హీరోలు అవసరం లేదు.. స్టార్స్ వెంట పడటం కాదు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

హీరోలు అవసరం లేదు.. స్టార్స్ వెంట పడటం కాదు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

టాలీవుడ్‌లో యాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు శివాజీ రాజా. పర్వతనేని రాంబాబు నిర్మాతగా నిర్మిస్తున్న వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు శివాజీ రాజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పర్వతనేని రాంబాబు పుట్టిన రోజు సందర్భంగా వైల్డ్ బ్రీత్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

హీరోలు అవసరం లేదు.. స్టార్స్ వెంట పడటం కాదు.. నటుడు శివాజీ రాజా కామెంట్స్

కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు కూడా మంచి సక్సెస్ అందుకుంటాయని, హీరోలు అవసరం లేదని అన్నారు ప్రముఖ నటుడు శివాజీ రాజా. రేవు వంటి మంచి మూవీని నిర్మించిన ప్రొడక్షన్ హౌస్ సంహిత్ ఎంటర్‌టైన్ మెంట్స్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ వైల్డ్ బ్రీత్‌ను తాజాగా ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.

వైల్డ్ బ్రీత్ ఫస్ట్ లుక్ రిలీజ్

వైల్డ్ బ్రీత్ చిత్రానికి హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. డా.మురళీ చంద్ గింజుపల్లితో కలిసి పర్వతనేని రాంబాబు నిర్మిస్తున్నారు. వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను హైదరాబాద్ ఫిలింఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు శివాజీ రాజా చేతుల మీదుగా లాంఛ్ చేశారు.

పాత్రికేయుల సమక్షంలో

ఈ కార్యక్రమంలో నిర్మాతలు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ప్రసన్నకుమార్ అతిథులుగా హాజరయ్యారు. పలువురు పాత్రికేయ మిత్రుల సమక్షంలో వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్టర్ శివాజీ రాజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ప్రారంభం నుంచి

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ – “నాకు ఎంతో సన్నిహితులైన మీడియా మిత్రులు ఉన్నారు. నేను కెరీర్ ప్రారంభం నుంచీ వారితో స్నేహం చేస్తున్నా. అలాంటి మీడియా మిత్రుల్లో ఒకరైన పర్వతనేని రాంబాబు నిర్మాతగా వైల్డ్ బ్రీత్ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది” అని అన్నారు.

నిర్మాతగా ఎన్నో చిత్రాలు

“ఈ మధ్య కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలెన్నో విజయాలు సాధిస్తున్నాయి. వైల్డ్ బ్రీత్ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా బాగున్నాయి. పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆయన నిర్మాతగా ఎన్నో చిత్రాలు చేయాలని కోరుకుంటున్నా” అని శివాజీ రాజా తెలిపారు.

కథ బాగుంటే

“అలాగే దర్శకుడు హరినాథ్ పులి మంచి పేరు తెచ్చుకోవాలి. స్టార్స్ (హీరోలు) అవసరం లేదు. స్టార్స్ (హీరోల) వెంట పడటం కాదు. కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు” అని నటుడు శివాజీ రాజా అభిప్రాయపడ్డారు.

సంతోషంగా ఉంది

ఇదే ఈవెంట్‌లో నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. “పర్వతనేని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజున ఈ వైల్డ్ బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది” అని అన్నారు.

బీఏ రాజులా

“మన మీడియా ఫ్రెండ్స్‌లో బీఏ రాజు గారు నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. రాంబాబు కూడా అలాగే ప్రొడ్యూసర్‌గా ఎదగాలి. దర్శకుడు హరినాథ్ పులి చిన్నవాడు. అలాగే ఒదిగి ఉండి కష్టపడితే తప్పకుండా పైకి వస్తాడు. వైల్డ్ బ్రీత్ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా” అని నిర్మాత ప్రసన్న కుమార్ కోరారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024