





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. యథార్థ ఘటనల ఆధారంగా చిత్రం.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
గ్రౌండ్ జీరో చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాదులను మట్టుబెట్టడం చుట్టూ యథార్థ ఘటనలతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ స్ట్రీమింగ్కు ఎప్పుడు రానుందంటే..
బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్ర పోషించిన గ్రౌండ్ జీరో చిత్రం ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు తేజస్ ప్రభ విజయ్ దేవ్స్కర్ దర్శకత్వం వహించారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధార్ దూబే నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ గ్రౌండ్ జీరో చిత్రం ఇప్పుడు ఓటీటీలోరెగ్యులర్ స్ట్రీమింగ్కు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
స్ట్రీమింగ్ వివరాలివే
గ్రౌండ్ జీరో సినిమా జూన్ 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్కు రానుంది. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాలకు ఈ చిత్రం ఓటీటీలోకి సాధారణ స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. ఈ చిత్రం ఇటీవలే రెంటల్ విధానంలో ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. అయితే, జూన్ 20న రెంట్ తొలగి రెగ్యులర్ స్ట్రీమింగ్కు రానుంది. దీంతో ప్రైమ్ వీడియో సబ్స్క్రైబర్లు అప్పటి నుంచి ఈ చిత్రాన్ని రెంట్ లేకుండా చూడొచ్చు.
ఉగ్రవాదులను మట్టుబెట్టే మిషన్ చుట్టూ
గ్రౌండ్ జీరో మూవీలో బీఎస్ఎఫ్ ఆఫీసర్ నరేంద్ర నాథ్ ధార్ దూబే పాత్రను ఇమ్రాన్ హష్మి పోషించారు. 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన దాడి వెనుక మాస్టర్ మైండ్ అయిన జైష్-ఈ-మహమ్మద్ ఉగ్రవాది ఘాజీ బాబాను మట్టుబెట్టేందుకు చేసిన మిషన్ చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. యథార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఈ మూవీని గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు డైెరెక్టర్ తేజస్ ప్రభ.
గ్రౌండ్ జీరో మూవీలో ఇమ్రాన్ హష్మితో పాటు సాయి తంహన్కర్, జోయా హుసేన్, ముకేశ్ తివారీ, దీపక్ పరమేశ్, లలిత్ ప్రభాకర్, రాకీ రైనా, రాహుల్ వోహ్రా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి జాన్ స్టీవర్ట్ ఇడూరి, తనిష్క్ బాగ్చీ, రోహన్, సన్నీ ఇందర్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.
కమర్షియల్‌గా ప్లాఫ్
గ్రౌండ్ జీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. మొదటి నుంచి మిక్స్డ్ టాక్ రావడంతో కలెక్షన్లలో జోరు చూపలేకపోయింది. ఈ మూవీ సుమారు రూ.50కోట్ల బడ్జెట్‌తో రూపొందింది. సుమారు రూ.10కోట్ల కలెక్షన్లను మాత్రం దక్కించుకోగలిగింది. కమర్షియల్‌గా ప్లాఫ్ అయింది.
ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్, తలిస్మాన్ ఫిల్మ్స్, డ్రీమ్ క్రాఫ్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు గ్రౌండ్ జీరో సినిమాను ప్రొడ్యూజ్ చేశాయి. ఈ చిత్రానికి కమల్జీత్ నేగి సినిమాటోగ్రఫీ చేయగా.. చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం