ఈ మలయాళ కామెడీ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూశారా లేదా?

Best Web Hosting Provider In India 2024

ఈ మలయాళ కామెడీ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూశారా లేదా?

Hari Prasad S HT Telugu

మలయాళ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానాకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలోనే బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై మరింత చెలరేగిపోతోంది. ఈ సినిమాపై ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ మలయాళ కామెడీ మూవీకి ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా చూశారా లేదా?

బ్లాక్‌బస్టర్ మలయాళం స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా(Alappuzha Gymkhana) బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. తెలుగులోనూ థియేటర్లలో రిలీజైంది. అయితే అప్పుడు అంతగా రాని రెస్పాన్స్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన తర్వాత వస్తోంది. ఈ మూవీ గురువారం (జూన్ 12) సాయంత్రం నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఆలప్పుళ జింఖానా ఓటీటీ రెస్పాన్స్ ఇలా

ప్రేమలు మూవీ ఫేమ్ నస్లేన్ తోపాటు పలువురు ఇతర మలయాళ నటులు నటించిన స్పోర్ట్స్ కామెడీ మూవీ ఆలప్పుళ జింఖానా. ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టగానే సోషల్ మీడియాలో పలువురు ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు రాస్తున్నారు. ఈ మధ్య కాలంలో నా మోస్ట్ ఫేవరెట్ మూవీ అని ఓ వ్యక్తి పోస్ట్ చేశారు. బేసిక్ స్టోరీతో వచ్చినా దానిని స్క్రీన్ పై చూపించిన తీరు అద్భుతమని, మ్యూజిక్ కూడా చాలా బాగుందని మరో వ్యక్తి అన్నారు.

మిగిలిన స్పోర్ట్స్ సినిమాల్లో ఉండే ఎండింగ్ దీనికి లేకపోయినా.. ఈ భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడమే సినిమాకు ప్లస్ పాయింట్ అని మరో అభిమాని సోషల్ మీడియాలో రివ్యూ రాశారు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మలయాళం సినిమా ఇదే అని, రెండోసారి చూసినా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందని మరొకరు అభిప్రాయపడ్డారు. ఇలా సోనీ లివ్ ఓటీటీలోకి సినిమా వచ్చినప్పటి నుంచీ చాలా వరకు పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి.

ఆలప్పుళ జింఖానా స్టోరీ ఏంటంటే?

ఆలప్పుళ జింఖానా మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. ఖాలిద్ రెహమాన్ డైరెక్ట్ చేశాడు. నస్లేన్ తోపాటు సందీప్ ప్రదీప్, లూక్మన్ అవరన్ లాంటి వాళ్లు నటించారు. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన కొందరు యువకులు.. తర్వాత చదువుల కోసం కాలేజీల్లో సీటు రావాలంటే స్పోర్ట్స్ కోటానే సరైనదని భావిస్తారు. దీంతో బాక్సింగ్ లో చేరతారు.

ఆలప్పుళ జింఖానా అనే క్లబ్ లో బాక్సింగ్ నేర్చుకుంటారు. తర్వాత జిల్లా, రాష్ట్ర స్థాయిలో గెలిచి కాలేజీలో సీటు సంపాదించాలని భావిస్తారు. అయితే ఈ నిర్ణయం వాళ్ల జీవితాలను మొత్తం మార్చేస్తుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో సాగే సినిమాయే అయినా.. ఇలాంటి జానర్లో వచ్చిన మిగిలిన సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నంగా సాగే మూవీ ఇది. కామెడీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

ఇక మ్యూజిక్ మరో హైలైట్. ఇందులోని నటీనటులందరి సహజ నటన ఆకట్టుకుంటుంది. ఐఎండీబీలో 7.2 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో మలయాళం, తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ కచ్చితంగా చూడాల్సిన సినిమాల్లో ఇదీ ఒకటి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024