



Best Web Hosting Provider In India 2024

బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు బెస్ట్ ఎక్సర్సైజ్ ఇదే
మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా లేనప్పుడు త్వరగా అలసిపోవడం, ఎక్కువ ఆకలి వేయడం, షుగర్ వ్యాధి లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. మనం తీసుకునే ఆహారం ముఖ్యమే అయినా, వ్యాయామం కూడా అంతే అవసరమని నిపుణులు అంటున్నారు.
అన్ని రకాల వ్యాయామాలు బ్లడ్ షుగర్‌ను ఒకేలా కంట్రోల్ చేయలేవు. ఫిట్నెస్ కోచ్ జోసెఫ్ మునోజ్ మే 14న తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేయడానికి, మెటబాలిక్ హెల్త్‌ను మెరుగుపరచడానికి బాగా పనిచేసే వ్యాయామం గురించి చెప్పారు. బరువులు ఎత్తడం (స్ట్రెంగ్త్ ట్రైనింగ్) ద్వారా కండరాలు పెంచుకుంటే, అది బ్లడ్ షుగర్‌ను ఎలా కంట్రోల్ చేస్తుంది, షుగర్ వ్యాధి రిస్క్‌ను ఎలా తగ్గిస్తుందో ఆయన వివరించారు.
కండరాలు, బ్లడ్ షుగర్ కంట్రోల్ మధ్య సంబంధం ఏంటి?
“శరీరంలో కండరాలు, కొవ్వు సమతుల్యంగా ఉంటే, బ్లడ్ షుగర్ కంట్రోల్ బాగా ఉంటుంది. కొవ్వు ఎక్కువై, కండరాలు తక్కువగా ఉంటే, బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి, చివరికి టైప్ 2 షుగర్ వ్యాధి వచ్చే రిస్క్ పెరుగుతుంది.” అని జోసెఫ్ చెప్పారు.
“కండరాలు శరీరంలో బ్లడ్ షుగర్‌ను నిల్వ చేసుకునే పెద్ద స్టోరేజ్ లాంటివి. ఇన్సులిన్ సెన్సిటివిటీని కంట్రోల్ చేయడంలో ఇవి చాలా కీలకం. బరువులు ఎత్తేవాళ్లలో చేతులు, కాళ్ళలో కండరాలు (అపెండిక్యులర్ లీన్ మాస్) బాగా పెరుగుతాయి. ఈ కండరాల పెరుగుదల వల్ల హిమోగ్లోబిన్ A1C లెవెల్స్ మెరుగుపడతాయి” అని జోసెఫ్ వివరించారు.
వయసు పెరిగే కొద్దీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎందుకు ముఖ్యం?
కండరాలను పెంచుకోవడం వల్ల, శరీరం రక్తంలో ఉన్న చక్కెరను మరింత సమర్థవంతంగా తీసుకొని, శక్తి కోసం కండరాల్లో నిల్వ చేసుకుంటుందని జోసెఫ్ వివరించారు. ఇది బ్లడ్ షుగర్‌ను స్థిరీకరించడానికి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిస్క్‌ను తగ్గించడానికి సాయపడుతుంది.
“అందుకే నేను ఎప్పుడూ ఒకటే చెబుతాను. మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే, వయసు పెరుగుతున్న కొద్దీ కండరాలు పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది కేవలం బాడీ అందంగా కనిపించడం కోసమే కాదు.. ఎక్కువ కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి, దీర్ఘకాలిక జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి కూడా చాలా ముఖ్యం” అని ఆయన వివరించారు.
(గమనిక: ఈ ఆర్టికల్ కేవలం సమాచారం కోసమే. ఇది డాక్టర్ సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి అనుమానాలు ఉంటే, తప్పకుండా మీ డాక్టర్‌ను సంప్రదించండి.)