




Best Web Hosting Provider In India 2024
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల- స్కోర్‌కార్డ్‌ని ఇలా చెక్ చేసుకోండి..
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ యూజీ స్కోర్‌కార్డ్‌ని ఎలా చెక్ చేసుకోవాలి? వంటి వాటితో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
నీట్ యూజీ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్! నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ అండర్గ్రాడ్యుయేట్/ నీట్ యూజీ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. neet.nta.nic.in అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ మార్కులు, పేర్లు, టాపర్ల వివరాలను కూడ ఎన్టీఏ వెల్లడించింది.
నీట్ యూజీ 2025 ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
స్టెప్ 1- నీట్ యూజీ అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ఓపెన్ చేయండి. హోమ్ పేజీ మీద కనిపించే ఎగ్జామినేషన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 2- నీట్ యూజీ 2025 స్కోర్‌కార్డ్ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ నీట్ యూజీ 2025 అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఫిల్ చేసి, సబ్మిట్ చేయండి.
స్టెప్ 4- నీట్ యూజీ స్కోర్‌కార్డ్‌ని చెక్ చేసుకుని పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసు పెట్టుకోండి.
నీట్ యూజీ 2025 స్కోర్‌కార్డ్‌లో ఇవి చెక్ చేసుకోవాలి..
- అభ్యర్థి పేరు
- రోల్ నెంబర్
- అప్లికేషన్ నెంబర్
- మార్కులు (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలాజీ)
- టోటల్ మార్కులు
- నీట్ యూజీ క్వాలిఫికేషన్ స్టేటస్
- కేటగిరీ ర్యాంక్ (ఒకేళ ఉంటే)
- పర్సెంటైల్ స్కోర్
- నీట్ యూజీ ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)
- కటాఫ్ మార్కులు
నీట్ యూజీ 2025- నెక్ట్స్ ఏంటి?
2025 మే 4న నీట్ యూజీ పరీక్ష దేశవ్యాప్తంగా సింగిల్ షిఫ్ట్‌లో జరిగింది. 500 నగరాల్లోని 5,453 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. ఈ దఫా పరీక్షకు 22.7 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.
ఫలితాల తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. నీట్ యూజీ కౌన్సిలింగ్ షెడ్యూల్‌ని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఎంసీసీ అధికారిక వెబ్సైట్లో ఇతర వివరాలను చెక్ చేసుకోవచ్చు.
భారతదేశంలోని టాప్ మెడికల్ కాలేజీల జాబితా ..
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2024 ప్రకారం..
ర్యాంక్ 1: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దిల్లీ
ర్యాంక్ 2: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్), చండీగఢ్
ర్యాంక్ 3: క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు
ర్యాంక్ 4: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, (నిమ్హాన్స్) బెంగళూరు
ర్యాంక్ 5: జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మేర్), పుదుచ్చేరి
ర్యాంక్ 6: సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీఐఎంఎస్), లక్నో
ర్యాంక్ 7: బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ), వారణాసి
ర్యాంక్ 8: అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు
ర్యాంక్ 9: కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link