40 నిమిషాల క్లైమాక్స్.. 120 రోజుల షూటింగ్.. 300 రోజుల వీఎఫ్ఎక్స్ వర్క్.. రాజాసాబ్ రిలీజ్ ఆలస్యంపై ప్రొడ్యూసర్

Best Web Hosting Provider In India 2024

40 నిమిషాల క్లైమాక్స్.. 120 రోజుల షూటింగ్.. 300 రోజుల వీఎఫ్ఎక్స్ వర్క్.. రాజాసాబ్ రిలీజ్ ఆలస్యంపై ప్రొడ్యూసర్

ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ 2025 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. విస్తృతంగా షూటింగ్, వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా జాప్యం జరిగింది. ఈ విషయాన్ని రాజాసాబ్ ప్రొడ్యూసర్లు పేర్కొన్నారు.

టీజర్ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పోస్టర్ చూపిస్తున్న డైరెక్టర్ మారుతి

హర్రర్ కామెడీ జానర్ లో ప్రభాస్ వింటేజ్ టర్న్ గా తెరకెక్కిన రాజాసాబ్ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఒకటి. అయితే ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు డిసెంబర్ 5న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ ఆలస్యానికి కారణాన్ని సినిమా ప్రొడ్యూసర్లు వెల్లడించారు. సోమవారం (జూన్ 16) ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

40 నిమిషాల క్లైమాక్స్

భారీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా రాజాసాబ్ థియేట్రికల్ రిలీజ్ లేటు అయిందని ప్రొడ్యూసర్లు చెప్పారు. ప్రమోషన్స్ ను పురస్కరించుకుని సోమవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా రాజాసాబ్ టీజర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మీడియాతో ముచ్చటిస్తూ ప్రెస్ మీట్ లో సినిమా గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ సినిమా స్థాయి గురించి మాట్లాడుతూ “మారుతి (దర్శకుడు) ఆ షెడ్యూల్ ను ఎలా మేనేజ్ చేయగలడో నాకు తెలియదు. ఉదయం 6 గంటలకు షూటింగ్ ప్రారంభించి రాత్రి 10 లేదా 11 గంటల వరకు కొనసాగేవి. అలా 120 రోజుల పాటు సాగింది. ఇది కేవలం ఒక షెడ్యూల్ మాత్రమే. ఎందుకంటే ఆ 120 రోజుల నుంచి వచ్చే 40 నిమిషాల క్లైమాక్స్ ను మీరు చూస్తారు” అని అన్నారు.

వీఎఫ్ఎక్స్ కోసమే

‘‘క్లైమాక్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దడానికి వీఎఫ్ఎక్స్ కు 300 రోజులు పట్టింది. కానీ ఇది మనం ఇంతకు ముందెన్నడూ చూడని విషయం. క్లైమాక్స్ షెడ్యూల్, దానిపై ఉన్న వీఎఫ్ఎక్స్ కూడా విడుదల ఆలస్యానికి కారణమయ్యాయ’’ని విశ్వప్రసాద్ తెలిపారు. ”షూటింగ్ కు 120 రోజులు, వీఎఫ్ ఎక్స్ కు 300 రోజులు పట్టింది. వీఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. దీంతో జాప్యం జరిగింది. అందరూ నిరాశ చెందారని నాకు తెలుసు. కానీ సరైన నాణ్యతను ఉత్తమ పద్ధతిలో అందించడం చాలా ముఖ్యం’ అని ఆయన వివరించారు.

18 గంటల పని

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పని గంటల టాపిక్ చర్చనీయాంశంగా మారింది. ‘’భారత్ లో డిస్నీ తరహా సినిమా, హాలీవుడ్ తరహా సినిమాలు తీయొచ్చు. దాన్ని నేను నిరూపించాలనుకుంటున్నా. దర్శకుడు మారుతి కూడా ఈ సినిమా కోసం ప్రతిరోజూ 16-18 గంటలు పనిచేశాడు’’ అని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు.

అయితే రాజాసాబ్ కోసం 18 గంటలు పనిచేశామని డైరెక్టర్ మారుతి కూడా అంగీకరించారు. ”ఒకటిలో కొందరు నటులతో, మరోదానిలో కొందరితో రెండు షిఫ్టులు చేశాను. కానీ, నేను రోజుకు 18 గంటల వరకు పనిచేశాను. ఈ వ్యక్తుల మాదిరిగానే (డిఓపి, నిర్మాతను చూపిస్తూ). ఈ స్థాయి సినిమాను సకాలంలో పూర్తి చేయాలంటే అది చాలా ముఖ్యం” అన్నారు.

హారర్ ఫాంటసీ

టీజర్ లాంచ్ సందర్భంగా సహనిర్మాత ఎస్.కె.ఎన్ మాట్లాడుతూ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, బాక్సాఫీస్ వద్ద చరిత్రను పునరావృతం చేస్తుందని అన్నారు. ”2023 డిసెంబర్ మొదటి వారంలో యానిమల్ వచ్చింది. 2024లో పుష్ప పార్ట్ 2 వచ్చింది. 2025 డిసెంబర్ మొదటి వారంలో రాజాసాబ్ ఉంటుంది” అన్నారు. 2025 డిసెంబర్ లో రాజాసాబ్ థియేటర్లలో విడుదల కానుంది. ఇది భారతదేశపు అతిపెద్ద హారర్ ఫాంటసీగా చెప్పబడుతోంది.

ప్రభాస్ సరసన సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, బొమన్ ఇరానీ నటించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024