


Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో అదరగొడుతున్న తెలుగు మెడికో థ్రిల్లర్ మూవీ – రిలీజ్ రోజే ట్రెండింగ్‌లోకి…
తెలుగు మెడికో థ్రిల్లర్ మూవీ డియర్ ఉమ ఓటీటీలో అదరగొడుతోంది. శుక్రవారం సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ట్రెండింగ్ నిలిచింది. సుమయా రెడ్డి హీరోయిన్‌గా నటిస్తూ ఈ సినిమాను నిర్మించింది. పృథ్వీ అంబర్ హీరోగా నటించాడు.
తెలుగు మూవీ డియర్ ఉమ ఓటీటీలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. మెడికో థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది. విడుదల రోజే ట్రెండింగ్‌లోకి వచ్చింది. సన్ నెక్స్ట్ ఓటీటీలో టాప్ టెన్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా డియర్ ఉమ నిలిచింది.
హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్…
డియర్ ఉమ మూవీలో సుమయా రెడ్డి హీరోయిన్‌గా నటిస్తూ ఈ సినిమాను నిర్మించింది. అంతే కాకుండా ఈ సినిమా కథ. స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా సుమయా రెడ్డినే అందించింది. పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ మూవీకి సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. కార్పొరేట్ వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ రొమాంటిక్ థ్రిల్లర్‌గా డియర్ ఉమ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి ఫేమ్ రధన్ మ్యూజిక్ అందించాడు. హీరోయిన్‌గా ఈ మూవీతోనే సుమయా రెడ్డి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
ఉమతో ప్రేమలో పడ్డ దేవ్…
ఉమ (సుమయా రెడ్డి) చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కంటుంది. కష్టపడి ఎంబీబీఎస్‌లో సీటు సంపాదిస్తుంది. దేవ్‌కు(పృథ్వీ అంబర్) మ్యూజిక్ అంటే ప్రాణం. రాక్‌స్టార్ కావాలని కలలు కంటాడు. మ్యూజిక్ కారణంగా చదువులో వెనుకబడిపోతాడు.
దాంతో దేవ్‌ను తండ్రి ఇంట్లో నుంచి వెళ్లగొడతాడు. రాక్‌స్టార్‌గా సక్సెస్ కావాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అవేవీ సక్సెస్ కాకపోవడంతో గిరి అనే స్నేహితుడి ఆర్ట్ గ్యాలరీలో పార్ట్ టైమ్ జాబ్‌లో చేరిపోతాడు. ఓ డైరీ ద్వారా దేవ్ జీవితంలోకి ఉమా వస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు.
ఉమకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకుంటాడు. అప్పుడే ఉమకు సంబంధించిన ఓ షాకింగ్ నిజం దేవ్‌కు తెలుస్తుంది? కార్పొరేట్ మెడికల్ మాఫియాపై సాగించిన పోరాటంలో ఉమకు ఏమైంది? ఆమె కలను దేవ్ ఎలా నెరవేర్చాడు ? అన్నదే ఈ మూవీ క థ.
సంబంధిత కథనం