నిన్ను కోరి జూన్ 14 ఎపిసోడ్: శోభనం పాలలో మత్తు మందు కలిపిన శాలిని- చంద్రకళ ఫస్ట్ నైట్ సక్సెస్- దుష్ట త్రయం ప్లాన్ ఫెయిల్

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జూన్ 14 ఎపిసోడ్: శోభనం పాలలో మత్తు మందు కలిపిన శాలిని- చంద్రకళ ఫస్ట్ నైట్ సక్సెస్- దుష్ట త్రయం ప్లాన్ ఫెయిల్

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ జూన్ 14 ఎపిసోడ్‌లో చంద్రకళ, విరాట్ ఫస్ట్ నైట్‌కు శ్యామల రెడీ చేస్తుంటుంది. మరోవైపు శోభనం కావాల్సిన పాలల్లో శాలిని మత్తు మందు కలుపుతుంది. కానీ, అది కనిపెట్టిన తానే స్వయంగా పాల గ్లాస్ తీసుకెళ్తుంది చంద్రకళ. దాంతో విరాట్ చంద్రకళ ఫస్ట్ నైట్ సక్సెస్ అవుతుంది.

నిన్ను కోరి సీరియల్ జూన్ 14 ఎపిసోడ్‌

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో విరాట్, చంద్రకళ శోభనానికి గదిని పూలతో కామాక్షి, శ్రుతితో డెకరేట్ చేయిస్తుంది శ్యామల. శ్రుతికి చేయరాకుంటే కామాక్షిని తిడుతుంది శ్యామల. ఇలాంటివి చేస్తేనే కదా దానికి కల్యాణం అవుతుందని శ్యామల అంటే.. దానికి కల్యాణం కావాలంటే ముందు ఈ చంద్రకు విడాకులు కావాలి కదా అని కామాక్షి గొణుకుతుంది.

సర్‌ప్రైజ్ అయ్యావా

ఇంతలో విరాట్ వచ్చి శోభనం ఏర్పాట్లు చూసి షాక్ అవుతాడు. చంద్రకు నీకు ఫస్ట్ నైట్. అందుకే కాల్ చేసి త్వరగా రమ్మన్నాను అని శ్యామల అంటుంది. చంద్రకళను మెల్లిగా తిడతాడు విరాట్. నాకేం సంబంధం లేదు. పిన్నిగారు చేశారు అని చంద్ర అంటుంది. ఏంట్రా అల్లుడు సర్‌ప్రైజ్ అయ్యావా అని శ్యామల అంటుంది. ఈ సర్‌ప్రైజ్ అమ్మకు తెలుసా. ఒప్పుకుందా అని విరాట్ అంటాడు.

ఏ తల్లి కాదంటుందిరా. ఒప్పుకుందని చెప్పిన శ్యామల చంద్రకళ నిన్ను రెడీ చేస్తాని అని తీసుకెళ్లిపోతుంది. జగదీశ్వరి దగ్గరికి వెళ్లి ఫస్ట్ నైట్ గురించి అడుగుతాడు విరాట్. ఇది వద్దని చెప్పలేవా అని నిలదీస్తాడు విరాట్. చేయాల్సిన కార్యమేగా. ఇష్టం లేకున్నా చేయాల్సిందే. నీ మనసులో ఏముందో తెలియదుగా అని జగదీశ్వరి అంటుంది. నేను ఈ శోభనానికి ఒప్పుకోను అని విరాట్ అంటాడు.

అయితే, నేరుగా వెళ్లి అత్తయ్యకు నిజం చెప్పేసేయ్ అని జగదీశ్వరి అనడంతో విరాట్ సైలెంట్ అవుతాడు. చెప్పగలవా. నేను ద్వేషంతో కట్టిన తాళి అని చెప్పగలవా. నీకు తెలుసు నువ్ చాలా పెద్ద తప్పు చేశావ్. దాని నుంచి నువ్వు, నేను తప్పించుకోలేం అని వెళ్లిపోతుంది జగదీశ్వరి. ఇదే జీవితం అయితే ఆ నాలుగు గోడల మధ్య ఎలా గడపాలో నాకు తెలుసు అని విరాట్ వెళ్లిపోతాడు.

పర్మిషన్ ఇచ్చింది

మరోవైపు చంద్రను శ్యామల రెడీ చేస్తుంది. అది దొంగచాటుగా చూస్తారు కామాక్షి, శాలిని, శ్రుతి. అన్ని పనులు శ్యామలే చేసేలా ఉంది. మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందని శ్రుతి శాలినిని అడుగుతుంది. ఏదోలా చేయాలి. లేకుంటే ఇబ్బంది అవుతుంది అని అంటుంది శాలిని. వాళ్లను చూసిన శ్యామల వెళ్లి పాల గ్లాస్ తీసుకురమ్మని చెబుతుంది. దాంతో సంతోషంగా వెళ్లిన దుష్ట త్రయం మన ప్లాన్‌కు ఆ పిచ్చి శ్యామలే పర్మిషన్ ఇచ్చిందని కామాక్షి అంటుంది.

పాలల్లో మత్తు మందు కలుపుతుంది శాలిని. ఈ ఫస్ట్ నైట్‌తో బావ గారెని మైకంలో పడేయాలనుకుంది. కానీ, ఈ మత్తు మందుతో ఇద్దరు మైకంలో పడుకుంటారు. ఫస్ట్ నైట్ జరగకుండానే తెల్లవారుతుంది అని శాలిని అంటుంది. ఆ పాల గ్లాస్ తీసుకెళ్లి చంద్రకళకు ఇస్తుంది శాలిని. విరాట్ గదిలోకి వెళ్లమని చంద్రకళకు చెబుతుంది శ్యామల. దాంతో వెళ్లిన చంద్రకళ కావాలనే పాల గ్లాస్ కిందపడేస్తుంది.

అది చూసి కామాక్షి, శ్రుతి, శాలిని బిత్తరపోతారు. కంగారులో గ్లాస్ చేజారిందని చంద్రకళ అంటుంది. ఇంకో గ్లాస్ పాలు తీసుకురా అని శాలినికి శ్యామల చెబితే నేను వెళ్లి తీసుకొస్తానని చంద్రకళే వెళ్తుంది. కింద పడిన పాలను శ్రుతిని క్లీన్ చేయమని వెళ్తుంది శ్యామల. ఇంతలో చంద్రకళ వచ్చి ఏంటీ మీ ప్లాన్ ఫెయిల్ అయిందని షాక్ అయ్యారా. మీరు ఏదో ప్లాన్ చేశారని డౌట్ వచ్చే పాల గ్లాస్ కింద పడేశాను. మీ పాల ప్లాన్ ఫెయిల్ అయింది. మా ఫస్ట్ నైట్ సక్సెస్ అవుతుందని చంద్రకళ వెళ్లిపోతుంది.

ఆశ్చర్యపోయిన విరాట్

ఇప్పుడు గదిలోకి వచ్చి చంద్రకళ ఎంత రెచ్చిపోతుంది. ఓవర్ చేస్తే ఒక్కటి పీకుతా అని విరాట్ అనుకుంటాడు. చంద్రను శ్యామల తీసుకెళ్తుంది. అది చూసిన మగాళ్లకు ఇదే వీక్ పాయింట్. విరాట్ పడిపోతాడేమో అని దుష్ట త్రయం భయపడుతుంది. చంద్రకళ అందాన్ని చూసి విరాట్ ఆశ్చర్యపోతాడు. చంద్ర సిగ్గుపడుతుంది. చంద్ర పాలు ఇస్తే నాకేం వద్దని పడేస్తాడు విరాట్.

పాల గ్లాస్ పగిలిన శబ్దాన్ని శ్యామలతోపాటు దుష్ట త్రయం వింటారు. వాటి విలువ అంతే వెళ్లి మౌనంగా పడుకో అని విరాట్ అంటాడు. ఇంతలో శ్యామల డోర్ కొడుతుంది. ఏంటా సౌండ్ అంటుంది. చెప్పేయనా. ఎందుకు ఫార్మాలిటీ కోసం చేయడం అని చంద్రకళ అంటుంది. తప్పైందే. ఏం చెప్పకే అని విరాట్ అంటాడు. శ్యామల అడిగిన ప్రశ్నలకు చంద్ర, విరాట్ సమాధానాలు చెబుతారు.

పిన్నికి అనుమానం

దాంతో అలాగే, కానివ్వండి అని వెళ్లిపోతుంది శ్యామల. పిన్నికి అనుమానం వచ్చినట్లుంది. ఇప్పుడు ఎలా అని చంద్రకళ అంటుంది. ఐడియా చెప్పు అని విరాట్ అంటాడు. కట్ చేస్తే ఉదయం ఫస్ట్ నైట్ జరిగినట్లు విరాట్, చంద్ర ఇద్దరు వస్తారు. దుష్ట త్రయం నమ్మకుంటే ఏడ్చారు వాళ్ల నమ్మకంతో మనకు పనేంటీ అని విరాట్ అంటాడు. అక్కడితో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024