





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారుతో కార్తీక్ కామెడీ..బావ పిలుపుతో జ్యో షాక్.. క్యారేజీ విసిరేసిన సుమిత్ర.. దీప కన్నీళ్లు
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 17 ఎపిసోడ్ లో పారిజాతంతో కార్తీక్ కామెడీ నవ్వులు తెప్పిస్తోంది. కార్తీక్ దీప బావ అని పిలవడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. దీప వండిన ఆహారాన్ని తినని సుమిత్ర.. క్యారేజీని నేలకేసి కొడుతుంది. దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
కార్తీక దీపం 2 ఈ రోజు ఎపిసోడ్ లో శివన్నారాయణ ఇంట్లో కార్తీక్, దీప వంట గదిలో ఉంటారు. ఏం మరదలా ఈ రోజు వంట ఏంటీ? అని దీపను అడుగుతాడు కార్తీక్. ముందు మా అమ్మ సంగతి చెప్పండి అని దీప అంటుంది. చెప్పాల్సిన పద్దతిలో చెప్పావు కదా, మళ్లీ నిన్ను ఇంట్లో నుంచి ఎవ్వరూ పొమ్మనరు కానీ కార్తీక్ అంటే.. మా అమ్మ బాధ పడుతుంది కదా అని దీప ఫీల్ అవుతుంది. ఈ బాధ తాత్కాలికమే అంటూ మన గోల్ ఏంటి అని చెప్తుండగా పారిజాతం ఎంట్రీ ఇస్తోంది.
మరదలు కోసం ఫిల్టర్ కాఫీ
మనం మనం ఒకటే కదా పారు అని కార్తీక్ మళ్లీ కామెడీ చేస్తాడు. మరదలు కోసం మంచి ఫిల్టర్ కాపీ కలపరా అని పారు అంటే.. మరదలు ఇక్కడే ఉంది కదా అని దీపను చూపిస్తాడు. మరదలు అంటే జ్యోత్స్న అని పారు చెప్తుంది. సారీ ఇంట్లో ఎవరితోనూ వరసలు కలపను అని కార్తీక్ అంటాడు. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన జ్యో చిటికె వేస్తూ గ్రానీ వచ్చిన పని చూసుకోకుండా కిచెన్లో మీటింగ్ ఏంటీ? అని పారుతో అంటుంది. హలో పెద్ద మేడం గారూ ఊరికే కోప్పడకండి, మా పారు వచ్చిన పనే చేస్తోందిని కార్తీక్ చెప్తాడు. పెద్ద మేడం గారికి కాఫీ అంటే ఆ రేంజ్ లో ఉండాలి కదా అని వెటకారం చేస్తాడు కార్తీక్. ఉండకపోతే కాఫీ కప్ వచ్చి కిచెన్ లో పడుతుందని జ్యోత్స్న అంటుంది.
చెప్పు తీసుకుని కొడతాను
వెంటనే కార్తీక్ చెప్పు తీసుకుని కొడతాను అనే సరికి అందరూ షాక్ అవుతారు. ఎవరిని రా చెప్పు తీసుకుని కొడతావు అని పారు అంటే నిన్ను కాదులే అని కార్తీక్ చెప్తాడు. అయితే నన్నా అని జ్యో కోపంగా చూస్తుంది. పాలు పోసినవాణ్ని, కాఫీ చిక్కగా లేదంటే పాలు చిక్కగా లేనట్లే కదా అని కార్తీక్ అంటాడు. నువ్వెంటి వీళ్లతో కలిసిపోయావు అని పారుపై జ్యో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కార్తీక్ ను జ్యో బావ అంటే.. బావ కాదు డ్రైవర్ కార్తీక్ బాబు అని చెప్తాడు. ఆల్ ఇండియా అడుక్కుతినే వాళ్ల సంఘానికి పారును ప్రెసిడెంట్ చేస్తానని కార్తీక్ కామెడీ చేస్తాడు.
బావ అంటే బావ
పనిమనిషి రెండు కాఫీలు తీసుకురా అని దీపకు ఆర్డర్ వేస్తుంది జ్యో. బావా నువ్వు కాఫీ తాగుతావా అని దీప అనగానే పారు, జ్యో షాక్ అవుతారు. దీప కార్తీక్ ను బావ అని పిలుస్తుందే అని పారు తెగ ఆశ్చర్యపోతుంది. దీప, కార్తీక్ సరసాలు చూసి జ్యో, పారు కుళ్లుకుంటారు. బావ, మరదలు అని పిలుచుకుంటున్నారంటే వీళ్లకు నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ కంగారు పడుతుంది జ్యో. ఈ పిలుపులు నాకైతే చెండాళంగా ఉందని జ్యో ఊగిపోతుంది. కార్తీక్ ను దీప బావ అని పిలవడానికి వీల్లేదని అరుస్తుంది. నా భర్త నా ఇష్టం అని దీప బదులిస్తుంది. నాకు మాత్రమే బావ అంటే నాకు మాత్రమే బావ అని దీప, జ్యో గొడవ పడతారు. మధ్యలో పారును లాగడంతో కామెడీ అదిరిపోయింది.
కార్తీక్ వార్నింగ్
నేను నా భార్యను బావ అని పిలవమన్నా, అలా పిలుస్తుంటే భలే ముద్దొస్తుంది అని జ్యోకు కార్తీక్ చెప్తాడు. మీ టైమ్ నడుస్తుందని ఎగిరి పడకండీ, ఏదీ తేలిగ్గా వదిలిపెట్టను అని జ్యో అంటే.. కార్తీక్ కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. జ్యో, పారు అక్కడి నుంచి వెళ్లిపోతారు. పనిమనిషిలా ఇంట్లో చేరి ఓనర్ అయింది, ఇల్లాలిగా చోటిచ్చిన పాపానికి ఇంటినే నాశనం చేసిందని పారు గురించి దీపకు చెప్తాడు కార్తీక్. ఇంటి వారసురాలిని అనాథను చేసింది, వీళ్లను వదిలి పెట్టకూడదని కార్తీక్ చెప్తాడు. మనం ఎవరి మీద పగ తీర్చుకోవడానికి రాలేదు, ఈ ఇంటిని బృందావనంగా మార్చుకోవడానికి మనం శ్రమించాలి అని దీప చెప్తుంది.
నిజం తెలిసిపోయిందా?
అందరితో నువ్వు భలే ఆడుకుంటున్నావ్ బావ అని దీప అంటుంది. వంట చేసేందుకు కార్తీక్, దీప రెడీ అవుతారు. అటు జ్యో సీరియస్ గా ఆలోచిస్తుంటుంది. దీప భర్తను బావ అని ఎందుకు అంటుంది? అని జ్యో అంటే.. నిన్ను ఏడిపించడానికే అని పారు చెప్తుంది. నాకు మరోలా అనిపిస్తుంది అని దీపకు, బావకు నిజం తెలిసిపోయిందేమోనని అని మనసులో అనుకుంటుంది జ్యో. పారు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా లంచ్ చేద్దామని జ్యో అంటుంది. నువ్వు వాళ్లతో కలిసిపోలేదా అని జ్యో అంటే.. అదంతా నటనే, వాళ్లతో నేను ఆడుకుంటా అని పారు బదులిస్తుంది.
ఫుడ్ క్యారేజీ
నేను చేసిన తప్పు ఏదైనా ఉంది అంటే అది ఆ దాసును సగం కొట్టి వదిలేయడం అని జ్యోత్స్న తనతో తానే అనుకుంటుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గర కార్తీక్, దీప సర్దుతుంటే.. ఉత్తమ పనోడు, పనిమనిషి అవార్డు మీదేనని పారు అంటుంది. మిగతా యజమానులు ఏరీ? పైగా నిరహారదీక్ష చేసేవాళ్లూ ఉన్నారు అని కార్తీక్ అంటుంటే.. అప్పుడే సుమిత్రను పట్టుకుని వచ్చిన జ్యో అంత అవసరం ఎవరికీ లేదు అని అంటుంది. మా మమ్మీ ఆత్మ గౌరవం ఎలా కాపాడాలో ఓ కూతురికి నాకు తెలుసు అని జ్యో సీరియస్ గా చెప్తుంది.
సుమిత్రకు దీప వడ్డిస్తుంటే జ్యో అడ్డుకుంటుంది. తమ రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పిస్తుంది. అమ్మకు రెస్టారెంట్ ఫుడ్ పడదు కదా అని దశరథ్ అంటే.. హైజినిక్ డ్యాడీ అని జ్యో చెప్తుంది. ఎంత హైజినిక్ అయినా అమ్మ కొన్ని పదార్థాలు తినకూడదని దశరథ్ అంటాడు. ఈ ఒక్క రోజుకు అడ్జస్ట్ కావాలి అని జ్యో అంటే.. దీప ఇన్ని వంటలు చేసింది కదా తినొచ్చు అని దశరథ్ అంటాడు. అంతకంటే పస్తులు ఉండటం నయం అని సుమిత్ర కోపంతో చెప్తుంది. ఏదో ఒకటి తినొచ్చు కదా దశరథ్ అని శివన్నారాయణ అంటాడు.
విషంతో సమానం
ఆ క్యారేజీలోని ఆహారాన్ని దీప వడ్డించబోగా.. దాన్ని నేలకోసి కోపంగా కొడుతుంది సుమిత్ర. నిన్ను వడ్డించమని నేను చెప్పానా? ఎందుకు ముట్టుకున్నావు? అని ఊగిపోతుంది సుమిత్ర. నా భార్య తరఫున మాట్లాడతాను అని కార్తీక్ మధ్యలో మాట్లాడతాడు. దీప చేత్తో తాకినవి కూడా తినను, తాగను అని సుమిత్ర అంటుంది. ఆ మనిషి అంతే మారదు బాధపెట్టడం తన నైజం, మోసం చేయడం తన గుణం, తన చూపే దోషం, తన నీడ శాపం, దీప చేత్తో ముట్టుకుంటే అది విషంతో సమానం అని సుమిత్ర అంటుంది. దీంతో దీప బాధపడుతుంది. వేరే ఫుడ్ తీసుకొస్తాను అని జ్యో అంటే నాకేం వద్దు అని సుమిత్ర లోపలికి తీసుకెళ్లమంటుంది.
వంటలక్క కన్నీళ్లు
నిన్నెవరూ ముట్టుకోమన్నారు అని పారు సీన్ క్రియేట్ చేస్తుంది. సుమిత్ర జాలి పడకపోతే నువ్వు హాస్పిటల్లో చనిపోయేదానివి అని పారు అంటుంది. ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? అంటే దీప ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది. అమ్మ తినలేదు అని దీప బాధపడుతుంది. సొల్యూషన్ ఆలోచిద్దాం అని కార్తీక్ అంటాడు. దశరథ్ తినకుండా చేయి కడిగేస్తాడు. ఛీచీ ఏం మనిషో ఏమో ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని శివన్నారయణ కూడా లేచి వెళ్లిపోతాడు. పారు మాత్రం అందరూ వెళ్లిపోయాక ఆబగా తినేస్తుంది.
ఇటు ఇంట్లో నీ చేత్తో ముట్టుకుంటే తినకపోవడం ఏమిటే అని దీపతో అనసూయ అంటుంది. వదిన ఈ మధ్యనే ఇలా తయారైంది అక్క, మా పిన్ని, జ్యోత్స్న కలిసి ఇలా తయారు చేశారని కాంచన చెప్తుంది. మా అమ్మ మొండిదైతే, నేను జగ మొండిని అని దీప అనే సరికి అనసూయ, కాంచన షాక్ అవుతారు. సుమిత్ర గారిని అమ్మ అంటున్నావ్ ఏంటీ అని అనసూయ అడుగుతుంది. పిలుపులు పూర్తిగా పిలవాలని, ఓనర్లను అమ్మగారు అని పిలవాలని కార్తీక్ కవర్ చేస్తుంటే కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్