మన్నారా చోప్రా తండ్రి మృతి.. ఎమోషనల్ అయిన ప్రియాంక చోప్రా.. మిస్ యూ ఫుఫాజీ అంటూ పోస్ట్

Best Web Hosting Provider In India 2024

మన్నారా చోప్రా తండ్రి మృతి.. ఎమోషనల్ అయిన ప్రియాంక చోప్రా.. మిస్ యూ ఫుఫాజీ అంటూ పోస్ట్

మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా మరణించారు. ఆయన మృతి పట్ల గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా ఎమోషనల్ అయ్యారు. ప్రియాంక చోప్రా మేనత్త భర్తనే ఈ రామన్ రాయ్. ప్రియాంకకు మామ అవుతారు.

మన్నారా చోప్రా తండ్రి మరణంతో ఎమోషనల్ అయిన ప్రియాంక చోప్రా

నటి ప్రియాంక చోప్రా, ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తమ మామ రామన్ రాయ్ హండా మృతికి సంతాపం తెలిపారు. రామన్ రాయ్ హండా.. మన్నారా చోప్రా తండ్రి. ప్రియాంక, సిద్ధార్థ్ తమ ఇన్స్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో తమ ‘ఫుఫాజీ (మామయ్య)’ని గుర్తు చేసుకుంటూ నోట్స్ రాశారు. ప్రియాంక చోప్రా, సోదరుడు సిద్ధార్థ్ తమ మామ రామన్ ను గుర్తు చేసుకున్నారు. ప్రియాంక.. “మీరు ఎల్లప్పుడూ మా హృదయాలలో ఉంటారు. రామన్ అంకుల్ (ఫుఫాజీ)కి శాంతి కలగాలి. ఓం శాంతి” అని పోస్టు చేశారు. సిద్ధార్థ్.. మన్నారా ఇంతకు ముందు పోస్టు చేసిన స్టోరీని తిరిగి షేర్ చేశాడు. “రామన్ అంకుల్ ను మిస్ అవుతాను (చేతులు జోడించిన ఎమోజి)” అని పేర్కొన్నాడు.

ప్రియాంక చోప్రా, సిద్దార్థ్ చోప్రా స్టోరీస్
ప్రియాంక చోప్రా, సిద్దార్థ్ చోప్రా స్టోరీస్

మన్నారా ప్రకటన

మన్నారా చోప్రా తండ్రి, న్యాయవాది రామన్ రాయ్ హండా సోమవారం ముంబైలో 71 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక అధికారిక ప్రకటనను పోస్ట్ చేసింది. “మా ప్రియమైన తండ్రి 16/06/2025న మమ్మల్ని విడిచిపెట్టి స్వర్గపు నివాసానికి వెళ్లారని తెలియజేయడానికి మేము చాలా బాధపడుతున్నాము. అతను మా కుటుంబానికి ఒక మూలస్తంభం” అని పోస్టు చేసింది. అంత్యక్రియలు జూన్ 18న మధ్యాహ్నం 1 గంటలకు అంబోలి, అంధేరి వెస్ట్, ముంబైలోని శ్మశాన వాటికలో జరుగుతాయి.

అనారోగ్యంతో

రామన్ రాయ్ హండా ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. అతనికి భార్య కామిని, కుమార్తెలు మన్నారా, మితాలి ఉన్నారు. వార్తా సంస్థ ఏఎన్ఐ ప్రకారం, రామన్ కొన్ని రోజులుగా తెలియని కారణాల వల్ల అనారోగ్యం పాలయ్యారు. ఇప్పుడు తుది శ్వాస విడిచారు. దీంతో చోప్రా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

తెలుగులో సినిమాలు

మన్నారా ‘జిద్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కానీ అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేదు. తరువాత, ఆమె దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. సల్మాన్ ఖాన్ యొక్క రియాలిటీ షో బిగ్ బాస్ 17, లాఫ్టర్ చెఫ్స్ – అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ సీజన్ 2లో కూడా పాల్గొంది. తెలుగులో జక్కన్న, తిక్క, రోగ్, సీత, తిరగబడరా సామి సినిమాల్లో చేసింది.

మరోవైపు రాజమౌళి, మహేష్ బాబు క్రేజీ సినిమాలో ప్రియాంక చోప్రా కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024