


Best Web Hosting Provider In India 2024

డిజిటల్ డిటాక్స్: సోషల్ మీడియాకు మీరూ బానిస అయిపోయారా? జనజీవనంలోకి రావాలని ఉందా?
ఈ 8 రోజుల డిజిటల్ డిటాక్స్ చాలా మంది జీవితాలను మార్చివేసింది. మీరు కూడా దీన్ని ఎలా చేయగలరో ఇక్కడ చూడండి. డిజిటల్ డిటాక్స్ అంటే టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం కాదు, అది మన జీవితాలను నియంత్రించకుండా చూసుకోవడమే అని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
ఈ 8 రోజుల డిజిటల్ డిటాక్స్ చాలా మంది జీవితాలను మార్చివేసింది. మీరు కూడా దీన్ని ఎలా చేయగలరో ఇక్కడ చూడండి. ఈరోజుల్లో నోటిఫికేషన్లు, రీల్స్, బ్రేకింగ్ న్యూస్, రిప్లైలు… ఇలా నిరంతరం మన మెదడును ఉత్తేజపరిచే వాతావరణంలో బతుకుతున్నాం. మన మనసుకి ఒక్క క్షణం కూడా విశ్రాంతి దొరకడం లేదు. ఈ క్రమంలో సోషల్ మీడియా అనేది ఒకప్పుడు కేవలం ఒక పరికరం మాత్రమే. కానీ ఇప్పుడు అది మనకు తెలియకుండానే ఒక అలవాటుగా, ఒక రిఫ్లెక్స్‌గా మారిపోయింది.
ప్రతిసారి ఫోన్ స్క్రోల్ చేసినప్పుడు మన మెదడులోని డోపమైన్ అనే రివార్డ్ కెమికల్ యాక్టివేట్ అవుతుంది. మనం నిజంగా ఏమీ సాధించకపోయినా, ఏదో సాధించినట్టు అనిపిస్తుంది. కాలక్రమేణా, ఈ అలవాటు మన మెదడును ప్రశాంతతకు బదులుగా నిరంతరం ఉత్సాహాన్ని కోరుకునేలా చేస్తుంది. అయితే, డిజిటల్ డిటాక్స్ అంటే టెక్నాలజీని పూర్తిగా వదిలేయడం కాదు.. అది మన జీవితాలను నియంత్రించకుండా చూసుకోవడమే అని నిపుణులు నొక్కి చెబుతున్నారు.
మనకు డిజిటల్ రీసెట్ ఎందుకు అవసరం?
హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంటిగ్రేటివ్ లైఫ్‌స్టైల్ ఎక్స్‌పర్ట్ ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ, “నిరంతరం సమాచార ప్రవాహం వల్ల మన శక్తి, స్పష్టత, ఆత్మవిశ్వాసం తగ్గిపోతాయి. మనకు తెలియకుండానే మనం ఇతరులతో పోల్చుకోవడం, నిరంతరం స్పందించడం ప్రారంభిస్తాం” అని వివరించారు.
8 రోజుల సోషల్ మీడియా డిటాక్స్ గురించి మాట్లాడుతూ, దాని వల్ల కలిగే ప్రయోజనాలు తక్షణమే, స్పష్టంగా కనిపిస్తాయని ఆయన వెల్లడించారు.
- గతంలో కన్నా గాఢమైన, నిరాటంకమైన నిద్ర
- మెరుగైన దృష్టి, పదునైన నిర్ణయాలు
- సంభాషణలు, సమావేశాలలో మరింత ఏకాగ్రత
- మెరుగైన వీకెండ్లు, భావోద్వేగ నియంత్రణ
- హాబీలు, పుస్తకాలు, ప్రకృతి, నిజమైన వ్యక్తులతో కొత్త అనుబంధం
ఈ ప్రయోజనాలు టీనేజర్‌లలో, పెద్దవారిలో, తల్లిదండ్రులలో, ఉద్యోగులలో కనిపించాయని ల్యూక్ కౌటిన్హో చెప్పారు. బహుశా, చాలా మందికి FOMO (Fear of Missing Out – ఏదో కోల్పోతున్నామనే భయం) నుండి విముక్తి లభించిందని ఆయన చెప్పారు. సోషల్ మీడియా తరచుగా ఈ భయాన్ని సృష్టిస్తుందే తప్ప, దాన్ని శాంతపరచదని వారు గ్రహించారు. “నిరంతరం కనెక్ట్ అయి ఉండటం వల్ల ప్రశాంతత రాదు. ఎప్పుడు వెనక్కి తగ్గాలి, ఎందుకు తగ్గాలి అని తెలుసుకోవడం వల్లనే వస్తుంది” అని ఆయన అన్నారు.
స్పృహతో కూడిన డిజిటల్ డిటాక్స్ అంటే ఏమిటి?
ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ “డిజిటల్ డిటాక్స్ అంటే పూర్తిగా కనుమరుగైపోవడం కాదు. ఇది సాంకేతికతను వదులుకోవడం కాదు. దాన్ని మీ నియంత్రణలో ఉపయోగించుకోవడమే. డిటాక్స్ సమయంలో పని లేదా కుటుంబం కోసం వాట్సాప్, నేర్చుకోవడానికి గూగుల్, క్లయింట్లు లేదా రోగులకు యాక్సెస్ వంటి ముఖ్యమైన వాటిని అనుమతించాం. అయితే మేం తీసివేసినవి కూడా అంతే ముఖ్యం. అనవసరంగా స్క్రోలింగ్ చేయడం, పోలిక ఉచ్చుల్లో పడటం, అంతులేని ఫార్వర్డ్‌లు, నిష్క్రియ వినియోగం.. వీటన్నింటినీ తీసేశాం” అని ఆయన వివరించారు.
“ఫలితాలు ఎలా ఉన్నాయంటారా? గాఢమైన నిద్ర. స్క్రీన్-ఆధారితం కాని వారాంతపు ప్రణాళికలు. నడక, పుస్తక పఠనం, సంభాషణలు, ఇంకా ఏకాగ్రత. పెద్దవారు, టీనేజర్లు, నిపుణులు.. అందరూ కలిసి దీన్ని చేశారు. ఇప్పుడు చాలా మంది రెగ్యులర్‌గా వారాంతపు విరామాలను కొనసాగిస్తున్నారు..’ అని వివరించారు.
“మనలో చాలా మంది ఆటోపైలట్‌లో పనిచేస్తుంటారు. తెలియకుండానే ఫోన్‌ల కోసం వెళ్తుంటారు. కానీ ప్రతిసారి మీరు అలా చేసినప్పుడు ఒక నిమిషం ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడ నా ఉద్దేశ్యం ఏమిటి? నేను నిజంగా ఏమి వెతుకుతున్నాను? ఈ చిన్నపాటి మైండ్‌ఫుల్‌నెస్ చర్య రాత్రికి రాత్రే మీ జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చకపోవచ్చు. కానీ మనం ఎంత తరచుగా, అలాగే ఎందుకు ఫోన్ చూస్తున్నామో అనే దానిపై చాలా అవసరమైన అవగాహనను తెస్తుంది” అని ల్యూక్ కౌటిన్హో వివరించారు.
ఫీడ్ ఆడిట్ చేయడం
మరొక శక్తివంతమైన అభ్యాసం మీ ఫీడ్‌ను ఆడిట్ చేయడం. ల్యూక్ కౌటిన్హో మాట్లాడుతూ “కొన్ని పేజీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు లేదా న్యూస్ ఛానెల్‌లు ఆందోళన, ఆత్మవిశ్వాసం లేకపోవడం లేదా పోలికను ప్రేరేపిస్తుంటే వాటిని అన్‌ఫాలో చేయండి. మీ డిజిటల్ స్పేస్ సురక్షితంగా, స్ఫూర్తిదాయకంగా అనిపించాలి. భయంతో కూడుకున్నదిగా లేదా ఓవర్‌గా అనిపించకూడదు. సోషల్ మీడియా అల్గారిథమ్‌లు మనం నిమగ్నమైన వాటినే ఇంకా ఇంకా విస్తరిస్తూ చూపుతాయి. చాలా ప్లాట్‌ఫారమ్‌లు ఉత్పత్తులు లేదా ఆలోచనలను విక్రయించడానికి భయం ఆధారిత కంటెంట్‌పై ఆధారపడతాయి. అందుకే స్పృహతో ఎంచుకోవడం ద్వారా, ఆలోచనాత్మకంగా ఉపయోగించడం ద్వారా అనుభవాన్ని నియంత్రించుకోవడం మనపైనే ఉంది.” అని సూచించారు.
నేర్చుకోవాల్సిన పాఠాలు, భవిష్యత్తు ప్రణాళిక:
ఆన్‌లైన్‌లో తక్కువ సమయం గడుపతున్నామంటే నిజంగా జీవించడానికి ఎక్కువ సమయం మిగిల్చుకుంటున్నామని అర్థం. “ఇది టెక్నాలజీ నుండి పారిపోవడం కాదు. స్పష్టతతో దానితో సంబంధం పెట్టుకోవడం. దూరం చేసుకోవడం కాదు. మైండ్‌ఫుల్‌గా ఉండటం..” అని వివరించారు.
“ఇది ఒక ట్రెండ్ కాదు. ఇది ఒక సాధనం. వ్యక్తులు, కుటుంబాలు, కంపెనీలు కూడా దీన్ని ఆ విధంగా ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం ఇది. మనం టెక్నాలజీకి భయపడాల్సిన అవసరం లేదు. అది మనల్ని నియంత్రించడం ఆగిపోయేలా చూడాలి. ఈ వారాంతంలో ఒక రోజు డిజిటల్ డిటాక్స్ ప్రయత్నించండి. లేదా మీరు నిద్రలేచిన తర్వాత మొదటి 60 నిమిషాలు స్క్రీన్‌లకు దూరంగా ఉండటానికి కట్టుబడి ఉండండి. ఎందుకంటే నిజమైన స్పష్టత నోటిఫికేషన్‌లను తనిఖీ చేయడం ద్వారా రాదు. అది మిమ్మల్ని మీరు తనిఖీ చేసుకోవడం ద్వారా వస్తుంది. నెమ్మదిగా ప్రారంభించండి..’ అని సూచించారు.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యలపై మీకు ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి.)