ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

ఎలెవెన్ చిత్రం ఓటీటీలో అదరగొడుతోంది. సినిమాల ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు దూసుకొచ్చింది. భారీ వ్యూస్ సాధిస్తూ సత్తాచాటుతోంది. ఈ మూవీ ఐదు భాషల్లో అందుబాటులో ఉంది.

ఎలెవెన్: ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ట్రెండింగ్‍లో ఫస్ట్ ప్లేస్‍కు.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్

తెలుగు హీరో నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన ఎలెవెన్ (లెవెన్) చిత్రం మే 16వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ఈ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కింది. మిస్టరీగా మారిన మర్డర్ల ఇన్వెస్టిగేషన్ చుట్టు ఈ సినిమా సాగుతుంది. థియేట్రికల్ రన్‍లో పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్లను మాత్రం పెద్దగా రాలేదు. ప్రస్తుతం ఓటీటీలో ఈ ఎలెవెన్ చిత్రం దుమ్మురేపుతోంది.

స్ట్రీమింగ్‍లో ఫస్ట్ ప్లేస్

ఎలెవెన్ చిత్రం తమిళ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సినిమాల విభాగంలో ప్రస్తుతం టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది. మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‍లో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. తెలుగు వెర్షన్ ప్రస్తుతం ఆరో ప్లేస్‍లో ఉంది. ఎలెవెన్ చిత్రం తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమ్ అవుతోంది.

ఎలెవెన్ సినిమా జూన్ 13న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చింది. ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఆరంభం నుంచి ఈ చిత్రానికి మంచి వ్యూస్ దక్కాయి. దీంతో నాలుగు రోజుల్లోనే సినిమాల ట్రెండింగ్‍లో ఇండియా వైడ్ టాప్ ప్లేస్‍కు వచ్చేసింది. ఈ విషయాన్ని ఈ మూవీ డైరెక్టర్ లోకేశ్ అజిల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫస్ట్ ప్లేస్‍లో ఈ మూవీ ట్రెండ్ అవుతోందని ఓ పోస్టర్ కూడా షేర్ చేశారు.

మర్డర్ మిస్టరీ చుట్టూ

ఎలెవెన్ మూవీని క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌లా గ్రిప్పింగ్ నరేషన్‍తో తెరకెక్కించారు దర్శకుడు లోకేశ్. వైజాగ్‍లో ఒకే రీతిలో వరుసగా జరుగుతున్న హత్యల మిస్టరీని ఛేదించేందుకు ఓ పోలీస్ ఆఫీసర్ చేసే దర్యాప్తు చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. ఈ చిత్రం ట్విస్టులతో సాగుతుంది.

ఈ చిత్రంలో నవీన్ చంద్రతో పాటు రియా హరి, అభిరామి, దిలీపన్, శశాంక్, రిత్విక, ఆడుకాలం నరేన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఆజ్మల్ ఖాన్, రియా హరి ప్రొడ్యూజ్ చేయగా.. ఇమాన్ సంగీతం అందించారు. కార్తీక్ అశోకన్ సినిమాటోగ్రఫీ చేయగా.. శ్రీకాంత్ ఎడిటింగ్ చేశారు.

ఎలెవెన్ స్టోరీలైన్

వైజాగ్‍లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఏసీపీ అరవింద్ (నవీన్ చంద్ర) రంగంలోకి దిగుతాడు. మిస్టరీని కనిపెట్టేందుకు దర్యాప్తు చేస్తాడు. అయితే, ఆరంభంలోనే సవాళ్లు ఎదురవుతాయి. అయితే, హత్యకు గురైన ఓ వ్యక్తి మృతదేహం వల్ల ఓ క్లూ లభిస్తుంది. ఆ తర్వాత ఊహించని విషయాలు బయటికి వస్తాయి. ఈ హత్యల మిస్టరీని అరవింద్ ఎలా ఛేదించాడు? దర్యాప్తులో ఎదురైన సవాళ్లు ఏంటి? అనేవి ఎలెవెన్ చిత్రంలో ప్రధాన అంశాలుగా ఉంటాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024