ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు

Best Web Hosting Provider In India 2024


ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్ ఏర్పాటు

HT Telugu Desk HT Telugu

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు,విద్యార్థులకు సహాయం అందించేందుకు, తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది.

జూన్ 16, 2025న టెహ్రాన్‌లో పేలుడు ధాటికి ఎగసిపడుతున్న పొగలు. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ స్టేట్ బ్రాడ్‌కాస్టర్ కొద్దిసేపు నిలిచిపోయింది. ఇరాన్ క్షిపణుల దాడిలో ఇజ్రాయెల్‌లో 11 మంది మరణించిన నాల్గవ రోజున టెహ్రాన్ అంతటా పేలుళ్లు సంభవించాయి. (AFP)

తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న తెలంగాణ వాసులు, విద్యార్థులకు సహాయం అందించేందుకు ఈ హెల్ప్ లైన్ పనిచేస్తుంది.

విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రెండు దేశాల భారత రాయబార కార్యాలయాల నుంచి లభించిన తాజా సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు తెలంగాణకు చెందిన ఎవరూ ప్రభావితమైనట్టు సమాచారం లేదు. అయినప్పటికీ, భవిష్యత్ పరిణామాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడమైనది.

ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ సీనియర్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో, ఆయా దేశాల రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదిస్తూ అవసరమైతే తక్షణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

సహాయం కోసం సంప్రదించాల్సిన హెల్ప్‌లైన్ నెంబర్లు

వందన, పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్ – +91 9871999044

జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – +91 9643723157

జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్ – +91 9910014749

సిహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి – +91 9949351270

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

Best Web Hosting Provider In India 2024


Source link