





Best Web Hosting Provider In India 2024

కావ్య పాపతో అనిరుధ్ డేటింగ్, పెళ్లి.. రియాక్టయిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఏమన్నారంటే?
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై అనిరుధ్ స్పందించారు.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు శనివారం (జూన్ 14) తెగ వైరల్ గా మారాయి. త్వరలోనే వీళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ రియాక్టయ్యారు. ఎక్స్ లో పోస్టు చేశారు. పుకార్లను కొట్టిపారేశారు.
చిల్ గాయ్స్
సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో పెళ్లి రూమర్స్ పై మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ స్పందించారు. శనివారం ఎక్స్ లో పోస్టు పెట్టారు. “వివాహమా? లాల్ .. చిల్ అవ్వండి గాయ్స్. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయకండి” అని పేర్కొన్నారు. రెడ్డిట్ లో ఒక రోజు మొత్తం అనిరుధ్, కావ్య వివాహం గురించే డిస్కసన్ జరిగింది.వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదని అనిరుధ్ క్లారిటీ ఇచ్చేశారు.
డేటింగ్ అనౌన్స్ చేస్తారని
అనిరుధ్, కావ్య కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని, ఇప్పుడు దానిని అధికారికంగా ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారనే రూమర్లు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే అనిరుధ్ ఈ ప్రణాళికల గురించి ఏమీ తెలియని వ్యక్తిలా స్పందించారు. అలాంటిదేమీ జరగడం లేదని ఆయన ఖండించారు. అయితే కావ్యతో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లపై ఆయన స్పందించలేదు. ఇటీవల వారు డిన్నర్ డేట్‌లో కనిపించారని కొందరు పేర్కొన్నారు. అలాగే లాస్ వేగాస్ వెళ్లారని అంటున్నారు.
ఆ రూమర్లు
అనిరుధ్, కావ్య ఒక సంవత్సరం క్రితం డేటింగ్ ప్రారంభించారని, వివాహ ఏర్పాట్లు జరుగుతున్నాయని రెడ్డిటర్లు ఒక కథను ప్రచారం చేసిన తర్వాత ఇది వెలుగులోకి వచ్చింది. ఈ వేదికపై ఒక పోస్ట్ లో ఇలా పేర్కొన్నారు.. “సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ టీవీ అధినేత కళానిధి మారన్ కుమార్తె, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ జట్టు యజమాని కావ్య మారన్ రిలేషన్షిప్ లో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా కళానిధి మారన్‌తో వారి సంబంధం గురించి మాట్లాడారని, ఈ జంట త్వరలో వివాహం చేసుకుంటారని భావిస్తున్నారు” అని రాసుకొచ్చారు.
మ్యూజిక్ సన్సేషన్
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.. నటుడు రవి రాఘవేంద్ర, క్లాసికల్ డ్యాన్సర్ లక్ష్మి కుమారుడు. చిత్రనిర్మాత కె సుబ్రమణ్యం మనవడు. ఆయన అత్త లత.. రజనీకాంత్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ కుమార్, సూర్య, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా అనేక మంది దక్షిణ భారత స్టార్ల సినిమాలకు సంగీతం అందించారు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్‌తో ఆయనకు బాలీవుడ్‌లో కూడా పెద్ద బ్రేక్ వచ్చింది. కావ్య ఏమో సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ కుమార్తె. ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని. ఆమె తరచుగా తన జట్టుకు మద్దతుగా ఐపీఎల్ మ్యాచ్‌లలో కనిపిస్తుంది.
సంబంధిత కథనం