పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 4 కోసం ఎదురు చూస్తున్నారా.. అంతకు ముందే టీవీఎఫ్ రూపొందించిన ఈ టాప్ 5 వెబ్ సిరీస్ చూసేయండి

Best Web Hosting Provider In India 2024

పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 4 కోసం ఎదురు చూస్తున్నారా.. అంతకు ముందే టీవీఎఫ్ రూపొందించిన ఈ టాప్ 5 వెబ్ సిరీస్ చూసేయండి

Hari Prasad S HT Telugu

సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ పంచాయత్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ తో రాబోతోంది. వచ్చే వారమే ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ కానుంది. అయితే అంతకంటే ముందే ఈ సిరీస్ ను నిర్మించిన ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) రూపొందించిన ఇతర సూపర్ హిట్ వెబ్ సిరీస్ చూసేయండి.

పంచాయత్ వెబ్ సిరీస్ సీజన్ 4 కోసం ఎదురు చూస్తున్నారా.. అంతకు ముందే టీవీఎఫ్ రూపొందించిన ఈ టాప్ 5 వెబ్ సిరీస్ చూసేయండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అత్యుత్తమ ఐఎండీబీ రేటింగ్ కలిగిన వెబ్ సిరీస్ పంచాయత్. ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ జూన్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ను నిర్మించిన ది వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) గతంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కొన్ని అద్భుతమైన వెబ్ సిరీస్ చూసేయండి.

పంచాయత్ వెబ్ సిరీస్ గురించి..

2019లో తొలిసారి పంచాయత్ తొలి సీజన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పంచాయత్ సెక్రటరీ ఫులేరా అనే గ్రామంలో పడే ఇబ్బందులు, ఆ తర్వాత అక్కడి వాళ్లతో కలిసిపోయే తీరు, అక్కడి రాజకీయాలను నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేసేలా ఈ సిరీస్ తెరకెక్కించారు.

ఇందులో అభిషేక్ త్రిపాఠిగా జితేంద్ర కుమార్, మంజు దేవిగా నీనా గుప్తా, ప్రధాన్ జీగా రఘుబీర్ యాదవ్, ప్రహ్లాద్‌గా ఫైసల్ మాలిక్, వికాస్‌గా చందన్ రాయ్, బనరాకస్‌గా భూషణ్ కుమార్, క్రాంతి దేవుగా సునీత రాజ్వర్, రింకీగా సాన్వికా నటించారు. ఈ కొత్త సీజన్లో ఫులేరా గ్రామానికి కొత్త సర్పంచ్ రాబోతున్నారు. ఎన్నికల చుట్టే ఈ సీజన్ సాగనుంది. ఈ నేపథ్యంలో గతంలో టీవీఎఫ్ తెరకెక్కించిన సిరీస్ లేవో చూడండి.

టీవీఎఫ్ టాప్ 5 వెబ్ సిరీస్

పిచర్స్ – ZEE5

ది వైరల్ ఫీవర్ (TVF) నిర్మించిన ‘పిచర్స్’ (Pitchers) అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లలో ఒకటి. కథాంశం నుండి పాత్రల చిత్రణ వరకు, ఈ సిరీస్ ఎప్పుడు చూసినా ఆసక్తిగానే అనిపిస్తుంది. నవీన్ కస్తూరియా, జితేంద్ర కుమార్, అనూరభ్ కుమార్, అభయ్ మహాజన్ నటించిన ‘పిచర్స్’.. తమ ఉద్యోగాలను విడిచిపెట్టి సొంత కంపెనీని ప్రారంభించిన నలుగురు స్నేహితుల కథ. ఈ క్రమంలో వారు జీవితంలోని సంక్లిష్టతలను చూస్తారు. కష్టాలు, ఎత్తుపల్లాలు ఎదుర్కొంటారు. వాటన్నింటినీ అధిగమించి వాళ్లు ఎలా సక్సెస్ అయ్యారనేదే ఈ పిచర్స్ స్టోరీ. జీ5 ఓటీటీలో చూడొచ్చు.

ట్రిప్లింగ్ – ZEE5

‘ట్రిప్లింగ్’ అనేది మరో TVF సిరీస్. ఇది చందన్, చంచల్, చిత్వన్ అనే ముగ్గురు తోబుట్టువుల కథ. వారు తమ వ్యక్తిగత కష్టాలను అధిగమించి, తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, తమను తాము లోతుగా తెలుసుకోవడానికి కలిసి ప్రయాణం చేస్తారు. ఈ రోడ్ ట్రిప్ సిరీస్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ లో సుమీత్ వ్యాస్, మాన్వి గగ్రు, అమోల్ పరాశర్ లాంటి వాళ్లు నటించారు.

గుల్లక్ – SonyLIV

‘పంచాయత్’ అభిమానులు, ‘గుల్లక్’ను కచ్చితంగా ఇష్టపడతారు. ఈ సిరీస్ ఒక చిన్న పట్టణంలోని ఓ మధ్యతరగతి కుటుంబం రోజువారీ జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ కథను ఒక గుల్లక్ (పిగ్గీ బ్యాంక్) దృష్టికోణం నుంచి చెప్పే తీరు ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్‌లో జమీల్ ఖాన్ సంతోష్ మిశ్రాగా, గీతాంజలి కులకర్ణి శాంతి మిశ్రాగా, వారి పెద్ద కొడుకు అన్నుగా వైభవ్ రాజ్ గుప్తా, వారి చిన్న కొడుకు అమన్‌గా హర్ష్ మాయార్ నటించారు.

ఇన్‌మేట్స్ – ZEE5

TVF రూపొందించిన ఈ ‘ఇన్‌మేట్స్’.. ఐదుగురు యువకుల జీవితాల చుట్టూ తిరుగుతుంది. స్నేహం, బంధాలు, తమను తాము తెలుసుకోవడంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లను ఈ సిరీస్ లో చూపించారు. ఇందులోని ప్రతి పాత్ర ప్రత్యేకమైన కష్టాలు, విజయాలను చూస్తూ ముందుకు సాగుతుంది. ఇందులో ఆశిష్ వర్మ, ముక్తి మోహన్, ఆకాంక్ష ఠాకూర్, రాఘవ్ రాజ్ కక్కర్, కశ్యప్ కపూర్ లాంటి వాళ్లు నటించారు.

కాలేజ్ రొమాన్స్ – SonyLIV

‘కాలేజ్ రొమాన్స్’ ముగ్గురు మంచి స్నేహితుల చుట్టూ తిరిగే కథ. వాది కాలేజీ జీవితం, ప్రేమ, స్నేహాన్ని చూపిస్తూ ఈ సిరీస్ సాగుతుంది. ఈ షో వారి వ్యక్తిగత ప్రేమ ప్రయాణాలు, స్నేహాలు, కాలేజీ నుండి తర్వాత బాధ్యత గల జీవితానికి మారడంలో ఎదురయ్యే సవాళ్లను కళ్లకు కడుతుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024