





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోనూ బ్లాక్బస్టర్ హిట్.. ఈ తెలుగు హారర్ కామెడీకి సూపర్ రెస్పాన్స్.. నాలుగు రోజుల్లోనే..
తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. సమంత నిర్మించిన ఈ సినిమాకు జియోహాట్స్టార్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గత వారమే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయిన విషయం తెలిసిందే.
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా శుభం. ఆడవాళ్లకు ఉండే సీరియల్స్ పిచ్చి ఆధారంగా రూపొందిన ఈ హారర్ కామెడీ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ప్రేక్షకులను తెగ నవ్విస్తోంది. జియోహాట్స్టార్ ఓటీటీలో జూన్ 13 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చిన విషయం తెలిసిందే.
శుభం ఓటీటీ స్ట్రీమింగ్
మే 9న థియేటర్లలో రిలీజైన మూవీ శుభం.. నెల రోజుల తర్వాత జూన్ 13 నుంచి జియోహాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే 150 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకున్నట్లు ఆ ఓటీటీ వర్గాలు వెల్లడించాయి. అసలు పెద్దగా స్టార్లు ఎవరూ లేకుండా, చిన్న బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ మామూలు విషయం కాదు.
థియేటర్లలోనూ బాక్సాఫీస్ దగ్గర మూవీ లాభాలను తెచ్చి పెట్టింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఊహించినట్లే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. చచ్చినా చూడాల్సిందే అంటూ సీరియల్స్ ముగియకుండానే చనిపోయే వాళ్లు ఆత్మలుగా వచ్చి టీవీల ముందు కూర్చోవడం అన్న భిన్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు.
శుభం ఓటీటీ హక్కులు
నిజానికి శుభం మూవీకి తొలి రోజు థియేటర్లలో అంత మంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆ సినిమా ఓటీటీ హక్కులపై దాని ప్రభావం కనిపించింది. మొదట జీ5 ఓటీటీ ఈ హక్కులను సొంతం చేసుకున్నా.. తర్వాత వెనక్కి తగ్గింది. ఆ తర్వాత జియోహాట్స్టార్ ఏకంగా రూ.3 కోట్లకు దక్కించుకుంది.
ఈ డీల్ వల్ల సమంతకు మంచి లాభాలే వచ్చాయి. ఆమె మొదలుపెట్టిన ట్రాలాలా సంస్థే ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. హారర్ కామెడీ జానర్లో శుభం సినిమాను డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగులు తెరకెక్కించినా.. చివర్లో దీనిద్వారా ఇచ్చిన సందేశం మాత్రం మహిళా ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటోంది.
భీమునిపట్నం ఊళ్లో జరిగే స్టోరీ ఇది. అక్కడి ఊళ్లోని ఆడవాళ్లందరూ రాత్రి 9 అయిందంటే చాలు వింతగా ప్రవర్తిస్తుంటారు. టీవీలకు అతుక్కుపోతుంటారు. ఆ సమయంలో వాళ్లకు అడ్డుగా వచ్చే భర్తలను కూడా చితగ్గొడుతుంటారు. అసలు వాళ్లకు ఏమైంది? దీనికి ఆ ఊళ్లోని మగవాళ్లు కనుగొనే పరిష్కారం ఏంటి అన్నదే శుభం మూవీ స్టోరీ. ఇందులో సమంత కూడా ఓ చిన్న పాత్ర చేసింది.
సంబంధిత కథనం