నా అక్కచెల్లెళ్లు, నా కూతురు హిందువులనే పెళ్లి చేసుకున్నారు: లవ్ జిహాద్ ఆరోపణలపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్

Best Web Hosting Provider In India 2024

నా అక్కచెల్లెళ్లు, నా కూతురు హిందువులనే పెళ్లి చేసుకున్నారు: లవ్ జిహాద్ ఆరోపణలపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్

Hari Prasad S HT Telugu

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన మూవీ పీకేపై వచ్చిన లవ్ జిహాద్ ఆరోపణలపై ఇప్పుడు స్పందించాడు. తన అక్కచెల్లెళ్లు, తన కూతురు కూడా హిందువులనే పెళ్లి చేసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా అతడు గుర్తు చేశాడు.

నా అక్కచెల్లెళ్లు, నా కూతురు హిందువులనే పెళ్లి చేసుకున్నారు: లవ్ జిహాద్ ఆరోపణలపై బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ తన 2014లో వచ్చిన మూవీ ‘పీకే’ విడుదల సమయంలో చెలరేగిన ‘లవ్ జిహాద్’ ఆరోపణలపై ఎట్టకేలకు స్పందించాడు. ‘ఆప్ కీ అదాలత్’లో జరిగిన ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ఆమిర్ మాట్లాడుతూ.. ఆ సినిమా ద్వారా ఏ మతాన్ని అపహాస్యం చేసే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. ఈ సందర్భంగా తన అక్కచెల్లెళ్లు, కూతురు హిందువులను పెళ్లి చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ.. అన్ని మతాంతర వివాహాలను ‘లవ్ జిహాద్’ అని పిలవలేమని స్పష్టం చేశాడు.

ఆమిర్ ఏమన్నాడంటే..

2014లో వచ్చిన పీకే మూవీ అప్పట్లో ఓ సంచలనం. దేవుడి పేరుతో మోసం చేసే వ్యక్తులను ఓ ఏలియన్ గా భూమి మీదికి వచ్చిన వ్యక్తి ఎలా బయటపెట్టాడన్నదే ఈ మూవీ స్టోరీ. అయితే ఇందులో హిందూ దేవుళ్లను, ధర్మాన్ని కించపరిచేలా సీన్లు ఉన్నాయని, ఇదో లవ్ జిహాద్ అన్న విమర్శలు వచ్చాయి. దీనిపై తాజాగా ఆమిర్ ఖాన్ స్పందించాడు.

“మేము ఏ మతానికి వ్యతిరేకం కాదు. మేము అన్ని మతాలను, మతపరమైన వ్యక్తులను గౌరవిస్తాము. ఆ సినిమా మతం పేరుతో సామాన్యులను మోసం చేసేవారి గురించి, వారి నుండి డబ్బును దోచుకునే వారి గురించి హెచ్చరిస్తుంది. అలాంటి వ్యక్తులు మీకు ప్రతి మతంలోనూ కనిపిస్తారు. ఆ సినిమా ఏకైక ఉద్దేశం అదే. కాబట్టి అలాంటి వారి నుండి దూరంగా ఉండండి” అని ఆమిర్ అన్నాడు.

అన్నీ లవ్ జిహాద్ కాదు..

‘లవ్ జిహాద్’ ఆరోపణలపై కూడా ఆమిర్ ఖాన్ స్పందించాడు. “ముందుగా నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే. రెండు మతాలకు చెందిన వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, అది ప్రతిసారీ ‘లవ్ జిహాద్’ కాదు. వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఆ కలయిక కేవలం మానవత్వం. అది మతానికి అతీతమైనది” అని ఆమిర్ అన్నాడు.

ఈ సందర్భంగా ఆమిర్ తన కుటుంబంలో జరిగిన పెళ్లిళ్ల గురించి కూడా చెప్పుకొచ్చాడు. తన సోదరి నిఖత్.. సంతోష్ హెగ్డేను వివాహం చేసుకుందని.. తన చెల్లెలు ఫర్హాత్ కూడా రాజీవ్ దత్తాను వివాహం చేసుకుందని చెప్పాడు. ఇక అతని కుమార్తె ఇరా.. నుపుర్ శిఖారేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇటు ఆమిర్ మాత్రం రెండుసార్లు హిందువులనే పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడు. మొదట రీనా దత్తా, ఆ తర్వాత కిరణ్ రావ్ లను అతడు పెళ్లాడిన విషయం తెలిసిందే. వీళ్ల ద్వారా అతనికి ముగ్గురు సంతానం ఉన్నారు. ఆమిర్ ఖాన్ చాలా రోజుల తర్వాత ‘సితారే జమీన్ పర్’ విడుదల కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024