ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ – కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Best Web Hosting Provider In India 2024

ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు అలర్ట్ – కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 20 నుంచి మొదటి విడత ప్రారంభం కానుంది. ఇది జూలై 1వ తేదీతో పూర్తవుతుంది. ఈ మేరకు పాలిసెట్ కన్వీనర్ వివరాలను వెల్లడించారు.

ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్

ఏపీ పాలీసెట్ 2025 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఫలితాలు విడుడల కాగా… తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. జూన్ 20వ తేదీ నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్ – ముఖ్య వివరాలు

  • ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ (మొదటి విడత) జూన్ 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
  • మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ అభ్యర్థుల వరకు ఫీజు చెల్లించుకోవాలి. ఇందుకు జూన్ 27వ తేదీ వరకు అవకాశం ఉంటుంది.
  • ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి.
  • ఫీజు చెల్లించే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • జూలై 3వ తేదీన సాయంత్రం 6 గంటల తర్వాత పాలిసెట్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • అలాట్ మెంట్ కాపీని https://polycet.ap.gov.in/DefaultPage.aspx వెబ్ సైట్ నుంచి పొందవచ్చు.
  • హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన కాలేజీలో సమర్పించి.. సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.
  • మెయిల్ ఐడీ – convenorpolycetap2025@gmail.com
  • హెల్ప్ లైన్ నెంబర్లు – 7995681678, 7995865456, 9177927677 (ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు).

గత నెలలో ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.

ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు – డౌన్లోడ్ ప్రాసెస్ ఇలా…

  1. ఏపీ పాలిసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://polycetap.nic.in/ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపింటే పాలిసెట్ ఫలితాలు – 2025 అప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  3. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్‌ వివరాలు నమోదు చేయాలి.
  4. సబ్మిట్ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Ap PolycetAndhra Pradesh NewsEducationAdmissions
Source / Credits

Best Web Hosting Provider In India 2024