయ్-ప్రియ జంటకు 2018లో అజారియాస్ అనే కుమారుడు జన్మించాడు. కానీ, కరిష్మా కపూర్ మాత్రం పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా ఉన్నారు. కాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్‌కు కరిష్మా కపూర్ సోదరి అని తెలిసిందే. సంజయ్ కపూర్ మరణ వార్త తెలిసి ముంబైలోని కరిష్మా కపూర్ ఇంటికి కరీనా కపూర్, ఆమె భర్త సైఫ్ అలీ ఖాన్ చేరుకున్నారు. కరిష్మాను కరీనా, సైఫ్ పరామర్శించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024