నా వరకూ నిజమైన సక్సెస్ అంటే ఇదే.. రెండేళ్లుగా స్వేచ్ఛగా ఉన్నాను: సమంత కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

నా వరకూ నిజమైన సక్సెస్ అంటే ఇదే.. రెండేళ్లుగా స్వేచ్ఛగా ఉన్నాను: సమంత కామెంట్స్

Hari Prasad S HT Telugu

సమంత ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఉద్దేశంలో సక్సెస్ కు అర్థం మారిపోయిందని చెప్పడం విశేషం. రెండేళ్లుగా ఒక్క సినిమా చేయకుండా తాను స్వేచ్ఛగా ఉన్నట్లు కూడా ఆమె చెప్పింది. ఇంకా ఆమె ఏమన్నదో చూడండి.

నా వరకూ నిజమైన సక్సెస్ అంటే ఇదే.. రెండేళ్లుగా స్వేచ్ఛగా ఉన్నాను: సమంత కామెంట్స్

సమంత రుత్ ప్రభు ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ నటి. తర్వాత మయోసైటిస్ బారిన పడి రెండేళ్లుగా ఒక్క మూవీ కూడా చేయలేదు. అయితే తన వరకూ ఈ స్వేచ్ఛే నిజమైన సక్సెస్ అని, సక్సెస్ అర్థం మారిపోయిందని ఆమె చెప్పింది. ఈ మధ్యే సమంత తొలిసారి నిర్మించిన శుభం మూవీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

స్వేచ్ఛే సక్సెస్‌కు నిదర్శనం – సమంత

సమంత చివరిసారిగా ఫిమేల్ లీడ్ గా నటించిన మూవీ ఖుషీ. 2023లో రిలీజైంది. ఆ తర్వాత ఆమె మరో మూవీలో కనిపించలేదు. ఈ మధ్యే తాను నిర్మించిన శుభం మూవీలో ఓ చిన్న అతిథి పాత్ర మాత్రం చేసింది. ఇప్పుడామె గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సక్సెస్ కు అసలు అర్థం ఏంటన్నదానిపై మాట్లాడింది. ఇప్పుడు తాను సక్సెస్ ను స్వేచ్ఛ పరంగా చూస్తున్నానని చెప్పడం విశేషం.

“ఈరోజు, నా సక్సెస్ కు నిర్వచనం స్వేచ్ఛ. రెండు సంవత్సరాల విరామం తీసుకునే స్వేచ్ఛ. రెండేళ్లుగా నా సినిమా విడుదల కాలేదు. అభివృద్ధి చెందడానికి స్వేచ్ఛ, పరిణతి చెందడానికి స్వేచ్ఛ, ఒక బాక్స్ లోనే ఉండకపోవడం స్వేచ్ఛ” అని సమంత చెప్పింది.

ఇప్పుడే నేను ఎక్కువ సక్సెస్ సాధించాను

ఎవరు ఏమనుకుంటున్నారన్న దానితో సంబంధం లేకుండా గతంలో కంటే తాను ఇప్పుడే ఎక్కువ సక్సెస్ సాధించినట్లు సమంత చెబుతోంది. నిజానికి గతంతో పోలిస్తే తాను ఇప్పుడు సక్సెస్ కాదని చాలా మంది భావిస్తున్నట్లు ఆమె చెప్పింది. “బహుశా చుట్టూ ఉన్న చాలా మంది నన్ను ఇప్పుడు అంతకుముందు ఉన్నదానితో పోలిస్తే సక్సెస్‌ఫుల్ కాదని భావించవచ్చు.

కానీ నా దృష్టిలో, నేను గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు మరింత సక్సెస్ సాధించాను. నేను ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవడానికి సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే నేను చేస్తున్న అనేక పనులు నాకు నిజంగా ఆకర్షణీయంగా ఉన్నాయి” అని సమంత అభిప్రాయపడింది.

సమంత రాబోయే ప్రాజెక్టులు

సమంతకు అనేక రాబోయే ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో రాజ్ నిడమోరు, కృష్ణ డికె, నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి నిర్మించిన యాక్షన్ ఫాంటసీ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ కూడా ఉంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్, వామికా గబ్బి, జైదీప్ అహ్లావత్ కూడా నటిస్తున్నారు.

ఆమె ‘మా ఇంటి బంగారం’ అనే యాక్షన్ థ్రిల్లర్ కూడా చేస్తున్నారు. దీనికి ఆమె సహ-నిర్మాత కూడా. సమంత తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం మేలో ఈ బ్యానర్ కింద మొదటి సినిమా ‘శుభం’ను విడుదల చేశారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024