బ్రహ్మముడి ప్రోమో: రాజ్ పెళ్లిలో మరో అపచారం- యామినికే కలిసొచ్చిన కనకం ప్లాన్- బెడిసికొట్టిన స్కెచ్- అరక్షణం చాలంటూ కావ్య

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి ప్రోమో: రాజ్ పెళ్లిలో మరో అపచారం- యామినికే కలిసొచ్చిన కనకం ప్లాన్- బెడిసికొట్టిన స్కెచ్- అరక్షణం చాలంటూ కావ్య

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, యామిని పెళ్లిలో మరో అపచారం చోటు చేసుకుంటుంది. యామిని హారతి ఇస్తుంటే ఆరిపోతుంది. దానికి పరిహారంగా మళ్లీ నిశ్చితార్థం పెట్టి అందులో మంచి ముహుర్తం పెళ్లికి పెడతానని పంతులు రివర్స్ అవుతాడు. కనకం వేసిన ప్లాన్ యామినికే కలిసివచ్చినట్లు అవుతుంది.

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

బ్రహ్మముడి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో పంతులును ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తారు ఇందిరాదేవి, అపర్ణ, కనకం. ఇందిరాదేవిని శాస్త్రి పంతులు బెదిరించినట్లు ఆ విషయాన్ని అతని భార్య కనకాంబరంకు చెబుతామని బెదిరించడంతో యామిని పెళ్లి ఆగిపోయేలా ప్లాన్ చెబుతాడు పంతులు.

దోషానికి పరిహారంగా

అమ్మవారి పూజకు సిద్ధం చేసిన పంతులు యామినిని పూజలో కూర్చోమని చెబుతాడు. దాంతో యామినిని వైదేహి తీసుకొస్తుంది. యామిని వచ్చి పూజలో కూర్చుంటుంది. రాట్నం విరిగిపోయినందుకు దోషానికి పరిహారంగా ఈ పూజ జరుగుతుంటుంది. పూజలో కూర్చున్న యామిని కావ్యవైపు తాను అనుకుంది సాధించినట్లుగా గర్వంగా చూస్తుంది.

యామినితో అమ్మవారి పూజ జరపిస్తాడు పంతులు. తాను చదివిన మంత్రాలు చెప్పమని యామినితో చెప్పిస్తాడు పంతులు. అదంతా చూసిన కనకం దీనికి దోషం పోవాలని ఇంకా మంత్రాలు చదివిపిస్తున్నాడా, మనం ఏం చెప్పాం ఏం చేస్తున్నాడు అని కనకం కోపడుతుంది. ఆవేశపడకు కనకం. పంతులు టైమ్ చూసుకుని ప్లాన్ అమలు చేస్తాడులే అని ఇందిరాదేవి సర్ది చెబుతుంది.

హారతి ఆరిపోయేలా

పూజ చివరికి వచ్చేసరికి అమ్మవారికి హారతి ఇవ్వమని యామినికి చెబుతాడు పంతులు. అప్పుడే ఇదే ప్లాన్ అని హారతి ఆరిపోయేలా చేయమని కనకం వాళ్లకు కన్ను కొడతాడు పంతులు. అది చూసి క్యాచ్ చేసిన కనకం హారతి ఆరిపోయేందుకు ప్లాన్ చేస్తుంది. వెనుక పక్కకు వెళ్లి హారతి ఇచ్చే వైపుకు కూలర్ గాలి వచ్చేలా పెడుతుంది. ఇక అమ్మవారికి యామిని హారతి ఇస్తుంటే కూలర్ గాలికి అకస్మాత్తుగా ఆరిపోతుంది.

హారతి ఆరిపోవడంతో యామిని షాక్ అవుతుంది. అది చూసిన అంతా అవాక్కవుతారు. ఎంత అపచారం, అరిష్టం అని అపర్ణ గ్యాంగ్ విమర్శించడం మొదలుపెడుతుంది. వీరికి సపోర్ట్‌గా కల్యాణ్ మాట్లాడిన జూనియర్ ఆర్టిస్టులు అవును, ఇలా ఎప్పుడు జరగలేదు, పెళ్లి ఆపేయడం మంచిది అని ముగ్గురు ఒకేసారి అంటారు. దాంతో యామిని తెగ షాక్ అవుతుంది.

పరిహారం గురించి

దీనికే పెళ్లి ఆపేయాల అని వైదేహి అంటుంది. అప్పుడేమో కర్ర విరిగిపోయింది, ఇప్పుడేమో దీపం ఆరిపోయింది. ఏమిటో అంతా విడ్డూరంగా లేదు. ఈ పెళ్లి జరగడం పంచభూతాలకు ఏమాత్రం ఇష్టంలేనట్లుగా అనిపిస్తుందని అపర్ణ అంటుంది. ఏంటీ పంతులు ఇలా జరుగుతున్నాయి. మీరు పెట్టిన ముహుర్తం సరైనదేనా అని పంతులును యామిని అడుగుతుంది.

దాంతో తన ముహుర్తానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని తాను చెప్పిన ప్లాన్ మర్చిపోయి పరిహారం గురించి చెబుతాడు పంతులు. ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది అని పంతులు అంటాడు. దాంతో అపర్ణ, కనకం, ఇందిరాదేవి తెగ షాక్ అవుతారు. మీరు జరిపించిన నిశ్చితార్థం ముహుర్తంలోనే సమస్య ఉంది. అందుకే వధువరులిద్దరికి ఈరోజు ఒక మంచి ముహుర్తం చూసి నిశ్చితార్థం మళ్లీ జరిపించి అక్కడ పెళ్లికి మళ్లి తిరిగి ముహుర్తం పెడతా అని పంతులు అంటాడు.

బెడిసికొట్టిన ప్లాన్

దాంతో కావ్య, ఇందిరాదేవి గ్యాంగ్ షాక్ అవుతారు. అసలు నిశ్చితార్థమే చేసుకోని యామినికి తమ ప్లాన్ ఇలా కలిసి వచ్చిందేంటీ, తమ ప్లాన్ ఇలా తమకే బెడిసికొట్టిందేంటీ అని అనుకుంటారు ఇందిరాదేవి, కనకం, అపర్ణ. ఇక రాజ్‌తో తనకు నిశ్చితార్థం జరగనుందని, ఆ తర్వాత పెళ్లి అని తెగ సంబరపడిపోతుంది యామిని. అసలు ఎంగేజ్‌మెంటే కానీ తనకు రాజ్‌తో నిశ్చితార్థం జరగడం గెలిచినట్లుగా భావిస్తుంది యామిని.

ఇదే విషయాన్ని కావ్యకు చెప్పి బాధపెట్టాలని చూస్తుంది యామిని. ఇలా దీపాలు ఆర్పడం, కర్రలు విరగొట్టడం ఇంతేనా నీ ఆలోచన. కానీ, ఏమైంది అవన్నీ నాకే కలిసొచ్చాయి, బావను ఎంచక్కా ఎలాంటి ఆటంకం లేకుండా పెళ్లి చేసుకోబోతున్నాను. ఎంగేజ్‌మెంట్ నుంచే మా బంధం ఏర్పడనుందని యామిని అంటుంది.

అరక్షణం ముందు

ఇలాంటి చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. నీ మెడలో మూడు ముళ్లు పడటానికి అరక్షణం ముందు ఆయన మనసులోకి నేను వస్తే చాలు ఈ పెళ్లి ఆగిపోవచ్చు అని కావ్య అంటుంది. దాంతో యామిని షాక్ అవుతుంది. ఇంత అవుతున్నా కావ్య నమ్మకం చూసి యామిని భయపడిపోతుంది. అక్కడితో బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024