ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ ఎంతసేపు ఉంటుందంటే.. ఎంటర్‌టైనింగ్‍గా!

Best Web Hosting Provider In India 2024

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ ఎంతసేపు ఉంటుందంటే.. ఎంటర్‌టైనింగ్‍గా!

ది రాజా సాబ్ టీజర్ ఎంత సేపు ఉండనుందో సమాచారం బయటికి వచ్చింది. ఈ టీజర్ ఎంటర్‌టైనింగ్‍గా ఉంటుందని తెలుస్తోంది. ప్రభాస్ పంచ్ డైలాగ్స్ ఉంటాయని టాక్.

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ ఎంత సేపు ఉంటుందంటే.. ఎంటర్‌టైనింగ్‍గా!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా టీజర్ కోసం సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత ఎంటర్‌టైనింగ్ రోల్‍ను ప్రభాస్ చేయడంతో మరింత ఎగ్జైట్‍మెంట్ నెలకొంది. ఈ హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ రిలీజ్ డేట్, టైమ్ కూడా వెల్లడయ్యాయి. తాజాగా టీజర్ రన్‍టైమ్ ఎంతనే సమాచారం బయటికి వచ్చింది.

టీజర్ ఎంతసేపంటే..

ది రాజా సాబ్ టీజర్ 2 నిమిషాల 2 సెకన్లు (122 సెకన్లు) ఉంటుందని సమాచారం వెల్లడైంది. ఈ విషయం సోషల్ మీడియాలో అప్పుడే వైరల్ అయింది. ఈ టీజర్ ఎలా ఉంటుందోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది.

టీజర్ రిలీజ్ డేట్, టైమ్

ది రాజా సాబ్ సినిమా టీజర్ మరో రెండు రోజుల్లో జూన్ 16వ తేదీన ఉదయం 10 గంటల 52 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ వివరాలను మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ చిత్రం నుంచి ఓ వర్కింగ్ స్టిల్ ఫొటోలను షేర్ చేసి టీజర్ రిలీజ్ టైమ్‍ను కన్ఫర్మ్ చేసింది. ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

టీజర్ ఇలా!

ది రాజా సాబ్ టీజర్ ఎంటర్‌టైనింగ్‍గా సాగుతుందని తెలుస్తోంది. గ్రాఫిక్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంటుందని టాక్. బుజ్జిగాడు రేంజ్‍లో ఫన్‍గా ప్రభాస్ పాత్ర ఉంటుందని, టీజర్లో పంచ్ డైలాగ్స్ కూడా మెప్పిస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వింటేజ్ ప్రభాస్‍ను ప్రేక్షకులు చూడబోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా జూన్ 16న రానున్న రాజాసాబ్ టీజర్‌పై ఆసక్తి విపరీతంగా ఉంది.

ఈ ఏడాది ఏప్రిల్‍లో ది రాజా సాబ్ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో డిసెంబర్ 5వ తేదీకి ఈ మూవీ విడుదల వాయిదా పడింది. రీసెంట్‍గానే ఈ కొత్త డేట్ ఖరారైంది.

రాజాసాబ్ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. రిధి కుమార్, జరీనా వాహబ్, వెన్నెల కిశోర్, మురళీశర్మ కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.

ది రాజా సాబ్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్ పాటకు ప్రభాస్ డ్యాన్స్ ఉంటుందంటూ ఇప్పటికే హైప్ పెంచేశారు తమన్. ఈ మూవీలో ఓ రీమిక్స్ సాంగ్ ఉంటుందని కూడా సమాచారం. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ ప్రొడ్యూజ్ చేస్తున్నారు. సుమారు రూ.300కోట్ల బడ్జెట్‍‍తో ఈ చిత్రం రూపొందుతోంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024