మరో ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024

మరో ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తరుణం చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇప్పటికే ఓ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిత్రం మరో ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి రానుంది. ఆ వివరాలు ఇవే..

మరో ఓటీటీలోకి రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘తరుణం’ థియేట్రికల్ రిలీజ్‍లో మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో కిషన్ దాస్, స్మృతి వెంకట్, రాజ్ అయ్యప్ప లీడ్ రోల్స్ చేయగా.. అరవింద్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఇప్పటికే ఓ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు మరో ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయింది.

స్ట్రీమింగ్ వివరాలు

తరుణం సినిమా ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 20వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే టెంట్‍కొట్టా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చింది. ఇప్పుడు ఆహా తమిళ్‍లోనూ అడుగుపెట్టనుంది. రెండో ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది.

టెంట్‍కొట్టాలో స్ట్రీమింగ్ తర్వాత తరుణం మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలే వచ్చాయి. స్టోరీ పాయింట్ బాగున్నా.. సాగదీతగా అనిపించిందనే కామెంట్లను కొందరు నెటిజన్లు పోస్ట్ చేశారు. నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆహా తమిళ్ ప్లాట్‍ఫామ్‍లోకి వచ్చాక ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

హత్యను దాచేందుకు..

తరుణం మూవీని లవ్ స్టోరీ, క్రైమ్ అంశాలతో డైరెక్టర్ అరవింద్ శ్రీనివాసన్ తెరకెక్కించారు. సీఆర్పీఎఫ్ ఆఫీసర్ అర్జున్ (కిషన్ దాస్), మీరా (స్మృతి వెంకట్) ప్రేమలో పడతారు. అయితే, మీరాను రోహిత్ (రాజ్ అయ్యప్ప) ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఓరోజు మీరాతో గొడవ తర్వాత ఆమె ఇంట్లో.. రోహిత్ చనిపోతాడు. ఈ విషయాన్ని అర్జున్‍‍తో మీరా చెబుతుంది. దీంతో ఆ హత్యను దాచేందుకు అర్జున్, మీరా నిర్ణయించుకుంటారు. ఆ హత్యతో మీరాకు ఏమైనా సంబంధం ఉందా? రోహిత్ మృతదేహాన్ని దాచేసి హత్యను కప్పిపుచ్చారా? చివరికి ఏం జరిగిందనేవి ఈ చిత్రంలో ఉంటాయి.

తరుణం మూవీలో కిషన్, స్మృతి, రాజ్‍తో పాటు బాాల శరవణన్, గీతా కైలాసం, శ్రీజా రవి, సుజాత బాబు కీలకపాత్రలు పోషించారు. జెన్ స్టూడియోస్ బ్యానర్‌పై పుగళ్, ఈడెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.. దర్బుకా శివ, అశ్విన్ హేమంత్ సంగీతం అందించారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024